
పూరి జగన్నాథ్‌కు ఎగ్జిబిటర్ల షాక్. రిలీజ్ కష్టమేనా?
పూరి బాకీలు.. బయ్యర్లు రివర్స్
ఒకప్పుడు టాలీవుడ్‌ను తన డైలాగులతో థియోటర్స్ ని షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పుడు తన సొంత సినిమాను థియేటర్ల వరకు తెచ్చుకోవడానికి అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారు! లైగర్ , డబుల్ ఇస్మార్ట్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఇప్పుడు ఆయన మెడకు ఉచ్చులా బిగుస్తున్నాయా?
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం కెరీర్ లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఆయన గత రెండు చిత్రాలు ‘లైగర్’ , ‘డబుల్ ఇస్మార్ట్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అవ్వడమే కాకుండా , బయ్యర్లను , ఎగ్జిబిటర్లను నిలువునా ముంచేశాయి. ఈ సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు బాకీలు చెల్లించాల్సిన బాధ్యత పూరిపైనే పడింది. ఏళ్ళ తరబడి వేచి చూస్తున్న బయ్యర్ల సహనం ఇప్పుడు నశించింది. పాత బాకీలు తీర్చకుండా పూరి కొత్త సినిమా ‘స్లమ్‌డాగ్’ (Slumdog) ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనివ్వబోమని ట్రేడ్ వర్గాలు తెగేసి చెబుతున్నాయి.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం నాన్-థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేసి , రిలీజ్ డేట్ ప్రకటించే పనిలో ఉన్నారు. అయితే , సీన్ కట్ చేస్తే గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి భయంకరంగా ఉంది. ‘లైగర్’ కొని కోట్లు నష్టపోయిన వరంగల్ శ్రీను ఇండస్ట్రీ నుంచే మాయమైపోగా , ‘డబుల్ ఇస్మార్ట్’ తో హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి కూడా భారీ నష్టాలు మిగిలాయి. పాత బాకీలు క్లియర్ చేయకుండా థియేట్రికల్ డీల్స్ క్లోజ్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది.
ఈ గొడవల వల్ల కేవలం కొత్త సినిమాలే కాదు , కనీసం ‘పోకిరి’ రీ-రిలీజ్ ను కూడా ఎగ్జిబిటర్లు అడ్డుకున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూరి జగన్నాథ్ బాకీలు తీర్చేవరకు ఆయన సినిమాలను బహిష్కరించాలని పలువురు ఎగ్జిబిటర్లు , డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ‘స్లమ్‌డాగ్’ విడుదల కావాలంటే , పూరి భారీ మొత్తంలో సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే విజయ్ సేతుపతి లాంటి స్టార్ ఉన్నా , ఈ సినిమాకు థియేటర్లు దొరకడం గగనమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి పూరి జగన్నాథ్ చుట్టూ ఉన్న సమస్యల వలయం ఆయన కెరీర్ కే సవాల్ గా మారింది. మరి ఈ సంక్షోభం నుంచి పూరి ఎలా గట్టెక్కుతారు? ‘స్లమ్‌డాగ్’ తో మళ్ళీ పూర్వవైభవం అందుకుంటారా లేక పాత బాకీల సెగలో ఈ సినిమా కూడా ఆగిపోతుందా అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. పూరి నెక్స్ట్ మూవ్ ఏంటో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

