‘కల్కి 2898 ఏడీ’కథ ఇదేనా? ప్రభాస్ ‘కల్కి’కాదా?
x

‘కల్కి 2898 ఏడీ’కథ ఇదేనా? ప్రభాస్ ‘కల్కి’కాదా?

నాగశ్విన్ డైరెక్షన్‌లో భారీ అంచనాల నడుమ వస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఇప్పటికే విడులైన ఈ సినిమా ట్రైలర్.. సినిమా కథ విషయంలో అనేక ప్రశ్నలను లేవనెనత్తుతోంది.


ఇప్పుడు ఎక్కడ చూసినా ‘కల్కి’ సినిమా గురించిన కబుర్లే. ప్రభాస్ హీరోగా చేయడం, వైజయంతీ మూవీస్ బేనర్ మీద ‘మహానటి’వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించటంతో క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్ళిపోయింది. దానికి తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే కీ రోల్స్‌లో కనిపించటంతో మిగతా సినీ పరిశ్రమల్లో కూడా ఇదే టాపిక్‌గా నడుస్తోంది.

రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ చూస్తే హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని విధంగా ‘కల్కి’ ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ సినిమాకు యుఎస్ సహా పలు దేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో అసలు ప్రభాస్ పాత్ర ఏమిటి...అనేది చర్చగా మారింది. టైటిల్ కల్కి కాబట్టి ప్రభాస్ చేసే పాత్ర కల్కి అయ్యుంటుంది కదా ఇంకేముంటుంది అని అనచ్చు. అయితే ప్రభాస్ కల్కి కాదు అని అనిపిస్తోంది. ‘కల్కి’ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సినిమా గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కథ కలియుగం చివర్లో జరుగుతుందని, విష్ణు పదవ అవతారం కల్కి వచ్చి భూమి మీద ఉన్న మనుషులను కాపాడతాడని, ఆ కల్కి ప్రభాస్ అని అనుకున్నారు. అయితే ట్రైలర్ చూశాక... అందరూ షాక్ అయ్యారు. ప్రభాస్ పేరు భైరవ అని, కల్కి కోసం జనం ఎదురుచూస్తూ ఉంటారని చూపించారు. దాంతో కల్కి వేరు, ప్రభాస్ పాత్ర వేరా అనే డౌట్ మొదలైంది. ట్రైలర్ చూసి చాలా మంది ఊహించని కథ కాకుండా ఇదో కొత్త కథ అని అర్థమైంది.

ట్రైలర్‌లో చూపించిన దాని ప్రకారం.. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా పుష్కలంగా ఉండే ప్రాంతం కాంప్లెక్స్. అక్కడికి వెళ్లాలని భైరవ( ప్రభాస్) ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడ ఉండే వారు కాశీ ప్రజల చేత నీటి కోసం, ఆహారం కోసం బానిసలుగా పని చేయించుకుంటారు. అదే సమయంలో కాశీలో కొంతమంది రెబల్స్ ఉంటారు. వారు కాంప్లెక్స్ సిటీలో ఉండే వారిపై చాలా కోపంతో ఎదురు తిరుగుతుంటారు. కాంప్లెక్స్ సిటీలో ఎదైనా వస్తువును దొంగలించి కాశి పట్టణంలో తిరిగే వారిని పట్టుకోమని బౌంటీ హంటర్స్‌కు డబ్బు ఆఫర్ చేస్తారు. భైరవ కూడా యూనిట్స్ కోసం బౌంటీ హంటింగ్ చేస్తుంటాడు. ఈ కథ జరిగే కాలంలో కరెన్సీని రూపాయితో కాకుండా యూనిట్స్‌తో పిలుస్తారు.

అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన బౌంటీలను సంపాదించే పనిలో ఉంటాడు భైరవ. ఈ క్రమంలోనే తనకు వచ్చిన డీల్స్‌ను పూర్తి చేస్తుంటాడు. కానీ భైరవకు ఊరంతా అప్పులే. అందరికీ ఎంతో కొన్ని యూనిట్లు బాకీ పడి ఉంటాడు. ఇంటి ఓనర్‌ (బ్రహ్మానందం)కి కూడా యూనిట్స్ బాకీ ఉంటాడు. అలాంటి భైరవ జీవితంలోకి బుజ్జి వస్తుంది. బుజ్జి సాయంతో అదిరిపోయే కారుని భైరవ తయారు చేస్తాడు. ఆ తరువాత నుంచి బుజ్జి, భైరవ స్నేహం ప్రారంభం అవుతుంది. భైరవకు ఉన్న ఏకైక గోల్ బాగా డబ్బులు సంపాదించి కాంప్లెక్స్ సిటీలో సెటిల్ కావాలని. ఆ సమయంలో 1 మిలియన్ యూనిట్స్ ఆఫర్ వస్తుంది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. దీపికాను తీసుకురావాలన్న డీల్‌పై భైరవ బయలుదేరుతాడు. ఆమెను కాపాడుతున్న అమితాబ్ (అశ్వత్థామ)తో భైరవ తలపడతాడు.

దీపికా పదుకోణె గర్భవతి. చిరంజీవిగా కలియుగం చివరి వరకు ఉండే అశ్వత్థామ (అమితాబ్) నేను రక్షించాల్సింది ఒక్కడినే, అది నీ బిడ్డనే అని చెప్తాడు. అలాగే దీపికాతో.. నువ్విప్పుడు కనబోయేది మాములు ప్రాణం కాదమ్మా.. సృష్టిని.. నేను కాపాడతాను అని చెప్తాడు. ప్రభాస్-అమితాబ్ పాత్రలకు ఫైట్ జరిగినట్టు కూడా చూపించారు. దీంతో ప్రభాస్ కల్కి కాదని, దీపికాకు పుట్టబోయే బిడ్డ కల్కి అని అర్థమైంది. కల్కిని చెడ్డవారి చేతుల్లో పడకుండా అశ్వత్థామ కాపాడుతుంటాడు. ఆ తర్వాత కల్కిని రక్షించే బాధ్యతలను భైరవ తీసుకుంటాడనిపిస్తుంది. ఇలా తనకు తెలియకుండానే ఓ పెద్ద యుద్ధంలోకి భైరవ అడుగు పెడతాడు.

ఇక ఈ భూమి మీద ఉండే ప్రజలకు దేవుడు ఒక్కడే అతడే సుప్రీం యాస్కిన్ (కమల్). సుప్రీం యాస్కిన్‌ను అంతం చేసి, ఈ భూమిని కాపాడడానికి పుట్టే వాడే కల్కి. అతన్ని పుట్టకుండా అడ్డుకునేందు చేసేదే ప్రాజెక్ట్-కే ఈ ప్రాజెక్ట్‌ను కలి పురుషుడు అయిన కమల్ హాసన్ తన మనుషులతో నడిపిస్తూంటాడు. అందులో భాగంగానే గర్భంతో ఉన్న స్త్రీలను కిడ్నాప్ చేస్తారు. ఏ పిల్లోడైనా కల్కి కావచ్చు అని వాళ్లను చంపేస్తారు. అంటే కంసుడు లాంటి పాత్ర అన్నమాట. అలాంటి సమయంలో దీపకను అశ్వత్థామ రక్షిస్తాడు. కాంప్లెక్స్ సిటీ నుంచి బయటకు తీసుకోస్తాడు. దాంతో దీపికను పట్టుకొచ్చిన వారికి 1 మిలియన్ యూనిట్స్ అనే భారీ ఆఫర్ రావడంతో భైరవ ఆమె కోసం వస్తాడు. అప్పుడే జరుగుతుంది అశ్వత్థామ, భైరవకు ఫైట్.

ఇక ఇందులో కలి పుట్టాడు అని చెప్పడానికి చెట్లు చిగురించడం, కాశీలో నీళ్లు రావడం లాంటి మెటాఫర్ చూపించారు. మరో ప్రక్క కాశీ పట్టణంలో భైరవ గర్ల్ ఫ్రెండ్ దిషా పటానీ. ఆమెను భైరవ పట్టించుకోకుండా కేవలం డబ్బు వెనకాల మాత్రమే పరుగెడుతుంటాడు. కల్కి పుట్టడంతో పార్ట్ వన్ ముగుస్తుంది . పూర్తి కథ ఏంటో తెలియాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

నాగ్‌ అశ్విన్‌ ‘కల్కి’ గురించి మాట్లాడుతూ... ‘మహాభారతం’, స్టార్‌ వార్స్‌… రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలై 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్‌ పెట్టాం. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ ఇండియన్‌ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాం.’ అని చెప్పుకొచ్చారు. ఏదైమైనా అన్ని ఫెరఫెక్ట్ గా సెట్ అయితే ఇండియన్ తెరపై ఓ అద్బుతం చూడబోతున్నాం అన్నమాట.

Read More
Next Story