సూపర్ హిట్ కామెడీ : ‘జర హట్కే జర బచ్కే’మూవీ రివ్యూ
x

సూపర్ హిట్ కామెడీ : ‘జర హట్కే జర బచ్కే’మూవీ రివ్యూ

విడుదలైన నెలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్న టైమ్ లో సంవత్సరం ఆగి వచ్చినా ఈ సినిమాకు ఓటిటిలో మంచి ఆదరణే దక్కుతోంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి..



సింపుల్ స్టోరీ లైన్ తో నడిపి చివర్లో చిన్న ఎమోషన్ ని కలిపి ముగించే రొమాంటిక్ కామెడీలు ఎప్పుడూ బాగుంటాయి. ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ వాటిని ఆదరిస్తూనే ఉంటారు. అలాంటిదే విక్కీ కౌశల్‌, సారా అలీఖాన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’ . లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో గతేడాది జూన్‌లో విడుదలైన ఈ రొమాంటిక్‌ కామెడీ ఫిల్మ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రూ.40కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.115 కోట్లు వసూలు చేసింది. అయితే ఓటిటికు ఇవ్వటం బాగా లేటు చేసారు. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. సాధారణంగా విడుదలైన నెల రోజులకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్న టైమ్ లో సంవత్సరం ఆగటం విచిత్రమే అయినా ఇప్పుడు కూడా ఈ సినిమాకు ఓటిటిలో మంచి ఆదరణే దక్కుతోంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి...తెలుగువారికి నచ్చే సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.


స్టోరీ లైన్

కపిల్ దూబే (విక్కీ కౌశల్‌), సౌమ్య చావ్లా (సారా అలీఖాన్‌) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు వేర్వేరు కులాలు..ప్రాంతాలు అయినా ఇండోర్ లో కొత్తగా కాపురం పెట్టి జీవితాన్ని ఆనందంగా గడుపుతూంటారు. అయితే కొత్తగా పెళ్లైన ఈ జంటకు ప్రైవసీ దొరకదు. ఎందుకంటే వాళ్లది మిడిల్ క్లాస్ కుటుంబం కావటంతో కపిల్ తన తల్లి,తండ్రి, మామయ్య,అత్తయ్యలు కూడా ఇంట్లోనే ఉంటారు. అప్పటికీ కొడుకు కపిల్‌కు పెళ్లి అయ్యిందని తమ పడక గదిని అతడికి ఇచ్చి, హాల్లోనే పడుకుంటారు తల్లిదండ్రులు.

దాంతో భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామలు ఇంట్లోనే ఉండటం సౌమ్యకు ఇబ్బందిగా అనిపిస్తూంటుంది. అలాగని ఆమె అప్పటికి అప్పుడు ఇల్లు కొనుక్కునే ఆర్దిక పరిస్దితి లేదు. రియల్ ఎస్టేట్ దగ్గరకు వెళ్తే మినిమం నలభై లక్షలు అయినా కావాలంటారు. సౌమ్య టీచర్ గా చేస్తూంటుంది. కపిల్ యోగా టీచర్ గా చేస్తూంటాడు. దాంతో అప్పులు చేస్తే తర్వాత తీర్చుకోలేమనే భయం వెంటాడుతుంది. అలాగని సొంత ఇల్లు లేకపోతే ఎలా బెంగ వీళ్లకు మొదలవుతుంది.

ఈ క్రంలో సౌమ్య కొత్తగా ఇల్లు తీసుకోవాలనుకునే కోరిక తీరే అవకాసం వస్తుంది. ప్రభుత్వం ఆవాస్‌ యోజన పథకం ఇల్లు మంజూరు చేస్తుందని తెలిసి మొగుడు, పెళ్లాం ఇద్దరూ బయిలుదేరి వెళ్తారు. అయితే అక్కడ అధికారి ఓ మాట చెప్తాడు. అదేంటంటే మీ తండ్రి కి ఇల్లు ఉంది కాబట్టి , ఆయన నుంచి గొడవ పడి మీరు విడిపోయి వస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే అది ప్రూవ్ చేయాలి. కొడుక్కి ఆయన ఇల్లు ఇవ్వడని. దానికి కపిల్ ఒప్పుకోడు. అయితే ఇంకో మార్గం ఉందని చెప్తాడు. మీరు ఇద్దరూ విడాకులు తీసుకుంటే అప్పుడు ఆమెకు ఈజీగా ఇల్లు దొరుకుతుంది. తర్వాత మళ్లీ కొత్త ఇంట్లో పెళ్లి చేసుకోవచ్చు అని సలహా చెప్తారు. అప్పుడు సొంత ఇంటి కోసం కపిల్‌, సౌమ్య ఏం చేశారు? విడాకులు ఎందుకు తీసుకున్నారా? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి?చివరకు కొత్త జంట కల నెరవేరిందా? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ

కథగా చూస్తే చిన్న పాయింట్. ఓ జంట సొంత ఇల్లు అనే కోరిక నెరవేర్చుకోవటం కోసం విడాకులు తీసుకుంటారు. అయితే జీవితం అంటే ఏదీ ప్లానింగ్ ప్రకారం మనం అనుకున్నట్లు జరగదు కదా. ఈ క్రమంలో వాళ్ల జీవితాల్లో ఏమి మార్పులు వచ్చాయి...కుటుంబ సబ్యులు, స్నేహితులు ఎలా స్పందించారు అనేది ఫన్ వేలో డీల్ చేసారు. రొమాంటిక్ కామెడీకు ...కామెడీ ఆఫ్ ఎర్రర్స్ స్కీన్ ప్లే రాసుకున్నారు. ఇండోర్ వంటి చిన్న టౌన్ లో ఉండే విచిత్రమైన పాత్రలుతో ప్రిమైజ్ ఫన్నీగా ఉంది. ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోయింది. అయితే ప్రీ ఇంట్రవెల్ దగ్గరకు వచ్చేటప్పటికి కాస్త వేగం తగ్గింది. సెకండాఫ్ లో విడిపోయిన ఈ మొగుడు పెళ్లాలు కలవటం కోసం అన్న, చెల్లెలు గా నటించటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్ యాడ్ చేయటం కోసం మెడికల్ ఎమర్జన్సీ ట్రాక్ పెట్టడం వర్క్ అవుట్ కాలేదు. అయితే కామెడీ సీన్స్ చాలా వరకూ పండటం వలన నడిచిపోతుంది.

టెక్నికల్ గానూ

ఈ సినిమా మంచి స్టాండర్డ్స్ లో ఉంది. మరీ ముఖ్యంగా ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ ఇద్దరు చాలా బాగా చేశారు, ఆ పాత్రలకి సరిగ్గా సరిపోయారు, అందులో ఇమిడిపోయారు. దర్శకుడు ఆ పాత్రకి ఈ పెయిర్ ని ఎంచుకోవటం ఫెరఫెక్ట్. సార్ అలీ ఖాన్ ఈ సినిమాలో చక్కగా కనిపించింది, అంతే చక్కగా నటించింది. ఆమె ఆ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకుంది. మిగతా పాత్రలో చాలామంది తమ పాత్రల పరిధి మేరకి బాగా నటించారు. చిన్న సినిమా అయినా చూడాల్సిన సినిమా ఇది. చక్కటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దర్శకుడు కి క్రెడిట్ మొత్తం ఇవ్వాలి, పూర్తి మార్కులు వెయ్యాలి.

చూడచ్చా

క్లీన్ కామెడీగా నవ్వుకోవటానికి ఈ సినిమా మంచి ఆప్షన్. అసభ్యత, హింస లేదు కాబట్టి ఫ్యామిలీ మొత్తం చూడచ్చు.

ఏ ఓటిటిలో ఉంది

జియో సినిమా లో తెలుగులో ఉంది.


Read More
Next Story