విజయ శాంతి స్ట్రాంగ్ వార్నింగ్
x

విజయ శాంతి స్ట్రాంగ్ వార్నింగ్

ఆ చెంచాగిరి బ్యాచ్ ఎవరు? అసలేం జరిగింది?


తెలుగు సినిమా మరోసారి ఓ ఆసక్తికర చర్చకు కేంద్రంగా మారింది. ఈసారి అది "అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి" చిత్రం కావడంతో అందరి దృష్టీ అటువైపు పడింది . కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలైన వెంటనే డివైడ్ టాక్, వివాదస్పద వ్యాఖ్యలు, బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్లు అన్నీ ఒకే వేదికపై మిళితమయ్యాయి.

సినిమాలపై తప్పుడు ప్రచారం చేసేవారు తమ పద్ధతి మార్చుకోవాలని సీనియర్‌ నటి విజయశాంతి (Vijayashanti) హెచ్చరించిన సంగతి వైరల్ అవుతోంది. కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా పరమ రొటీన్ గా ఉంది, చివరి ఇరవై నిముషాలు కొత్తంగా ఉందని రివ్యూలు వచ్చాయి.

అయితే కలెక్షన్స్ అనుకున్న స్దాయిలో కనపడటం లేదు. అటు మాస్‌తో పాటు, ఇటు క్లాస్‌ను అలరిస్తోందని నిర్మాత, దర్శకుడు చెప్తున్నా వీకెండ్ లో ఆ స్పీడు కనపడటం లేదు. అయితే టీమ్ మాత్రం బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఆ సందర్బంలో సినిమా బాగోలేదంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఈ సందర్భంగా విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్బంలో సోషల్ మీడియాలో ఓ చిత్రమైన వాదన మొదలైంది.

హీరో ..మంగళవారానికి బ్రేక్ ఈవెన్ చెప్తున్నారు. మరో ప్రక్క దర్శకుడు..డెభై శాతం రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయంటారు. నిర్మాత కొన్ని గంటల వ్యవధిలో రెండు సక్సెస్ మీట్ లు చేసారు. కానీ విజయశాంతి మాత్రం సినిమాని..తొక్కేస్తున్నారు..అణిచేస్తున్నారు అంటున్నారు. బ్రేక్ ఈవెన్ అయితే ఇంకేంటి బాధ!! జనాలు ఆదరించినట్టే కదా!! మరింకెందుకు ఎక్కేస్తున్నారు తొక్కేస్తున్నారు అనడం??? సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారేమో!!!!!ఏది నిజం అనేది వారు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ విజయశాంతి ఏమన్నారు.

విజయశాంతి మాట్లాడుతూ....‘‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీని ఖూనీ చేద్దామనుకునే వారికి మా హెచ్చరిక. తప్పుడు ప్రచారం చేసే వారు తమ పద్ధతి మార్చుకోవాలి. ఇలాంటివి అస్సలు ఉపేక్షించం. కొంత మంది కావాలనే ఇబ్బందిపెడుతున్నారు. ప్రతీ సినిమా ఆడాలనేది మా కోరిక. బాగున్న సినిమాను బాగా లేదని, బాగా లేని సినిమాను బాగుందని ప్రచారం చేయడం ఏంటి? చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వస్తారు. సినిమా నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి’’

‘‘నచ్చలేదని చెప్పి మొత్తం మూవీనే చంపేద్దామని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో సినిమా చూసి అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం. సినిమాలను మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి. ఎవరైనా మీ మైండ్‌ వాష్‌ చేస్తుంటే, వాళ్ల దగ్గరకు వెళ్లి భజన చేసుకోండి. ఇలా చేయటం మాత్రం మంచి పద్ధతి కాదు. మంచి సినిమాలను చంపే హక్కు మీకు లేదు.

సినిమాను చంపేస్తే కొన్ని జీవితాలు పోతాయి. మేమంటే 40ఏళ్ల జర్నీ చూశాం. కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలను నాశనం చేసేవాళ్లను జీవితంలో క్షమించకూడదు. ఇలాంటి చీప్‌ పనులు మానుకోండి. ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటున్నా.’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

విజయశాంతి మాటల్లో స్పష్టంగా కోపం కనిపిస్తుంది –

"చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఎన్నో ఆశలతో వస్తారు. నచ్చకపోతే చూడకండి, నిశ్శబ్దంగా ఉండండి."

ఇది సాధారణంగా "పబ్లిక్ ఓపీనియన్"కు చెప్పే మాట కాదు. ఇది "ప్రణాళికాబద్ధమైన నెగటివ్ క్యాంపెయిన్" ఉన్నట్టే భావన కలిగిస్తుంది.

సోషల్ మీడియాలో కొంత మంది ప్రత్యేకంగా ఈ సినిమాని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఒక్కో గంటకో కొత్త ట్వీట్, ఓల్డ్ స్కూల్ మీమ్స్, సినిమాని తక్కువ చేస్తూ ఎడిటింగ్ క్లిప్స్ – ఇవన్నీ ఒకే విధంగా స్ప్రెడ్ అవుతుండటంతో ఒక ప్లాన్డ్ నెరేషన్ ఉందని బలంగా అనిపిస్తోంది.

నెగటివ్ క్యాంపెయిన్ ఎవరిది?

ఈ వివాదంలో నిజం ఏది? ఎవరు కావాలని ఈ సినిమాని తొక్కేస్తున్నారు? విజయశాంతికి వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉన్నవాళ్లు చేస్తున్నారా? లేక ఇది కళ్యాణ్ రామ్‌‌పై ఉన్న రాజకీయ అజెండా పక్కాగా ఆడిస్తున్న ఆటా?

ఇవి ప్రస్తుతం ఖచ్చితంగా నిర్ధారించలేని విషయాలు. కానీ సినిమా నిర్మాతలు, దర్శకులు, నటులు బలంగా ఎదురు మాట్లాడటం చూస్తే – సమస్య ఏదో ఉందనే స్పష్టత వస్తోంది.

"విమర్శ లేకపోతే కళ ఎదగదు. కానీ విమర్శను ఆయుధంగా వాడితే కళ చనిపోతుంది."

సినిమా మీద కామెంట్లు చేయటం ప్రతి ఒక్కరికీ హక్కే. కానీ అవి సత్యంతో కూడినవై ఉండాలి. విమర్శల పేరుతో, ఒక ప్రాజెక్టును కావాలనే కూల్చేయాలన్న మూడ్‌కి వెళితే – అది పరిశ్రమకి చేటే.

Read More
Next Story