వాయిదా పడిన విజయ్ ‘జన నాయగన్’ సినిమా
x
విజయ్

వాయిదా పడిన విజయ్ ‘జన నాయగన్’ సినిమా

ఇంకా పూర్తి కాని సెన్సార్, మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు


టీవీకే అధినేత, దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రేపు విడుదల కావాల్సి ఉంది.

సినిమా సర్టిఫికేషన్ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడింది. బుధవారం కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. సినిమాను సమీక్షించడానికి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)ని ఆదేశించింది.
జననాయగన్ సినిమా చుట్టూ తమిళనాడు రాజకీయా వర్గాల్లో వివాదం రేపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల కావడం, రాజకీయా అంశాలు ఉండటం, హీరో విజయ్ టీవీకే పార్టీని స్థాపించడంతో రాజకీయ వివాదం చెలరేగింది.
ట్రైలర్ లోని కొన్ని డైలాగులు కూడా రాజకీయాలపై వ్యంగ్యంగా ఉండటం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. బీజేపీ తో టీవీకే పార్టీ పొత్తు పెట్టుకునే ప్రయత్నాల్లో ఉందని ఊహగానాల మధ్య సీబీఎఫ్సీ బోర్డు ఈ సినిమాను సెన్సార్ విషయంలో ప్రభావితానికి గురి అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
నిర్మాణ సంస్థ ప్రకటన..
‘జన నాయగన్’ సినిమా చుట్టూ ఉన్న అంచనాలు, ఉత్సాహం, భావోద్వేగాలను అర్థం చేసుకున్నట్లు నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ తెలిపింది. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేసింది.
‘‘సినిమాపై కొత్త అప్ డేట్ ను మీతో పంచుకోవడానికి బరువెక్కిన హృదయంతో ఉన్నాము. జనవరి 9న అందరూ అనుకున్నట్లుగా జననాయగన్ విడుదల అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా పడింది’’ అని పోస్ట్ లో తెలిపింది. వాయిదా నిర్ణయం అంత సులభం కాదని నిర్మాణ సంస్థ పేర్కొంది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.
కోర్టు నిర్ణయం..
విడుదల తేదీ దగ్గరపడుతున్న సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయకపోవడంపై చిత్ర నిర్మాణం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. జననాయగన్ సినిమాకు యూఏ16+ సర్టిఫికెట్ జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
నెల రోజుల క్రితమే సెన్సార్ బోర్డుకు సర్టిఫికెట్ సమర్పించినప్పటికీ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని తన పిటిషన్ లో పేర్కొంది. డిసెంబర్ 19న బోర్డు కట్స్, మ్యూట్ డైలాగ్ లను సూచించిందని పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే సెన్సార్ పూర్తి కానున్నందున భారత్ తో పాటు యూకే, ఉత్తర అమెరికా, కెనడా, మలేషియాలోని పంపిణీదారులు కూడా విడుదల చేయట్లేదని ప్రకటించారు.
దేశంలోని ఇతర ప్రాంతాలలో సెన్సార్ పూర్తి చేయడానికి తమిళనాడులో ఇంకా తుది అనుమతులు రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ పెండింగ్ పడటంతో ఈ భాషల్లో కూడా విడుదల వాయిదా పడింది. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన జన నాయగన్ లో పూజా హెగ్దే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియమణి తదితరులు నటించారు.
విజయ్ ఇది తన చివరి సినిమాగా ప్రకటించారు. ఇక నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. టీవీకే స్థాపించిన విజయ్ ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
Read More
Next Story