ఆ సినిమా కోసం మకాం మార్చిన సూర్య!
x
jai Bheem poster

ఆ సినిమా కోసం మకాం మార్చిన సూర్య!

కాలేజీ బుల్లోడుగా మేకోవర్‌ అవ్వడానికి తన సతీమణి జ్యోతికతో కలిసి ముంబైలో మకాం పెట్టినట్లు సమాచారం. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.


సామాన్యుడి కష్టాన్ని కళ్ళకు కట్టినట్టు వాదించిన జై భీమ్ సినిమాలో లాయర్ ను మనం అంత తొందరగా మర్చిపోలేం. చినతల్ని కష్టాన్ని కోర్టుకు తెచ్చి పాలకుల కళ్లు తెరిపించిన సీన్ మనకు ఏడుపు తెప్పిస్తుంది. ఆ పాత్ర పోషించింది సూర్య. పాత్రలో లీనమైపోవడం ఆయన ప్రత్యేకత. అలా ఆయన.. పాత్రల్లో లీనమై పోయిన సినిమాల్లో ఆకాశం నీ హద్దురా, జై భీమ్‌, పోలీస్ వంటివి అనేకం చెప్పవచ్చు. ఇప్పుడు కంగువ చిత్రంలో నటిస్తున్నారు. చారిత్రక కథాచిత్రంగా రూపొంతున్న ఈ చిత్రం కోసం సూర్య తనను తాను చాలానే మార్చుకున్నారు. ఒక విప్లవ నాయకుడిగా సూర్య గెటప్‌, ఆ చిత్రం గ్లిమ్స్‌ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం రూపొందించడంతో పాటు 36 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

వచ్చే ఏడాదికి సిద్ధం..

కంగువ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా తెరపై రావడానికి ముస్తాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా సూర్య పూర్తి చేశారు. దీంతో ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ఆకాశం నీ హద్దురా అనే సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇదే చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నిర్మాతగా హిందీలో నిర్మించి సక్సెస్‌ అయ్యారు. ఈ కాంబినేషన్‌లో మూడోసారి చిత్రం తెరకెక్కనుంది. దీన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్‌ టెయిన్మెంట్‌ పతాకంపై నిర్మించనున్నారు.

ఇది కూడా 1965 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఈ చిత్రానికి నేపథ్యం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1965లో భాషాయుద్ధంలో మరణించిన రాజేంద్రన్ ఫోటో, సూర్య ఫోటోలు ఒకేసారి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులో సూర్య కాలేజీ విద్యార్థిగా నటించనున్నారు.

కాలేజీ కుర్రోడిగా సూర్య

ఇందుకోసం ఆయన కాలేజీ బుల్లోడుగా మేకోవర్‌ అవ్వడానికి తన సతీమణి జ్యోతికతో కలిసి ముంబైలో మకాం పెట్టినట్లు సమాచారం. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. నటి నజ్రియా కథానాయకిగా ఉంటారంటున్నారు. ఈ చిత్రం వచ్చే నెల సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం.

Read More
Next Story