నందమూరి మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ టైటిల్  ఇదే?, ఇంట్రస్టింగ్
x

నందమూరి మోక్షజ్ఞ లాంచింగ్ మూవీ టైటిల్ ఇదే?, ఇంట్రస్టింగ్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు అతి త్వరలోనే రాబోతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.


నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు అతి త్వరలోనే రాబోతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. అందరు అనుకున్నట్లుగానే, అలాగే బాలకృష్ణ ఎప్పటి నుంచో చెబుతున్నట్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు. ఇప్పుడు ఈ కాంబోకి సంబంధించి కొన్ని క్రేజీ వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన ఆహా అన్ స్టాపబుల్ షోకు ప్రశాంత్ వర్మ వర్క్ చేసారు. స్పెషల్ గా యాడ్స్ డిజై్ చేసారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే బాలయ్య తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను కూడా ప్రశాంత్ వర్మ చేతుల్లోనే పెట్టాడని తెలుస్తోంది. దానికి తోడు హనుమాన్ చూసిన తర్వాత ఆయన నమ్మకం రెట్టింపు అయ్యింది. యంగ్ హీరోని చూపించిన విధానం, మైథాలిజీ టచ్ బాలయ్యకు బాగా నచ్చాయి.

ఇక మోక్షజ్ఞ విషయానికి వస్తే...గతంలో చాలా బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యి ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తున్నారు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం. వీటిని చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం తన స్టైలిష్ లుక్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన మోక్షు.. ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అలాగే.. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని మరో ట్వీట్‌ చేశాడు.

రీసెంట్ గా తన డెబ్యూ మూవీపై మరో అప్ డేట్ ఇచ్చాడు బాలయ్య వారసుడు. అలాగే తన సినిమా షూట్ కూడా స్టార్ట్ పోయినట్లు చెప్పుకొచ్చాడు. ‘ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని మీ అంచనాలను మించి ఉంటాయి’ అని ట్వీట్ చేశాడు మోక్షజ్ఞ. ఈ పోస్టుకు హైఫై, బ్లాస్ట్, ఫైర్ ఏమోజీలు జత చేశాడు. అలాగే తన పోస్ట్ కు డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కూడా ట్యాగ్ చేశాడు.

ఈ క్రమంలో మోక్షజ్ఞ చేయబోతున్న ఫస్ట్ మూవీ టైటిల్ ఏమై ఉంటుంది. ఏ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు, మూవీ ఎప్పుడు రిలీజ్ ఉంటుంది? హీరోయిన్ ఎవరు? స్టోరీ ఎలా ఉండబోతోంది? బాలయ్య ఉంటారా? అనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి.

ఇక మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు మోక్షజ్ఞ తొలి చిత్రానికి 'గాండీవ' అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే గతంలో 1994లో బాలకృష్ణ, అక్కినేని కాంబినేషన్లో ప్రియదర్శన్ దర్శకత్వంలో గాండీవం అనే టైటిల్ తో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా ఆడలేదు. దాంతో ఈ టైటిల్ ఓకే చేసేముందు బాలయ్య ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే అవకాసం ఉంది. ఇక బాలయ్యకు ఈ టైటిల్ నచ్చినా అఫీషియల్ గా అయితే ఇప్పడిప్పుడే ప్రకటించరు.

ఈ చిత్రానికి తన కుమార్తె తేజస్వినీనే ప్రొడ్యూస్ చేయనున్నట్లు బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్​డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబరులో మొదలుపెట్టాలనుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డైరక్టర్, ప్రొడ్యూసర్ దాదాపు కన్ఫమ్ అయిపోగా మిగిలిన నటీనటులు ఎవరనేది తెలుసుకునేందుకు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Read More
Next Story