ఎన్టీఆర్ ఎందుకంత నెర్వస్ గా ఉన్నారు ? ఇదే డిస్కషన్
x

ఎన్టీఆర్ ఎందుకంత నెర్వస్ గా ఉన్నారు ? ఇదే డిస్కషన్

దేవర సినిమా సక్సెస్ దర్శకుడు కొరటాల శివకు ఎంత అవసరమో. అంతకు మించి ఎన్టీఆర్ కు ఉంది. అందుకు కారణం సోలోగా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రవేశిస్తూండటమే.


దేవర సినిమా సక్సెస్ దర్శకుడు కొరటాల శివకు ఎంత అవసరమో ..అంతకు మించి ఎన్టీఆర్ కు ఉంది. అందుకు కారణం సోలోగా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎన్టీఆర్ ఈ సినిమాతో ప్రవేశిస్తూండటమే. దాంతో కొద్దిపాటి నెర్వస్ తెలియకుండానే ఉంటుంది. అది ఎన్టీఆర్ మొహంలో స్పష్టంగా కనిపించింది అంటోంది బాలీవుడ్ మీడియా. సాధారణంగా ఎన్టీఆర్ పబ్లిక్ ఈవెంట్ లలో చాలా ఈజ్ తో ఉంటారు. కానీ ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఆయనలో కొద్దిపాటి నెర్వస్ కనిపించందంటున్నారు. ఆ విషయం స్వయంగా ఎన్టీఆర్ ఒప్పుకున్నారు కూడా. అయితే ఎన్టీఆర్ కు ఇదేమీ తొలి చిత్రం కాదు. బాల నటుడుగా కెరీర్ ప్రారంభించిన ఆయన కెరీర్ లో ఎన్నో సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అయినా ఎందుకు నెర్వస్ గా ఉన్నారు అనేది చర్చగా మారింది.

ఎన్టీఆర్ దాదాపు ఆరేళ్ల తర్వాత చేస్తున్న సోలో చిత్రం ఇది. అంటే భారం మొత్తం తన భుజాలపైనే ఉంటుంది. దానికి తోడు RRR వంటి గ్లోబ‌ల్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న చిత్రం కావ‌డంతో ఎక్సపెక్టేషన్స్ ఓ రేంజిలో ఉంటాయి. ఫ్యాన్స్ తో సమానంగా యాంటీ ప్యాన్స్ కూడా ఈ మూవీ కోసం వేయి కండ్ల‌తో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన పాట‌లు జనాల్లోకి బాగా వెళ్లాయి. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు బాగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

సాధారణంగా ఏదైనా పెద్ద చిత్రం ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు పీక్స్ కు వెళ్లిపోతాయి. దేవర పార్ట్ 1(Devara Part 1) ట్రైలర్‌ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయని టీమ్షఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ బాగుంది ట్రైలర్ అంటున్నారు కానీ అరాచకం అద్బుతం అనటం లేదు. సినిమాకు మొదటి నుంచి ఇస్తున్న హైప్ ని ట్రైలర్‌లో ఏమాత్రం రీచ్ కాలేదని, అలాగే ట్రైలర్ ను కట్ చేసిన విధా‌నం పాన్ ఇండియా సినిమా స్దాయిలో లేదని అంటున్నారు.

ఇవన్నీ ప్రక్కన పెడితే ముంబై ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తనకు దేవర విషయంలో దడగా ఉందని ఆరేళ్ల అనంతరం సోలో హీరోగా చేస్తున్న సినిమా కావటంతో.. దేవర ఫలితం పై ఆసక్తి వెయిట్ చెస్తున్నానంటూ మాట్లాడటం అభిమానులకు మరింత కంగారు పుట్టిస్తోంది. కానీ దేవర Devara Part 1 సినిమా లాస్ట్ 40 నిమిషాలు అదిరిపోతుందంటూ కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం‌ చేసారు ఎన్టీఆర్. దాంతో ఎన్టీఆర్ (Jr Ntr) స్పీచ్‌ను విన్నవారంతా.. ఏంటి ఇంత అనుమానంగా మాట్లాడుతున్నాడు.. దేవర రిజల్ట్ పై డౌటా, రిజల్ట్ ముందే ఐహించి ప్రిఫేర్ చేస్తున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ కారణం కూడా కావచ్చు

ఇక ట్రైలర్ లాంచ్ లో ఎన్టీఆర్ హిందీలో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ఇంగ్లీష్ లో మాట్లాడారు. దాంతో కొంత నెర్వస్ అయ్యి ఉండవచ్చు అంటున్నారు. అలాగే ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి గతంలో రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి వచ్చారు. ఇప్పుడు తానే మొత్తం లీడ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ కూడా ఎన్టీఆర్ ని టెన్స్ లో పడేసి ఉండవచ్చు.

‘దేవర’ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ చరణ్‌తో కలిసి నటించా. ఆరేళ్ల తర్వాత నా సోలో మూవీగా ‘దేవర’ రిలీజ్‌ కానుంది. కాస్త టెన్షన్‌గా ఉంది. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ముంబయిలో ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ ప్రమోషన్స్‌లో సమయంలో నార్త్ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయా. ఈ కొత్త సినిమానీ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

అలాగే ‘‘దేవర’ విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయి. చివరి 40 నిమిషాలు సినిమా మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమా సినిమాకీ కొరటాల శివపై నా ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంటాయి. ఆయనతో ఎంతోకాలంగా పరిచయం ఉంది. నా ‘బృందావనం’ సినిమాకి శివ రచయిత. కమర్షియల్‌ చిత్రాల్లో.. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తుంటాడు హీరో. ‘దేవర’లో దానికి భిన్నంగా ఉంటుంది. ఇందులో మనిషిని చంపేంత ధైర్యంతో ఉండే కొందరికి హీరో భయాన్ని పరిచయం చేస్తాడు. అండర్‌ వాటర్‌లో 38 రోజులు చిత్రీకరణ చేశాం. హై ఓల్టేజ్‌ యాక్షన్‌తో ఈ సినిమా రాబోతుంది’’ అని చెప్పుకొచ్చారు.

ఏదైమైనా ఎన్టీఆర్ ఖఛ్చితంగా ఈ సినిమాతో ప్యాన్ ఇండియా మార్కెట్ లో తనదైన శైలిని పరిచయం చేస్తారు. యాక్షన్ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఉన్న ఆదరణ దృష్ట్యా అక్కడ కూడా బాగానే బిజినెస్ జరుగుతోంది. అలాగే ఎన్టీఆర్ హిందీ డబ్బింగ్ సినిమాలు అక్కడ టీవీల్లో యూట్యూబ్ లలో చూసే జనం ఎక్కువ. దాంతో ఆయనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఇవన్నీ ప్రక్కన పెడితే కరణ్ జోహార్ వంటి స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అక్కడ ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయటంతో సరైన థియేటర్స్ దొరుకుతాయి. అలాగే జాహ్నవి కపూర్, సైఫ్ అలీ ఖాన్ అక్కడ వారికి ఖచ్చితంగా ఆసక్తి కలిగించే అంశాలే.

Read More
Next Story