‘ది గోట్’:తండ్రి ముప్పై ఏళ్ల క్రితం  డైరక్ట్ చేసిన కథనే ఇప్పుడు విజయ్ లేపి  హీరోగా చేసారా?
x

‘ది గోట్’:తండ్రి ముప్పై ఏళ్ల క్రితం డైరక్ట్ చేసిన కథనే ఇప్పుడు విజయ్ లేపి హీరోగా చేసారా?

హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి లేదా పాయింట్ లేపి,మనదైన నేటివిటిని అద్ది సినిమాలు చేయటం మన దేశ సినిమాలకు కొత్తేమీ కాదు.


హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి లేదా పాయింట్ లేపి,మనదైన నేటివిటిని అద్ది సినిమాలు చేయటం మన దేశ సినిమాలకు కొత్తేమీ కాదు. తెలుగు,తమిళం, హిందీ, మళయాళం ఇలా అన్ని భాషల వాళ్లు తమదైన శైలిలో హాలీవుడ్ ని ఎడాప్ట్ చేసుకుంటూ వచ్చారు. అయితే విజయ్ కొత్త చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' కొత్త ట్రెండ్ కి నాంది పలికింది. తమిళంలో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కథనే నేపధ్యం మార్చి దాదాపు నాలుగు వందల భారీ బడ్జెట్ తో తీసి మన ముందు పెట్టారు.

తెలుగులో మార్కెట్ కోసం విజయ్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది 'లియో'తో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న విజయ్.. ఇప్పుడు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (గోట్) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు రూపొందించిన ఈ చిత్రం విజయ్ పొలిటిక‌ల్ ఎంట్రీ నేప‌థ్యంలో ఒక‌ర‌కంగా ప్ర‌తిష్టాత్మ‌కం. ఎలక్షన్ ముందు గోట్ ఆయ‌న చివ‌రి సినిమా అని చెప్పారు. దాంతో తమిళంలో భారీ క్రేజ్ ఏర్పడింది. రిలీజ్ అయ్యాక త‌మిళ‌నాట కూడా డివైడ్ టాక్ ను ఎదుర్కొంటూ ఉంది.

అయితే ఈ సినిమా క‌థాంశం, ట్రీట్ మెంట్ ప‌ట్ల అన్నిచోట్లా పెద‌వి విరుపులు వినిపిస్తూ ఉన్నాయి. అయితే విజ‌య్ సినిమా ఓ మాదిరి బాగున్నా తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఒడ్డున పడిపోతాడు. క‌లెక్ష‌న్ల‌కు లోటు అయితే ఉండ‌దు. కాకపోతే సినిమా చూసిన అభిమానులు సైతం సంతృప్తిగా లేరు. యాంటి ఫ్యాన్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ సినిమాపై సెటైర్స్ తో కామెడీ చేస్తున్నారు. వారి ఆరోపణలో ముఖ్యమైంది ఈ సినిమా ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాకు కాపీ అని తేల్చారు.

ఆ సినిమా మరేదో కాదు...హీరో .విజయ్ తండ్రి ఎస్. ఏ. చంద్ర శేఖర్ దర్శకత్వంలో వచ్చిన రాజదురై. విజయ్ కాంత్ హీరోగా 1993లో రాజదురై వచ్చింది. అక్కడ మంచి హిట్ అయ్యింది. తెలుగులో రాజసింహగా డబ్ చేస్తే ఇక్కడా బాగానే ఆడింది. ఆ సినిమా పాయింట్ ఏమిటంటే రాజదురై అనే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ . అతను తన వ్యాపారాలు మూయించాడు..తనని జైల్లో పెట్టించాడు అనే కోపంతో మండిపడ్డ విలన్ ఓ ప్లాన్ చేస్తాడు. రాజదురై కుమారుడుని పసివాడిగా ఉన్నప్పుడే ఎత్తుకుపోతాడు.

పోలీస్ కొడుకుని అని చెప్పకుండా పెంచి, పరమ దుర్మార్గుడుగా, తండ్రి మీద ద్వేషం కలిగేలా పెంచుతాడు. ఓ ఏజ్ వచ్చాక అచ్చం తన పోలికల్లోనే ఉన్న యంగ్ విజయ్ కాంత్ ని తీసుకుని ఇంటికెళ్తాడు పోలీస్ అధికారి. అతను తన కుటుంబానికి దగ్గరైన నాటి నుంచి రాజదురైని నాశనం చేయటమే పనిగా పెట్టుకుంటాడు. ఆ తర్వాత తండ్రి కు అసలు విషయం ఎలా తెలిసింది. కొడుకుని ఎలా కంట్రోలు చేసాడనేదే మెయిన్ స్టోరీ. ముప్పై ఏళ్ల క్రితం ఇది మంచి డ్రామా ఉన్న స్టోరీ. విజయ్ కాంత్ తండ్రి, కొడుకులుగా దుమ్ము దులిపాడు అని అంతా మెచ్చుకున్నారు.

ఇప్పుడు ఇదే పాయింట్ నే గోట్ లో వాడుకున్నాడు వెంకట్ ప్రభు. ఆ రోజులు నాటికి మేకప్ తో సరిపెడితే, ఇప్పుడు విజయ్ కి డీ ఏజింగ్ టెక్నాలజీ వాడి డిఫరెంట్ గా ట్రై చేశాడు. ఇక ఈ రెండు సినిమాలకు తేడా ఏంటంటే రాజదురైలో విలన్ దగ్గర పెరిగిన కొడుకు తన తండ్రి గొప్పతనం, అసలు నిజం తెలుసుకుని మారతాడు. ఇక్కడ గోట్ లో కొడుకు నెగటివ్ షేడ్ ని క్లైమాక్స్ దాకా మార్చకుండా కొనసాగించారు. ఇక ఈ సినిమాకు హాలీవుడ్ మూవీ 'జెమిని మ్యాన్' నుంచి కొన్ని సీన్స్ లేపారు.

ఇక విజయ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో ‘ది గోట్’ కి మంచి బిజినెస్ జరిగింది. కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ‘ది గోట్’ చిత్రానికి తెలుగులో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.3.44 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ ఇంకో రూ.17.56 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read More
Next Story