“ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్” తెలుగు  వెబ్ సీరిస్ రివ్యూ
x

“ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్” తెలుగు వెబ్ సీరిస్ రివ్యూ

ఓటిటీలలో మొదటి నుంచి హర్రర్ , మర్డర్ మిస్టరీ సిరీస్ లకు, సినిమాలకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది.


ఓటిటీలలో మొదటి నుంచి హర్రర్ , మర్డర్ మిస్టరీ సిరీస్ లకు, సినిమాలకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకు కారణం చెవిల్లో ఇయిర్ ఫోన్స్ పెట్టుకుని ఒక్కళ్లే కూర్చుని చూడాలనుకునే యంగ్ బ్యాచ్ ఎక్కువగా ఉండటమే. అయితే ఈ జోనర్ లో వచ్చే సినిమాలు , సిరీస్ లు డబ్బింగ్ వే ఎక్కువ శాతం ఉంటాయి. తెలుగులో వీటిని తీసే డైరక్టర్స్,నిర్మాతలు శాతం తక్కువ. కానీ ఇప్పుడు డైరక్ట్ తెలుగులో హర్రర్ సిరీస్ ని తీసుకొచ్చారు. ఈ సిరీస్ పేరు ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరిస్ ఎలా ఉంది. ఈ వీకెండ్ చూడటానికి ఈ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ బెస్ట్ ఛాయస్ అవుతుందా. చూద్దాం.

స్టోరీ లైన్

డాక్టర్ విశ్వక్సేన్ (అశుతోష్ రాణా) ఓ సైంటిస్ట్. అతనికి బోలెడు ఆస్ది. దాదాపు 24,000 కోట్ల రూపాయలు దాకా ఉంటుంది. అనుకోకండా ఓ ప్లైట్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అతని సంపదకు వారసులు ఎవరనేది మాత్రం అందరికి ఓ పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఆ ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని వీలునామా రాసాడని తెలుస్తోంది. అది అందుకోవటానికి ఓ కండీషన్ పెడతాడు.

విశ్వక్ కు మోక్ష అనే ప్రెవేట్ ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండ్‌పై వారం రోజులు ఎవరైతే గడుపుతారో వారికే తన ఆస్తిని ఇవ్వాలని విశ్వక్ తన వీలునామాలో రాసి ఉంటాడు. వచ్చినవారి అవసరాలన్ని విశ్వక్ మరో భార్య మాయ(అక్షర గౌడ) చూస్తుంది. ఈ క్రమంలో ఆయన టీమ్ తన ఫ్యామిలీ మెంబర్స్ అయిన వెంకట్(నందు), ఝాన్సీ(ప్రియా ఆనంద్), అదితి(సోనియా అగర్వాల్), మీనా(సుధ), ఇషా(తేజస్వి మదివాడ) ఇలా అందరికీ ఆ ఐలాండ్‌కి రమ్మని ఆహ్వానం వస్తుంది. ఆస్ది వాటాల కోసం అందరూ అక్కడకి మిస్ కాకుండా బయలు దేరి వెళ్తారు. అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది.

ఆ ఐలాండ్ కు వచ్చిన వారిలో ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం ఉండదు. అయితే, రోజులు గడిచేకొద్ది నికోబర్ లో ఉన్న ఆ ప్రైవేట్ ఐలాండ్ వెళ్లిన వారంతా అనుమానాస్పదంగా మిస్ అవుతూ ఉంటారు. , హత్యకు గురవుతుంటారు. వాటాలు తగ్గాలని, ఎక్కువ ఆస్తి పొందటం కోసమే వారిలో ఒకరు ఇలా అందరిని చంపేస్తున్నారనే అనుమానాలు మొదలవుతాయి.

ఆ ఐలాండ్‌లో ఏదో జరుగుతుందని వెంకట్ అండ్ టీమ్ అనుమానించి వారు ఇన్విస్టిగేషన్ లాంటిది మొదలు పెడతారు. ఈ క్రమంలో ఏమి తేలింది. అసలు ఆ హత్య లు చేస్తోంది ఎవరు ? ఆ మోక్ష ఐలాండ్ లో అసలు ఏం జరుగుతుంది ? చివరికి ఆస్తి ఎవరికీ దక్కుతుంది ? కథలో ప్రధానమైన ట్విస్ట్ ఏమిటి ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉంది

రెగ్యులర్ హాలీవుడ్ మిస్టర్ హారర్ సినిమాలు చూసేవారికి చాలా సార్లు ఇలాంటి ఐలాండ్ హత్యలు తరహా కథలు ఎదురౌతూనే ఉంటాయి. ఓ చోట మొత్తం అందరినీ సెట్ చేయటం, అక్కడ హత్యలు జరగటం, ఎవరా హత్యలు చేస్తున్నారో బయిటపడటం క్లైమాక్స్ గా ఈ తరహా థ్రిల్లర్ రెడీ అవుతాయి. దాంతో ఇలాంటివి గతంలో చూసినవారికి ఈ సీరిస్ చాలా ప్రెడిక్టబుల్ గా అనిపిస్తుంది. కొత్తగా ఏమీ అనిపించదు. అయితే దర్శకుడు అనీష్ కురువిల్లా మన ఇండియన్ ఫిలాసఫీని ఈ సినిమాలో చూపించటానికి ప్రయత్నం చేసారు.

ఈ కథలో భాగంగా మనుషులు తమకు సమస్య ఎదురైనప్పుడు, వాస్తవికత నుండి పారిపోవడానికి ప్రయత్నించే విధానాన్ని చాలా పాత్రల ద్వారా చూపించే ప్రయత్నం చేసారు. అలాగే మనిషిలో “స్వార్థం, ఆశ, కామం, క్రోధం” వంటి కంట్రోల్ చేసుకోలేనటువంటి ఎమోషన్స్ వల్ల మనిషులు ఎలా దిగజారుతాడు? ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి? వంటి అంశాలను తెరపై చూపించిన విధానం కూడా బాగుంది. అయిత ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు కదలనివ్వకుండా చూసేలా చేయేలేకపోయారు.

టెక్నికల్ గా ఈ సీరిస్ మంచి ఎక్సపీరియన్స్ నే ఇస్తుంది. ఒకే లొకేషన్ లో ఎక్కువ కథ నడిచినప్పుడు కెమెరామెన్ కు ప్రతీ షాట్ ఛాలెంజే. కానీ నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ వర్క్ నీట్ గా రిపీట్ అనిపించకుండా సాగింది. బీచ్ ఎపిసోడ్స్ ను బాగా డిజైన్ చేసారు. ఈ సిరీస్ కి ఆర్ట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ నీట్ గా ఫెరఫెక్ట్ గా చేసారని అర్దమవుతోంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఎంగేజింగ్ గా ఉండి, ఎడిటింగ్ లో స్లో తగ్గితే సీరిస్ ఇంకా బాగుండేది.

చూడచ్చా

కాలక్షేపానికి ఈ సీరిస్ బాగానే వర్కవుట్ అవుతుంది. ఎక్కువ ఆలోచించకుండా మన కళ్లను అప్పగించేస్తే అలా నడిచిపోతుంది.

ఎక్కడ చూడాలి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగులో ఈ సీరిస్ ఉంది.

Read More
Next Story