ధురందర్-2 vs ఉస్తాద్… ఎవరిది హవా?
x

'ధురందర్-2' vs ఉస్తాద్… ఎవరిది హవా?

టాక్ ఒకటి, కలెక్షన్స్ మరోటి!


ధురందర్-2 తుఫాన్ దేశం మొత్తం ఊపేస్తుంటే… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వేరే కథ నడుస్తోంది. మిక్స్డ్ టాక్‌తో వచ్చిన ‘ఉస్తాద్’ థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు ఎలా పెడుతోంది? రివ్యూస్ ఒకటి చెబుతుంటే… బాక్సాఫీస్ పూర్తిగా మరో స్టోరీ రాస్తోంది.

ఇది రెండు సినిమాల మధ్య పోటీ కాదు…

హైప్ vs హీరో పవర్… కంటెంట్ vs కల్ట్ ఫాలోయింగ్ మధ్య జరుగుతున్న అసలు యుద్ధం. అసలు ఏం జరుగుతోంది?

నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్! దేశమంతా ఒకవైపు ‘ధురందర్ 2’ మేనియాతో ఊగిపోతున్న సమయంలో తెలుగు గడ్డపై మాత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దిగాడు. దాంతో ట్రేడ్ వర్గాల్లో గత కొద్ది రోజులుగా ఒకటే చర్చ.. బాలీవుడ్ బిగ్గెస్ట్ సీక్వెల్ ‘ధురందర్ 2’ ప్రభంజనం ముందు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిలబడగలదా అని. కానీ, పవర్ స్టార్ స్టామినా ఏంటో మొదటి రోజే అర్థమైపోయింది. హిందీ వెర్షన్ ధురందర్-2 కి తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీ క్రేజ్ ఉన్నప్పటికీ, ఉస్తాద్ తనదైన మార్క్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు.

నిజానికి సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం, కానీ మాస్ సెంటర్లలో రికార్డు స్థాయి ఫుట్‌ఫాల్స్ చూసి ట్రేడ్ అనలిస్టుల మైండ్ బ్లాక్ అవుతోంది. హరీష్ శంకర్ రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ పీక్ ఎనర్జీ లెవల్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎలివేషన్ సీన్స్ థియేటర్లను ఊపేస్తున్నాయి. మిగిలిన సినిమాల పోటీ లేకపోవడం, రంజాన్ సెలవులు రావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారబోతోంది.

“ఉస్తాద్ హవా ఎందుకు కనిపిస్తోంది?”

బాలీవుడ్ పెద్ద సీక్వెల్స్ సాధారణంగా కంటెంట్ ఎకానమీ మీద నడుస్తాయి. హైప్ + ఫ్రాంచైజ్ విలువ + అర్బన్ ఆడియన్స్ రివ్యూస్ = సస్టైనబుల్ రన్, కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రం పూర్తిగా వేరే సిస్టమ్‌లో నడుస్తాయి . స్టార్ పవర్ ఎకానమీ.

పవన్ సినిమాలు ముఖ్యంగా ఓపెనింగ్స్ కంటెంట్ మీద ఆధారపడవు. ఫ్యాన్ మొబిలైజేషన్ కీలకం. థియేటర్ అనుభవం (collective high) ప్రధాన అంశం. ‘ఉస్తాద్’ ఈ మోడల్‌లో ఫుల్ ఫోర్స్‌తో పని చేస్తోంది. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పడిపోకపోవడానికి ఇదే ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే అది కేవలం మూవీ కాదు…ఫ్యాన్స్‌కు ఫెస్టివల్.ఈ ఫ్యాన్‌బేస్‌లో ఒక ప్రత్యేకమైన ఎమోషన్ ఉంది —

“టాక్ ఎలా ఉన్నా… ఫస్ట్ మూడు రోజుల్లో థియేటర్‌కు వెళ్లాలి.” ఈ కల్చర్ వల్లే మిక్స్డ్ టాక్ కూడా కలెక్షన్స్‌ను ఆపలేకపోతోంది.

హరీష్ శంకర్ రైటింగ్ – మాస్ DNA

సాధారణంగా సినిమా సక్సెస్ అనేది కథ, స్క్రీన్‌ప్లే మీద ఆధారపడుతుంది. కానీ హరీష్ శంకర్ ఇక్కడ వేరే ప్లాన్‌తో వచ్చాడు. “స్టోరీ కంటే హై పాయింట్స్ క్రియేట్ చేయాలి.” ఎలివేషన్ డైలాగ్స్, హీరో ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్లాక్స్, మాస్ ట్రిగర్ చేసే విజువల్ మోమెంట్స్. ఇవి కలిసి ఒక “థియేటర్ హై” ఇస్తాయి. మాస్ ఆడియన్స్‌కు ఇది సరిపోతుంది. అందుకే మిక్స్డ్ టాక్ ఉన్నా కూడా… థియేటర్‌లో ఎక్స్పీరియెన్స్ పాజిటివ్‌గా మారుతోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎలివేషన్ సీన్స్ “విసిల్ మోమెంట్స్” గా పని చేస్తున్నాయి. మాస్ ఆడియన్స్‌కి ఇది చాలు.

కంటెంట్ vs మొమెంట్

‘ధురందర్-2’ లాంటి హిందీ సీక్వెల్స్ కంటెంట్ మీద రన్ అవుతాయి. కానీ ‘ఉస్తాద్’ లాంటి సినిమాలు, మొమెంట్ మీద, హీరో ఇమేజ్ మీద రన్ అవుతాయి. ఇది రెండు వేర్వేరు గేమ్స్. టాలీవుడ్ మాస్ మార్కెట్‌లో రెండోది చాలా సార్లు గెలుస్తుంది.

టాక్ ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్ తన మ్యాజిక్‌తో సినిమాను ఒంటిచేత్తో గట్టెక్కించేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈవినింగ్, నైట్ షోలకు భారీ ఆక్యుపెన్సీ నమోదు కావడం చూస్తుంటే, మొదటి వీకెండ్‌లోనే మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ వెనక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సోమవారం అసలైన పరీక్ష ఎదురవ్వబోతున్నా, ప్రస్తుతానికి మాత్రం ఉస్తాద్ హవా క్లియర్ గా కనిపిస్తోంది. హిందీ సినిమా వేవ్ ను తట్టుకొని నిలబడటం అంటే అది మామూలు విషయం కాదు. పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్!

Read More
Next Story