చూడదగ్గ థ్రిల్లర్ :  వికటకవి వెబ్ సీరిస్ రివ్యూ
x

చూడదగ్గ థ్రిల్లర్ : 'వికటకవి' వెబ్ సీరిస్ రివ్యూ

టైటిల్ చూడగానే తెనాలి రామకృష్ణ కథను తీసుకుని చేసారేమో, కామెడీ అనుకుంటాం కానీ ఓ థ్రిల్లర్ అని మొదటి ఎపిసోడ్ పూర్తయ్యేసరికే మనకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

టైటిల్ చూడగానే తెనాలి రామకృష్ణ కథను తీసుకుని చేసారేమో, కామెడీ అనుకుంటాం కానీ ఓ థ్రిల్లర్ అని మొదటి ఎపిసోడ్ పూర్తయ్యేసరికే మనకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మైథాలజీ టచ్ ఇస్తూ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సీరిస్ ...మనకు రెగ్యులర్ గా ఓటీటీలలో వస్తున్న సీరిస్ లకు ఏమీ తీసిపోదు. అందులోనూ మన తెలుగు మొహాలు ఉండటంతో బాగా కనెక్ట్ అవుతుంది. స్లో గా ఉంది అనే విషయం ఒక్కటి పక్కన పెడితే సీరిస్ మంచి థ్రిల్స్, ట్విస్ట్ లతో బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఇంతకీ ఈ సీరిస్ కథేంటి, హైలెట్స్,మైనస్ లు ఏమిటో చూద్దాం.

స్టోరీ లైన్

1950 కాలంలో జరిగే ఈ కథ నల్లమల అడవులు, చుట్టుపక్కల గ్రామాల్లో జరుగుతుంది. అక్కడ అమరగిరి అనే ప్రాంతంలో దేవతల గుట్ట అనేది ఉంటుంది. దేవతల గుట్ట మీద జాతర జరుగుతూంటే వందమంది దాకా వర్షం కురిసి చనిపోతారు. అదంతా దేవతల శాపంతో జరిగిందని భావించిన అక్కడి జనం అప్పటి నుంచి అటు వైపు వెళ్లారు. ఎవరైనా ధైర్యం చేసి వెళ్తే వారు గతం మర్చిపోయి..శరీరంలో స్పందన లేకుండా అయిపోతారు. అయితే నిజంగానే దేవతల శాపం పనిచేస్తుందా లేక వేరే ఏదైనా శక్తులు అక్కడ పనిచేస్తున్నాయా అనే సందేహంతో ఓ ప్రొఫసర్...హైదరాబాద్ లో ఉన్న డిటెక్టివ్ రామకృష్ణ(నరేష్ అగస్త్య) ని అక్కడకు పంపుతాడు. అక్కడ సమస్య పరిష్కరిస్తే డబ్బులు వస్తాయి. వాటితో తన తల్లికి ఆపరేషన్ చేయించొచ్చు అని రామకృష్ణ వెళ్తాడు.

రామకృష్ణకు అక్కడ కొన్ని సమస్యలు ఎదురౌతాయి. మొదట అమరగిరి రాజు(శిజు మీనన్) ఏ సమస్య లేదని వెళ్లిపొమ్మన్నా, ఆయన మనవరాలు లక్ష్మి(మేఘ ఆకాష్) కోరికపై రామకృష్ణ అక్కడ ఉంటాడు. డిటెక్షన్ మొదలెడతాడు. ఆ క్రమంలో ఏం తేలిసింది. అసలు అడవిలో ఏం జరుగుతుంది అసలు దేవతల గుట్ట దగ్గర ఏం జరిగే విషయం ఏమిటి? అక్కడికి వెళ్లినవాళ్లందరికి మతి పోవడానికి కారణం వేరే ఏదైనా ఉందా? చివరకు డిటెక్టివ్ రామకృష్ణ ఈ సమస్య పరిష్కరించాడా?రాజు అల్లుడు ఎమ్మెల్యే రఘుపతి (రఘు కుంచె) పాత్ర ఏమిటి.. వంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ

వికటకవి అనగానే తెనాలి రామకృష్ణ గుర్తు వస్తారు. ఓ థ్రిల్లర్ వెబ్ సీరిస్ కు ఆ పేరు పెట్టడంతో ఈ సీరిస్ పై ఆసక్తి ఏర్పడిందనటంలో సందేహం లేదు. దానికి తోడు డిటెక్టివ్ కథలు ఎప్పుడూ ఆసక్తే. అందులోనూ థ్రిల్లింగ్ నేరేషన్ లో చెప్తే ఆ కిక్కే వేరు. అలాగే ఈ సీరిస్ మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చారు. అసలెందుకు ఆ సంఘటనలు జరుగుతున్నాయి. ఎవరు వీటి వెనక ఉన్నారు..డిటెక్టివ్ వీటిని ఎలా ఛేదించారు అన్న పాయింట్ ని చివరిదాకా రైజ్ చేసి క్యూరియాసిటీ నిలబెట్టారు. ఇక ప్రతి పాత్రను ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్ది స్క్రీన్ ప్లేని రాసుకున్నారు.

ఈ వెబ్ సీరిస్ లలో హై పార్ట్ ఏమిటంటే...సస్పెన్స్ తో కలిసిన మంచి డ్రామాని తీసుకురావటం. కథలో రిజల్యూషన్ ఇచ్చేదాకా టెన్షన్ పెంచుకుంటూ వెళ్ళారు. అలాగే ప్రతీ ఎపిసోడ్ ఎండ్ ని ట్విస్ట్ లతో రన్ చేశారు. సస్పెన్స్, టెన్షన్ ఈ నేరేషన్ కు ఫౌండేషన్ గా వేసుకున్నారు. ఆ విషయంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సస్పెన్స్, డ్రామా, చరిత్ర ఈ మూడింటిని కలిపి తయారు చేసుకున్న స్టోరీ లైన్ ఇంట్రస్ట్ గానే సాగింది. కొన్ని ట్విస్ట్ లు బాగానే పేలాయి. అయితే రైటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. రియలిజంకు జానపదం ను కలిపి ముడి వేయడం కొత్తగా అనిపిస్తుంది. అలా చేయడం వల్ల సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ నమ్మదగినవిగా ఉన్నాయి.

కానీ ప్రారంభంలో ఈ సీరిస్ మూడు ఎపిసోడ్స్ వరకూ బాగానే ఉన్నా వెళ్లే కొలదీ పేస్ బాగా ఫ్లాట్ గా అయ్యింది. సబ్ ప్లాట్స్ మీద ఇంకా వర్కవుట్ చేయాల్సింది. స్టాక్ క్యారక్టర్స్, రెగ్యులర్ స్టోరీ టెల్లింగ్ కొంత ఇబ్బంది పెట్టాయి. లవ్ స్టోరీ అనవసరం అనిపించింది. అయితే విలన్ ఎవరో ముందే తెలిసిపోయినా..అతను అలా ఎందుకయ్యాడనేది చివరిదాకా ఎంగేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకాస్త రైటింగ్ మీద దృష్టి పెట్టి ఉంటే నెక్ట్స్ లెవెల్ కు వెళ్లేది అనిపించింది. క‌థ‌లోని పాత్ర‌ల్ని ట్విస్టుల‌కు అనుగుణంగా వాడుకొన్న విధానం బాగుంది.

టెక్నికల్ గా..

ఇలాంటి థ్రిల్లర్ సీరిస్ లకు సినిమాలకు కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. అవి రెండు ఈ సీరిస్ కు సీరియస్ గా కుదిరాయి. పీరియడ్ సీన్స్, నైట్ ఎఫెక్ట్ సీన్స్ పై స్పెషల్ దృష్టి పెట్టారు. అడవుల్లో సీన్స్ బాగా డిజైన్ చేశారు. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా నిర్మాత‌లు ఖ‌ర్చు పెట్టారు. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. తెలంగాణా సాంగ్ డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే ఆర్టిస్ట్ లలో కొందరు ఆ సాంగ్ ని సరిగ్గా డబ్బింగ్ చెప్పలేకపోయారు

ఫెరఫార్మెన్స్ లలో నగేష్ అగస్త్య, రఘు కుంచె ఇద్దరూ బాగా చేశారు. రఘుకుంచె విలన్ గా నటన చాలా ఇంటెన్స్ సాగింది. త‌న అనుభ‌వాన్ని రంగ‌రించారు. మేఘా ఆకాష్ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్. అంతకు మించి చెప్పుకోవటానికి లేదు.

చూడచ్చా

ట్విస్టుల్ని న‌మ్ముకొన్న సీరిస్ ఇది. స్లో పేస్ ని కాస్త భ‌రించాలి. ఈమ‌ధ్య వ‌చ్చిన చాలా సినిమాల‌కంటే ఇది బెట‌ర్ అవుట్ పుట్ ఇచ్చింద‌నే చెప్పాలి. ఓసారి చూడ్డానికికైతే ఎలాంటి ఢోకా లేని సీరిస్ ఇది.ఒక థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ చూసిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది.

ఎక్కడ చూడచ్చు

Zee5లో తెలుగులో ఉంది, ఒక్కో ఎపిసోడ్‌ సుమారు 40 నిమిషాల నిడివి ఉంది.

Read More
Next Story