
ప్రభాస్ కోసం ‘హోంబలే బ్లాక్‌బస్టర్’ యూనివర్స్?
ముగ్గురు డైరెక్టర్లు… మూడు ప్రపంచాలు –ఒక్కడే ప్రభాస్
ఇండియన్ సినిమా స్కేల్‌లో ప్రభాస్ పేరు ఇప్పుడు ఒక బ్రాండ్, మార్కెట్, మూడ్. ఆయన సినిమా అంటే పాన్ ఇండియా బాక్సాఫీస్‌లో అలజడి ఖాయం. అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ పేరు వినిపిస్తేనే పాన్ ఇండియా రేంజ్ గుర్తుకు వస్తుంది. కేజీఎఫ్, కాంతారా,సలార్, మహావతార నరసింహా వంటి సూపర్ హిట్స్‌తో దూసుకెళ్తోంది ఈ బ్యానర్.
ఇక ఆ స్టార్ పవర్‌కు హోంబలే ఫిల్మ్స్ లాంటి విజన్ ఉన్న బ్యానర్ జత అయితే? — అది బిజినెస్‌గా, క్రియేటివ్‌గా, కల్చరల్ ఇంపాక్ట్‌గా ఒక గేమ్‌చేంజర్ కాంబినేషన్. అందుకే ఇప్పటికే ప్రబాస్ తో పనిచేసిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ప్రభాస్‌తో ఒక భారీ డీల్ కుదుర్చుకుందని సమాచారం.
అవును — హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్‌తో మూడు సినిమాల డీల్ చేసుకుని, వాటికి మూడు బిగ్ డైరెక్టర్లను లాక్ చేసినట్టుగా టాలీవుడ్ టాక్!
ఇందులో ఒకటి ఇప్పటికే అధికారికంగా కన్ఫర్మ్ — ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2!, రెండో సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్లాన్ అవుతోంది, ఇది సూపర్ నేచురల్ యూనివర్స్‌లో సెటప్ అయ్యే సినిమా అని చర్చ. మూడో సినిమా మాత్రం హను రాఘవపూడితో అని ఇండస్ట్రీలో బలమైన బజ్!
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే — హను రాఘవపూడి ఇప్పటికే ప్రభాస్‌తో ఫౌజీ అనే భారీ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు (మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో). ఇప్పుడు హోంబలేలో వారి కాంబో మరోసారి రిపీట్ అవుతుందట!
ప్రభాస్‌తో సినిమా చేయడం వల్ల డైరెక్టర్లకు, బ్యానర్లకు వచ్చే ఎడ్వాంటేజ్లు:
పాన్-ఇండియా విస్తృతి:
ప్రభాస్ సినిమాలు కేవలం తెలుగు ప్రేక్షకుల వరకే పరిమితం కావు. ఆయనకు నార్త్, కేరళ, కర్ణాటక, విదేశీ మార్కెట్లలోనూ సాలిడ్ బేస్ ఉంది. అంటే ఒక సినిమా చేస్తే, అది నేరుగా ఐదు భాషల్లో మల్టిప్లై అవుతుంది.
స్టార్ పవర్‌తో ఫండింగ్ ఈజీ:
ప్రభాస్ సినిమా అంటే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లో ఆటోమేటిక్. పెద్ద బ్యానర్లు, డిస్ట్రిబ్యూటర్లు, OTTలు ముందే రెడీగా ఉంటారు.
విజువల్ యాంబిషన్:
ప్రభాస్ సినిమాల స్పేస్ అంటే పెద్ద కాన్వాస్. ఇది డైరెక్టర్లకు బోల్డ్ విజువల్స్, విస్తృతమైన యూనివర్స్‌లు క్రియేట్ చేయడానికి ఫ్రీడమ్ ఇస్తుంది.
ఇమేజ్ రీ-ఇన్‌వెన్షన్ ఛాన్స్:
రాధే శ్యామ్, ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ కూడా కొత్త న్యారేటివ్ టెంప్లేట్స్ కోసం వెతుకుతున్నారు. యాక్షన్ సినిమాలకే ప్రయారిటీ ఇస్తున్నాడు. అయితే అందులో విభిన్న కథలు ఎంచుకుంటున్నాడు. అది హిస్టారికల్ ఫిక్షన్ ఫౌజీ కావచ్చు, హారర్ కామెడీ ది రాజా సాబ్ కావచ్చు. అంటే డైరెక్టర్లకు ప్రభాస్ ఇమేజ్‌ను కొత్త కోణంలో చూపించే అవకాశం ఇస్తున్నాడు.
హోంబలే ఫిల్మ్స్ ఎందుకు ప్రభాస్‌నే ఎంచుకుంది:
స్ట్రాటజిక్ సింక్:
హోంబలే ఫిల్మ్స్ తమ సినిమాల్లో హీరోలను “సిస్టమ్‌కు వ్యతిరేకంగా పోరాడే మాసివ్ ఫిగర్స్”గా చూపుతుంది. KGFలో రాకీ భాయ్, Salaarలో దేవ — ఇవి అన్ని “రెబెల్ స్పిరిట్” సింబల్స్. అదే డిఎన్‌ఏ ప్రభాస్‌లో ఉంది. ఆయన ప్రెజెన్స్‌తో ఆ “లార్జర్ దాన్ లైఫ్” నారేటివ్ మరింత బలపడుతుంది.
క్రియేటివ్ డైవర్సిటీ:
ప్రభాస్‌తో మూడు సినిమాలు – కానీ మూడు వేర్వేరు డైరెక్టర్లు:
ప్రశాంత్ నీల్ – మాస్, రగ్డ్ యాక్షన్ వరల్డ్ (Salaar 2)
ప్రశాంత్ వర్మ – స్టైలైజ్డ్ సూపర్‌నేచురల్ యూనివర్స్
హను రాఘవపూడి – ఎమోషనల్ డ్రామా, పీరియడ్ క్లాస్ టచ్
హోంబలే ఈ కాంబోతో ప్రభాస్ ఇమేజ్‌కి డైమెన్షన్ యాడ్ చేయడం లక్ష్యం.
పాన్-ఇండియా ఎకానమీ బూస్ట్:
ప్రభాస్ సినిమాలు నార్త్‌లో భారీ ఓపెనింగ్స్ కలిగి ఉంటాయి. హోంబలే ప్రొడక్షన్ క్వాలిటీ దాంతో కలిస్తే — అది హాలీవుడ్ లెవెల్ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ సినిమా అవుతుంది.
ఏదైమైనా...
మూడు సినిమాలు… మూడు డైరెక్టర్లు… మూడు విభిన్న ప్రపంచాలు — ప్రభాస్ కోసం హోంబలే బ్లాక్‌బస్టర్ యూనివర్స్ రెడీ చేస్తున్నట్టే!
హోంబలేకు ఇది “ప్రభాస్ అనే బ్రాండ్‌తో గ్లోబల్ లెవెల్ బ్లాక్‌బస్టర్ యూనివర్స్” నిర్మించే అవకాశం. ప్రభాస్‌కి ఇది “తన ఇమేజ్‌ను పునరుద్ధరించే, విభిన్న దిశల్లో ప్రయోగించే” ప్లాట్‌ఫారమ్.
మూడు సినిమాలు… మూడు దృక్పథాలు… ఒకే స్టార్ పవర్ – ప్రభాస్ మరియు హోంబలే కలిసి ఇండియన్ సినిమా మ్యాప్‌నే రీడ్రా చేయబోతున్నారనే ఫీలింగ్ ఇండస్ట్రీ మొత్తానికి స్పష్టంగా కనపడుతోంది! ఇంకా ఒక్కో అప్‌డేట్ బయటకి వస్తే టాలీవుడ్ షేక్ అవుతుందనడంలో సందేహం లేదు!
“ఈ మూడు సినిమాల్లో ఏది ప్రభాస్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది?”
సమాధానం వచ్చే రెండేళ్లలోనే ఇండియన్ బాక్సాఫీస్ చెబుతుంది.