కొత్త సినిమాలుని కొంప ముంచిన కాంచన !
x

కొత్త సినిమాలుని కొంప ముంచిన 'కాంచన' !

ఇదెక్కడి ట్విస్ట్ రా మామా


సంక్రాంతి సందడి అయిపోయింది.. బాక్సాఫీస్ వద్ద నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అనుకుంటున్న టైంలో ఒక అరాచకం మొదలైంది! కొత్త సినిమాలు థియేటర్లకు రావడానికి జంకుతుంటే, ఒక పాత సినిమా రీ-రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అసలు ఆ సినిమా ఏంటి? వచ్చే వారం బాక్సాఫీస్ వద్ద జరగబోయే ఆ రక్తపాతం వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడు ఒక వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలు కరువవ్వడంతో థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. ప్రేక్షకులకు సరైన ఆప్షన్స్ లేని ఈ టైంలో, హారర్ క్లాసిక్ 'కాంచన'ను రీ-రిలీజ్ చేసి మేకర్స్ ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ అనలిస్టులకే ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. అసలు కొత్త సినిమాల కంటే పాత సినిమాకే ఎందుకు జనాలు క్యూ కడుతున్నారో అర్థం కాక ఇండస్ట్రీ తల పట్టుకుంటోంది.

కాంచన మాస్ మేనియా :

నిజానికి రీ-రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో సర్వసాధారణం అయిపోయింది. కానీ, ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన 'కాంచన' ప్రస్తుతం థియేటర్లలో పూనకాలు తెప్పిస్తోంది. గ్యాప్ దొరికితే చాలు తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎలా ఆదరిస్తారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. కొత్త కంటెంట్ లేకపోవడంతో, పాత భయాన్నే మళ్ళీ ఎంజాయ్ చేయడానికి జనం ఎగబడుతున్నారు. దీనివల్ల థియేటర్ల యజమానులకు కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది.

తమిళ స్టార్, దర్శకుడు రాఘవ లారెన్స్ స్వీయ డైరెక్షన్‌లో తెరకెక్కించిన చిత్రం కాంచన(ముని-2). 2011లో రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్‌ అభిమానులను ఓ రేంజ్‌లో భయపెట్టేసింది. ముని సిరీస్‌లో వచ్చిన రెండో చిత్రమే కాంచన. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, కోవై సరళ, లక్ష్మీ రాయ్, దేవదర్శిని, శ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సరికొత్త 4కె వర్షన్‌లో ఈ సినిమాను రీ రిలీజ్ చేసారు. ఈనెల 13న కాంచన థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రాన్ని హార్రర్- కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి అప్పట్లోనే రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రీరిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా రూ.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా దాదాపు రూ.3.35 కోట్ల గ్రాస్‌తో సెన్సేషనల్ ఓపెనింగ్ నమోదు చేసింది. సాధారణ రీరిలీజ్ సినిమాలకు చాలా అరుదైన విషయం. కొన్ని కొత్త సినిమాలు కూడా మొదటి రోజే ఇంత వసూళ్లు సాధించలేని పరిస్థితుల్లో ‘కాంచన’ ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం విశేషమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే వీకెండ్‌లో వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముందుంది అసలైన జాతర :

అయితే ఈ నిశ్శబ్దం ఎక్కువ కాలం ఉండదు. వచ్చే వారం బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం మొదలవ్వబోతోంది. ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ రెండు భారీ సినిమాలు థియేటర్లలో ల్యాండ్ అవుతున్నాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం 'ఉస్తాద్ భగత్ సింగ్', రెండోది భారీ అంచనాలున్న 'ధురందర్ 2'. పవన్ కళ్యాణ్ మాస్ పవర్ తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. అటు 'ధురందర్ 2' కూడా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

మొత్తానికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మళ్ళీ వసంతం రాబోతోంది. ఉగాది పండుగ సీజన్ తో థియేటర్లు మళ్ళీ కళకళలాడనున్నాయి. 'కాంచన' ఇచ్చిన బూస్ట్‌తో మొదలైన ఈ జోరు, ఉస్తాద్ భగత్ సింగ్ రాకతో ఏ రేంజ్ కు చేరుతుందో చూడాలి. బాక్సాఫీస్ వద్ద ఈసారి రికార్డుల వేట మొదలవ్వడం ఖాయం!

Read More
Next Story