డైెరెక్టర్ కారు పంచరైంది, విజయశాంతి హీరోయిన్ అయింది
x

డైెరెక్టర్ కారు పంచరైంది, విజయశాంతి హీరోయిన్ అయింది

విజయశాంతి సినిమా ఎంట్రీ ఎలా జరిగిందో చాలా మందికి తెలియదు. అయితే, దాని వెనక ఒక ఆసక్తికరమయిన కథ ఉంది. చాలా కాలం కిందట ఆమెయే ఈ విషయం చెప్పారు. వివరాలు...


హీరో స్వామ్యం నడిచే రోజుల్లో ఇండస్ట్రీలో చిన్న పాత్రలతో ఎంట్రీ ఇచ్చి తను కూడా హీరోలతో సమానంగా గౌరవించి,గుర్తించే స్దాయికు ఎదగటం అంటే మాటలు కాదు.గ్లామర్ పాత్రలకే కాకుండా అభినయ పాత్రలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలచిన విజయశాంతి ఇప్పటికి అడపా దడపా తెరపై కనిపిస్తూనే ఉంటుంది. చిన్నవయసులోనే వెండి తెరంగేట్రం చేసిన ఆమె ఇండియన్ సినిమా హిస్టరీలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంది. అబితాబ్ బచ్చన్, రజినికాంత్ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ విజయశాంతి గుర్తిండిపోయింది. డబ్బింగ్ చిత్రాలతోనే తమిళనాట నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన అరుదైన నటీమణి విజయశాంతి . జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి హీరోయిన్ గా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు.




ప్రముఖ దర్శకుడు భారతీరాజాగారి పార్టనర్ ఒకాయన కారులో వెళ్తుండగా కారు పంచరు అయింది. కారు రిపేర్ లో ఉండగా ఆయన ఎదురుగా ఉన్న రవి ఫొటో స్టూడియోకు వెళ్ళి అక్కడ ఉన్న ఆల్బమ్స్ ని ఫోటోలన్నీ పరిశీ లించి నా ఫొటో, మా ఇంటి అడ్రస్ యివ్వమని అడిగారట. ఫొటో స్టూడియో ఓనర్ అందుకు నిరాక రించి, ఆ విషయాన్ని మా నాన్న గారితో చెప్పారు.

విశ్వశాంతి విశ్వేశ్వరరావు గారు రవి స్టూడియోలో తీయించిన ఆ స్టిల్స్ భారతీరాజా యూనిట్ లో పనిచేస్తున్న అంబి అనే ఆయన చూసి భారతీరాజాతో, "ఈ అమ్మాయి నాన్న నాకు బాగా ఫ్రెండ్. మీకు ఆ అమ్మా యిని పరిచయం చేస్తాను" అని చెప్పి మా యింటికివచ్చి మానాన్న గారిని కలిసారు. మా నాన్నగారు, అంబి గారూ యిద్దరూ ఫ్రెండ్స్ అవడంవలన నన్ను తీసుకెళ్ళి భారతీరాజాగారికి పరిచయం చేసారు. అప్పటికి వాళ్ళ 'కల్లక్కుల్ ఈరం' అనే తమిళ చిత్రంలో కథానాయిక వేషం కోసం మూడు వందల ఫొటోల వరకు చూసారట.. కానీ వాటిలో ఏవీ నచ్చలేదట. నాకు వెంటనే మేకప్ టెస్ట్ చేయించి ఫలితాలు సంతృప్తి కరంగా ఉండటంతో భారతీరాజా 'కల్లుక్కుల్' ఈరం'లో నన్ను కధానాయికగా ఎన్నికచేసారు.

ఆ చిత్రంలో నటించినందుకు నేను 110 రూపాయలు పారి తోషికం అందుకున్నాను. అదే నేను అందుకున్న తొలి రెమ్యూనరేషన్ ఆ తర్వాత హీరో కృష్ణ. విజయనిర్మల గార్ల ప్రోత్సా హంతో 'కిలాడీ కృష్ణుడు' చిత్రంలో నాయికగా నటించాను ప్రస్తుతం చాలా తమిళ చిత్రా లలో నటిస్తున్నా - శ్రీ నాధ్ మూవీస్ వారు శోభన్ బాబుతో నిర్మించే చిత్రంలోనూ, అన్న పూర్ణ సంస్థ బాపు దర్శకత్వంలో నిర్మించే చిత్రంలోనూ నాయికగా నటిస్తున్నాను. అని చెప్పారు.
ఈ విషయాలను సినిమా రంత ఎంట్రీ ఎలా జరిగిందో 1982 లో ఒక సినిమా పత్రికకు స్వయంగా చెప్పారు.




ఇక భారతీరాజా వంటి క్రియేటివ్ డైరెక్టర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్న ఆమె తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకోవడానికి చాలాకాలమే ఆగాల్సి వచ్చింది. నేటి భారతం తర్వాత విజయశాంతి ప్రస్థానం అప్పటి స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇచ్చేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. 1980ల సగం నుంచి 90 వరకూ విజయశాంతి కెరీర్ పీక్స్ లో కొనసాగింది. అప్పట్లో ఆమె చేసిన సినిమాలు.. అన్నీ సూపర్ హిట్సే. ఓ రకంగా అప్పటి హీరోయిన్లంతా కేవలం గ్లామర్ కే పరిమితమైతే అటు గ్లామర్ ను, ఇటు పర్ఫార్మెన్స్ ను చూపించి ఆల్ రౌండర్ ఆమె. ఆ టైమ్ లో వచ్చిన ఓసేయ్ రాములమ్మా అని మర్చిపోయిందెవరు.


Read More
Next Story