‘ వ్యక్తిగత ద్వేషంతోనే ఇలా చేశారు’: ధనుష్ నోటీసులపై నయనతార కౌంటర్
x

‘ వ్యక్తిగత ద్వేషంతోనే ఇలా చేశారు’: ధనుష్ నోటీసులపై నయనతార కౌంటర్

ఇద్దరు కోలీవుడ్ సూపర్ స్టార్ల మధ్య చాలాకాలంగా ఉన్న వైరం బయటపడింది. నయనతార జీవిత చరిత్రపై నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ పై ధనుష్ అభ్యంతరం..


కోలీవుడ్ సూపర్ స్టార్లు అయిన ధనుష్, నయనతార మధ్య వివాదం రాజుకుంది. ‘‘ నానుమ్ రౌడీ ధాన్’’ సినిమాలోని మూడు సెకన్ల క్లిప్ ను వాడుకున్నందుకు రూ. 10 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని హీరో ధనుష్ నోటీస్ పంపడంతో, నయనతార దానికి కౌంటర్ గా బహిరంగ లేఖ రాసి కౌంటర్ ఇచ్చింది.

నానుమ్ రాడీ ధాన్ చిత్రానికి ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇద్దరి స్టార్లకు గొడవలు జరిగినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఎన్నడూ బయటకురాలేదు. తాజాగా నయన తార రాసిన లేఖతో విషయం స్పష్టమైంది.

తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న నయనతార డాక్యుమెంటరీ ‘‘ నయనతార: బియాండ్ ఆఫ్ ది ఫెయిర్ టెయిల్’’ ప్రోమో విడుదల అయింది. అందులో ఈ సినిమా సంబంధించి మూడు సెకన్ల క్లిప్ ను వాడుకున్నారు. దీనికి ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నష్టపరిహారం చెల్లించాలని నోటీస్ పంపారు.
నయనతార తన లేఖలో దీనికి వివరణ ఇచ్చారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు ధనుష్ నుంచి నో అబ్ జెక్షన్ సర్టిఫికెట్ కోసం వేచి చూశామని, కానీ ఆయన నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో సినిమాలోని పాటలు, డ్యాన్సులు వాడుకోలేకపోయామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న డాక్యుమెంటరీలో రీ ఎడిటింగ్ చేశామని చెప్పుకొచ్చారు.
“ మా వ్యక్తిగత డాక్యుమెంటరీలో చిత్రీకరించబడిన కొన్ని వీడియోల (కేవలం 3 సెకన్లు) వాడుకోవడాన్ని మీరు ప్రశ్నించిన ఆ లైన్‌లను చదివి నేను చాలా ఆశ్చర్యపోయాము. కానీ ఆ క్లిపులన్నీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి BTS విజువల్స్ కోసం మీరు రూ.10 కోట్ల మొత్తాన్ని క్లెయిమ్ చేశారు. మూడు సెకన్ల కోసం అంత మొత్తం లో చార్జ్ చేశారు’’ అని లేడీ సూపర్ స్టార్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
మీరు ప్రతిసారి ఆడియో ఫంక్షన్లలో అనేక నీతి వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ ఈ నోటీసులో మీరు ప్రవచించే సూత్రాలు ఏవీ పాటించరని అర్థమవుతోంది. మీరు నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఆడియో లాంఛ్ సమయంలో నాపై మీరు వెలువరించిన అభిప్రాయాలు కూడా అలానే ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది.
వ్యక్తిగత ద్వేషమా?

ధనుష్ వెలువరించిన అభిప్రాయాలు మాపై వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కడమే అన్నారు. ధనుష్ తిరస్కరణ అనేది వ్యాపారపరమైన ఒత్తిడులు, ఆర్థిక పరమైన సమస్యల వల్ల వచ్చినట్లయితే అర్థం చేసుకోవచ్చని, కానీ ఈ పరిస్థితి అలా లేదని అన్నారు. నిర్మాత సెట్ లోని వ్యక్తిగత జీవితాలను సైతం నియంత్రించడం సాధ్యం కాదనే వ్యాఖ్యలతో నానుమ్ రౌడీ ధాన్ చిత్రంతోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.
సినిమా విషయంలో ఇబ్బంది..
“ నానుమ్ రౌడీ ధాన్ సినిమా విడుదలై దాదాపు 10 సంవత్సరాలు అయ్యింది. ఇది మీ నిర్మాణంలో వచ్చిన బిగ్గెస్ట్ హిట్. నేటీకీ ఆ సినిమాను అందరూ ఇష్టపడతారు. అయితే మీరు మాత్రం ఈ సినిమాతో బాగా హర్ట్ అయ్యారని తెలిసింది. కానీ మీరు మాత్రం మాపై వెలువరించి విషయాలను నేను ఎన్నటీకీ మర్చిపోను. విడుదలకు ముందు మీరు చెప్పిన మాటలు మాకు మాయని మచ్చలుగా మిగిలాయి.’’ అని నయనతార లేఖలో అప్పటి విషయాలను ప్రస్తావించారు.
నేను ఎవరి అండదండలు లేకుండానే ఎదిగాను..
నేను సినీరంగంలో ఎవరీ అండదండలు లేకుండా ఎదిగానని చెబుతూనే, ధనుష్ నేపథ్యాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. ‘‘ మిస్టర్ ధనుష్, కే రాజా, కస్తూరీ రాజా కుమారుడు, డైరెక్టర్ సెల్వరాఘవన్ సోదరుడు’’ అని లేఖ లో వ్యంగ్యంగా ప్రస్తావించింది.
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ లో ఒకసాధారణ మహిళ మధ్యతరగతి నుంచి సూపర్ స్టార్ అయ్యే వరకూ సాగిన నేపథ్యాన్ని వివరిస్తుంది. ఈ డాక్యుమెంటరీలో రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, నాగార్జున అక్కినేని వంటి నటులు వ్యాఖ్యలు ఉన్నాయి.
“నేను, నా జీవితం, నా ప్రేమ, వివాహం గురించిన వివరాలు ఉన్నాయి. ఈ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో చాలా మంది నా పరిశ్రమ శ్రేయోభిలాషుల క్లిప్‌లు ఉన్నాయి, వారు దయతో సహకరించారు. వారితో అనేక చిత్రాల జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ తనకు అత్యంత ప్రత్యేకమైన, ముఖ్యమైన చిత్రం నానుమ్ రౌడీ ధాన్ ” అని రాసింది. ధనుష్ లీగల్ నోటీసుపై నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో స్పందించారు.
Read More
Next Story