ఎవరీ శోభితా ధూళిపాళ్ల..?! హాలీవుడ్ సినిమాలు చేస్తున్న తెలుగు అమ్మాయి ప్రస్ధానం
నాగచైతన్య మరో పెళ్లి చేసుకుంటున్నారు అనగానే ఎవరా అమ్మాయి..సమంత కన్నా బాగుంటుందా...ఏం చేస్తూంటుంది..
నాగచైతన్య మరో పెళ్లి చేసుకుంటున్నారు అనగానే ఎవరా అమ్మాయి..సమంత కన్నా బాగుంటుందా...ఏం చేస్తూంటుంది.. అసలు ఏ కుటుంబం, కులం, మతం, ఊరు అన్నీ వెతికేస్తూంటారు అభిమానులు. ఎందుకంటే ఆషామాషీ అమ్మాయి ఆ ఇంటికి కోడలు రాదని వాళ్లకి బాగా తెలుసు. శోభితా దూళిపాళ..అక్కినేని ఇంటి పేరుకు షిప్ట్ అవుతున్న సందర్బంగా ఎవరీమె అనే విశేషాలు చూద్దాం.
అక్కినేని వారింట ఆనందం నృత్యం చేస్తోంది. వారింట మరోసారి పెండ్లి బాజాలు మోగనున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు తాజాగా నటి శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని చైతూ తండ్రి హీరో నాగార్జున ప్రకటించారు. గురువారం ఉదయం ఈ జంటకు నిశ్చితార్థం జరిగిందని ఆయన తెలిపారు. ఆమెను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామని నాగార్జున అన్నారు.
అలాగే తమ కుమారుడు ,కాబోయే కోడలు మధ్య ప్రేమ, సంతోషం జీవితాంతం కొనసాగాలని నాగార్జున ఆకాంక్షించారు. 8.8.8.. హద్దులేని ప్రేమకు నాంది ఈ రోజు అని అన్నారు. ఈ హ్యాపీ కపుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వీరి నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది.
ఇక 2017లో నటి సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది ఎంతోకాలం నిలవలేదు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్‌లో విడిపోతున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత కొంతకాలానికి చైతూ-శోభిత జంటపై రూమర్స్ మొదలయ్యాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం చేసుకోడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ క్రమంలో అక్కినేని కుటుంబ సభ్యురాలిగా మారుతున్న శోభిత ధూళిపాళ్ల ఎవరు అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
"We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD
ఎవరీ శోభిత?
మొట్టమొదట శోభిత మన తెలుగు అమ్మాయే అని తెలుసుకోవాలి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన అమ్మాయి. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. భిత ధూళిపాళ్ల తండ్రి వేణుగోపాల్ రావు మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి శాంతరావు గవర్నమెంట్ టీచర్ .శోభిత వైజాగ్ లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి షిప్ట్ అవటంతో అక్కడ ముంబై యూనివర్సిటీ, హెచ్‌ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తిచేసింది.
కెరీర్ పరంగా చూస్తే ...శోభిత ధూళిపాళకు వార్షిక నేవీ బాల్ పిన్ 2010లో నేవీ క్వీన్‌గా పట్టాభిషేకం చేయబడింది. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచింది శోబిత. ఆ తరువాత భారతదేశం తరపున "మిస్ ఎర్త్ 2013" పోటీల్లోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్ గెలవలేకపోయారు. 2016లో 'రామన్ రాఘవన్' అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019–2023) లో ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత అనేక తెలుగు, హిందీ, మలయాళ చిత్రాల్లోనూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ మధ్యన ఆమె చేసిన దుల్కర్ కురుప్, మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్', అడవి శేషు 'మేజర్' సినిమాలు బాగా పేరు తెచ్చి పెట్టాయి. ఆ రెండు సినిమాల్లో పెర్ఫామెన్స్తో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హిందీ వెబ్ సిరీస్ "ద నైట్ మేనేజర్"లో అనిల్ కపూర్ భార్యగా నటించారు. హాలీవుడ్ లోనూ ఇటీవలే ఆమె అడుగుపెట్టింది. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటించారు. కల్కి చిత్రంలో దీపికా పదుకొణ్‌కు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పింది. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకున్నారు.
ఇలా కెరీర్ లో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ పేరు ,కీర్తి క్రియేట్ చేసుకుని వెలిగిపోతున్న అమ్మాయి శోభిత ధూళిపాళ. వెనకాల ఎవరూ గాడ్ ఫాధర్ లేకపోయినా , తన కుటుంబానికి సినీ పరిశ్రమతో సంభందం లేకపోయినా పరిశ్రమలో తనకంటూ ఓ స్దానం క్రియేట్ చేసుకుంది. తెలుగు నుంచి అతి తక్కువ సమయంలో హాలీవుడ్ ఆఫర్స్ దాకా ప్రస్దానం సాగిన ఆమెకు వివాహ శుభాకాంక్షలు తెలియచేద్దాం.