మాస్ జాతర నుంచి అఖండ 2 దాకా..
x
టాలీవుడ్ లో త్వరలో విడుదల కాబోతున్న సినిమాలు

'మాస్ జాతర' నుంచి 'అఖండ 2' దాకా..

రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్, కారణం ఎవరు?


ఒక పెద్ద సినిమాకి రిలీజ్ డేట్ అనేది కేవలం క్యాలెండర్ లో ఒక రోజు కాదు – అది మొత్తం బాక్సాఫీస్ బిజినెస్ ని నిర్వచించే ఆక్సిజన్ పాయింట్. డేట్ ఒకసారి అనౌన్స్ చేస్తే.., ఆ రాత్రే హడావిడి మొదలైపోతుంది.
డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, మార్కెటింగ్ టీమ్స్ తమ ప్లానింగ్ ను లాక్ చేస్తారు. మల్టిప్లెక్స్‌లు షెడ్యూల్స్ ఫిక్స్ చేస్తాయి, ఓవర్సీస్ బయ్యర్లు ప్రమోషన్ క్యాంపైన్స్ కి వెళ్తారు. అదే ఒక డేట్ వెనక్కి తీసుకుంటే, అది కేవలం మూవీ డిలే కాదు – మొత్తం ఫైనాన్షియల్ ఈకోసిస్టమ్ పై చైన్ రియాక్షన్. సినిమా ట్రేడ్ మార్కెట్స్‌లో ఇదే ఫార్ములా స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక గత కొంతకాలంగా తెలుగు పరిశ్రమలో విడుదల తేదీ గందరగోళం కొనసాగుతోంది. ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. ఒక ట్రేడ్ అనలిస్ట్ మాటల్లో చెప్పాలంటే “డేట్ లేకపోవడం అంటే కస్టమర్ కి టికెట్ లేకపోవడమే. సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇవ్వకపోతే, బజ్ లాస్, ట్రేడ్ లాస్, ఆడియెన్స్ లాస్—all three happen at once.”
తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు విడుదల తేదీల విషయంలో ఎదుర్కొంటున్న గందరగోళం ఇప్పుడు ఇండస్ట్రీ బిజినెస్ సర్కిల్స్ లో పెద్ద చర్చగా మారింది.
👉 రవితేజ – మాస్ జాతర
రవితేజ వింటేజ్ మూవీగా వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 27 అని రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ అక్టోబర్ 31కి షిఫ్ట్ అయ్యిందని ట్రేడ్ బజ్. అయితే టీమ్ అధికారికంగా ప్రకటించకపోవటంతో మార్కెట్‌లో కన్ఫ్యూజన్ కలిగిస్తోంది. “డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ముందే డబ్బు పెట్టారు, కానీ డేట్ ఫిక్స్ కాకపోవడం వల్ల వాళ్ల లిక్విడిటీకి దెబ్బ తగులుతోంది” అని ట్రేడ్ టాక్.
👉 తేజ సజ్జా – మిరై
పీపుల్స్ మీడియా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అని చెప్పినా, 12 లేదా 19కి వాయిదా అని టాక్. “యూత్ మార్కెట్‌లో మిరై కి ఉన్న బజ్ ను క్యాష్ చేసుకోవాలి అంటే క్లియర్ డేట్ అవసరం. లేట్ అయితే హైప్ తగ్గిపోతుంది” అని ఓ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు.
👉 అనుష్క – క్రిష్ – ఘాటి
అనుష్కకు రీ ఎంట్రి లాంటి చిత్రం ఇది. ఇప్పటికే వాయిదాలతో ఇబ్బంది పడ్డ ఈ సినిమా మళ్లీ అనిశ్చితిలో ఉంది. ఇండస్ట్రీలో టాక్ – “ఒక సినిమా రిలీజ్ డేట్ పదే పదే మార్చుకుంటే, ఇన్వెస్టర్లకు ఆ ప్రాజెక్టుపై నమ్మకం తగ్గిపోతుంది” .
👉 దుల్కర్ సల్మాన్ – కాంత
సెప్టెంబర్ 12కి రిలీజ్ డేట్ ప్లాన్ చేసినా, మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వాయిదా తప్పదని చెబుతున్నారు. “గ్లోబుల్ మార్కెట్‌కి కాంత లాంటి పీరియడ్ డ్రామా వర్కౌట్ కావాలి అంటే రిలీజ్ స్ట్రాటజీ క్లారిటీ తప్పనిసరి” అని ఒక ఓవర్సీస్ బయ్యర్ అభిప్రాయం.
👉 బాలకృష్ణ – బోయపాటి – అఖండ 2
సెప్టెంబర్ 25న రిలీజ్ అని అనౌన్స్ చేసినా, డిసెంబర్ మొదటి వారం కి షిఫ్ట్ అవుతుందన్న టాక్. “అఖండ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ వేరు, కానీ డేట్ కన్‌ఫ్యూజన్ వలన Pawan Kalyan’s OGతో కలెక్షన్స్ వార్ ఎలా జరుగుతుందో చూడాలి” అని ఓ ట్రేడ్ ఇన్‌సైడర్.
అయితే ఎందుకు రిలీజ్ డేట్స్ సమస్యలు వస్తాయనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మాస్ జాతర సినిమాకు కారణం..అంతకు ముందు నిర్మాత నాగవంశీ కింగ్ డమ్, వార్ 2 రిజల్ట్ లు కారణం కావచ్చు. అలాగే వర్కర్స్ స్ట్రైక్ తో షూటింగ్ లు లేటు కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఓటిటి మార్కెట్ కారణం అనేది వినపడుతున్న మాట.
ఇప్పటి మార్కెట్‌లో పెద్ద సినిమాలు థియేటర్లలో ఎంత ఆడినా, అసలైన సేఫ్టీ నెట్ ఓటిటి డీల్. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ (Netflix, Prime, Hotstar, Aha) ముందుగానే భారీ మొత్తాల్లో రైట్స్ కొంటున్నాయి.
కానీ ఇక్కడే సమస్య మొదలవుతుంది – ఓటిటి కాంట్రాక్ట్స్‌లో రిలీజ్ గ్యాప్ క్లాజ్ ఉంటుంది (ఉదా: థియేటర్ రిలీజ్‌కి 4–6 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అనుమతి). థియేటర్ రిలీజ్ డేట్ ఫిక్స్ కాకపోతే, ఓటిటి షెడ్యూల్ మొత్తం తారుమారవుతుంది. వాళ్లు ఫలానా తేది అని ఫిక్స్ చేసిన తర్వాతే రిలీజ్ కు పెద్ద సినిమాలు వెళ్తాయనేది నిజం.
ఏదైమైనా ఒక సినిమా విజయానికి స్క్రిప్ట్, స్టార్ పవర్, మ్యూజిక్ ఎంత అవసరమో, రిలీజ్ డేట్ క్లారిటీ కూడా అంతే అవసరం. క్లియర్ రిలీజ్ డేట్ లేకపోతే, అది బాక్సాఫీస్ పై ఒక అన్‌సర్టైన్ గ్యాంబిల్ అవుతుంది.
” తెలుగు పరిశ్రమ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్‌లో తన స్థానం బలోపేతం చేసుకోవాలంటే, రిలీజ్ షెడ్యూల్ ని ఒక స్ట్రాటజిక్ అసెట్ గా ట్రీట్ చేయాలి. డేట్ పై సైలెన్స్ అంటే కేవలం ఇండస్ట్రీలోనే కాదు, ఆడియెన్స్ ట్రస్ట్ లో కూడా లాస్.
“గ్లోబల్ బాక్సాఫీస్‌లో, రిలీజ్ డేట్ అనేది కరెన్సీలా పని చేస్తుంది. ఒకసారి అనౌన్స్ చేసిన డేట్ వెనక్కి తీసుకోవడం అంటే ఇన్వెస్టర్లకు లాస్ సిగ్నల్ పంపినట్టే”
Read More
Next Story