ఓం కాళీ జై కాళీ వెబ్ సిరీస్ రివ్యూ!
x

'ఓం కాళీ జై కాళీ' వెబ్ సిరీస్ రివ్యూ!

ఈ సిరీస్‌ కథేంటి, ఇంట్రస్టింగ్ గా ఉంది, చూడదగిన సీరిస్ యేనా వంటి విషయాలు చూద్దాం.

దసరా పండగ నేపథ్యంతో రూపొందిన రివెంజ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘ఓం కాళీ జై కాళీ’ (Om Kali Jai Kali). విమల్‌, సీమా బివాస్‌, ఆర్‌.ఎస్‌. శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాము చెల్లప్ప దర్శకత్వం వహించారు. గత కొద్ది రోజులుగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ అవుతోంది. తమిళ్‌తోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీలోనూ స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ కథేంటి, ఇంట్రస్టింగ్ గా ఉంది, చూడదగిన సీరిస్ యేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

అదొక తమిళ గ్రామం. అక్కడ ప్రతి సంవత్సరం దసరాకి కాళికా దేవి జాతర జరుగుతుంది. అలాగే ఆ కోరికలు తీరాలనుకునేవారు అమ్మవారి వేషం వేసుకుని ఆడుతుంటారు. ఆ క్రమంలో ఓ సారి అమ్మవారి జాతర జరుగుతూ ఉండగా, గర్భవతిగా ఉన్న నీల అనే ఒక యువతి ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ ఆ గ్రామంలోకి వస్తుంది.ఆ ఊరి వాళ్ళు ఆమెను తమ ఆడపడచు గా భావించి, ఆశ్రయం కల్పిస్తారు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేస్తూ ఆ యువతి అక్కడే సెటిల్ అయిపోయింది.

ఇక నీల కోసం అక్కడ లోకల్ రాజకీయ నాయకులు, వాళ్ల అనుచరులు గ్రామాలన్నీ జల్లెడ పట్టి వెతుకుతుంటారు. ఆమె దొరికితే చంపేయాలనేది వాళ్ల ఆలోచన. ఈలోగా నీలకు ఓ పాప పుడుతుంది. రోజులు గడుస్తూంటాయి. నీల పై దాడులు జరుగుతూనే ఉంటాయి. నీలకు సపోర్ట్ గా ఉన్న గణేష్ (విమల్) ఉంటాడు. అదే గ్రామానికి చెందిన అమ్మాయి (పావని రెడ్డి) అతణ్ణి ఇష్టపడుతూ ఉంటుంది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

నీ లపై దాడులు ఆగకపోవడంతో చేస్తుంది ఎవరనే ఆరా తీస్తాడు గణేష్. ఆమెను చంపడానికి ప్రయత్నిస్తోంది సొంత అన్నదమ్ములే అని అర్థమై ఆశ్చర్యపోతారు. అసలు వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారు. గణేష్ లవ్ స్టోరీ ఏమైంది, చివరకు వాళ్లను నీల ను ఏం చేస్తారనేది మిగతా కథ.

విశ్లేషణ

మిస్టరీ, రాజకీయాలు, లోకల్ గా ఉండే జానపదాలను మిళితం చేసి అందించిన సీరిస్ ఇది. ఓవైపు వరుస మర్డర్స్‌, మరోవైపు జాతర సీన్స్‌ తో సాగే ఈ సీరిస్ లో కథ కన్నా విజువల్స్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే నేరేషన్ లో పట్టు లేదు. రూరల్ రివేంజ్ ప్లాట్ గా తయారు చేసిన ఈ సీరిస్ లో దైవత్వం కు సంభందించిన ఎలిమెంట్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. కథలో రెండు రాజకీయ వర్గాల మధ్య పవర్ స్ట్రగుల్ ని చూపించారు. అయితే దేనిని పూర్తిగా బాలెన్స్ చేయలేకపోయారు.

సీరిస్ లో భ‌యం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, కిక్ స‌రిపోలేదు.కథలో చాలా గంద‌ర‌గోళం వుంది. కొంతదూరం వెళ్లాక క‌న్‌ఫ్యూజ‌న్ పెరుగుతుంది. చాలా విష‌యాలు, అంశాలు, జోన‌ర్లూ మిక్స్ చేయటమే అందుకు కారణం. వాస్తవానికి ఈ క‌థ‌లో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు ఉన్నాయి. అయితే వాటిని రివీల్ చేసిన విధానం గొప్ప‌గా లేక‌పోవ‌డంతో మంచి ట్విస్టులు కూడా థ్రిల్ పంచ‌లేక‌పోయాయి.

ఏదైమైనా చాలా విష‌యాలు ఈ రివైంజ్ డ్రామా క‌థ‌లో ఇమిడ్చి చెప్పాల‌నుకోవ‌డమే ఇబ్బంది పెట్టింది. క‌థ‌ని మొద‌లెట్టిన తీరు ఉత్కంఠ‌త‌ని క‌లిగిస్తుంది. ఆ ఊరిలో ఏదో జ‌ర‌గ‌బోతోంద‌న్న భ‌యాన్ని ప్రేక్ష‌కుడిలో తీసుకొచ్చాయి. అయితే అందుకోసం ఎంచుకున్న సీన్లు పెద్ద‌గా ర‌క్తి క‌ట్ట‌లేదు. ఫస్ట్ రెండు ఎపిసోడ్స్ క్యారెక్ట‌ర్‌ని కాస్త ప‌రిచ‌యం చేస్తూ ముందుకు సాగాయి. అయితే ఆ కంటిన్యుటీ తర్వాత మిస్ అయ్యింది. విల‌నిజం కూడా అంత‌గా పండ‌లేదు. మొదట భీబత్సంగా పరిచయం చేసిన పాత్రలు చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందేమో అనుకొంటే అవి రాను రాను తేలిపోయాయి.

టెక్నికల్ గా..

గ్రామీణ నేపథ్యం .. జాతర వాతావరణం ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణ. వాటిని చేయడానికి టెక్నికల్ టీమ్ బాగా కష్టపడింది. అయితే స్క్రిప్ట్ మరింత బలంగా ఉండాల్సింది. రాకేష్ శుక్లా కెమెరా వర్క్, .. జై కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రవీణ్ ఎడిటింగ్ సీరిస్ కు బాగా ప్లస్ అయ్యాయి.నిర్మాణ విలువలు ఓకే. డబ్బింగ్ ఇంకాస్త బాగా చెప్పించాల్సింది.

చూడచ్చా

సీరిస్ చిన్నదే కాబట్టి ఓ లుక్కేయచ్చు. గ్రామీణ థ్రిల్లర్స్ చూడాలనుకునేవారికి మంచి ఆప్షన్.

ఎక్కడ చూడచ్చు

జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది

Read More
Next Story