నటి నయనతార ‘అన్నపూరణి’ గురించి ఎందుకు క్షమాపణ చెప్పింది.
x

నటి నయనతార ‘అన్నపూరణి’ గురించి ఎందుకు క్షమాపణ చెప్పింది.

నయనతార నటించిన ‘అన్నపూరణి’ చిత్రంపై విమర్శలు ఎందుకొచ్చాయి. చివరకు ఆమె ఏమని క్షమాపణ కోరింది.


లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’. ఈ మూవీపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. నీలేష్‌ కృష్ణ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో రాముడిని కించపరిచేలా కొన్ని డైలాగులు ఉన్నాయని, లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహించేలా సినిమా ఉందంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించడంతో పాటు చిత్రయూనిట్‌పై చర్యలు తీసుకోవాలని శివసేన మాజీ నేత రమేష్‌ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ ఫ్లిక్స్‌ నుంచి చిత్రాన్ని తొలగించారు.

క్షమాపణ కోరిన నయనతార...

సినిమాపై నెలకొన్న వివాదంపై నటి నయనతార స్పందించారు. క్షమాపణ కోరుతూ ఇన్‌స్టాలో ఒక నోట్‌ షేర్‌ చేశారు.

‘‘నేను, నా బృందం ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఎప్పుడూ అనుకోలేదు. భగవంతుడి మీద విశ్వాసంతో తరుచుగా దేవాలయాలను సందర్శించే వ్యక్తిని నేను. ఎవరినో కించపరచాలని ఈ చిత్ర నిర్మాణం జరగలేదు. ప్రేక్షకుల్లో పాజిటివిటీ పెంచే దిశగా.. నా 20 ఏళ్ల సినీ ప్రయాణం సాగింది. మీ మనోభావాలను గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి’’ అని నయనతార రాశారు.



Read More
Next Story