
‘రంగస్థలం’ కాంబో రీటర్న్, కానీ…
స్క్రిప్ట్ ఎక్కడ స్టక్ అయ్యింది?
సుకుమార్ సినిమా అంటే కేవలం కథ కాదు— కొత్త ప్రపంచం. కొత్త పాత్రలు. కొత్త ఊహ . అంతేనా ఎమోషన్‌కి ఎడ్జ్, క్యారెక్టర్‌కి బలం, ప్రేక్షకుడిని కదలకుండా కుర్చీలోకి నొక్కే టెన్షన్. అలాంటి డైరెక్టర్‌తో మరోసారి రామ్ చరణ్ కలిస్తే? అది సినిమా కాదు… ఈవెంట్. గతంలో “రంగస్థలం” అదే నిరూపించింది. బ్లాక్‌బస్టర్ కంటే ఎక్కువ — కల్ట్. రిస్క్, రా ఎమోషన్, స్టైల్—ఈ కాంబోకి స్కోప్ అనేది ఎక్కడో పైనే ఉంటుంది.
ఇప్పుడు మరోసారి ఇద్దరి కొత్త సినిమా ఎలా ఉంటుంది? అనే దాని కన్నా చరణ్ నెక్స్ట్ ఎప్పుడు? సుకుమార్ స్క్రిప్ట్ ఎక్కడదాకా వచ్చింది? ఫ్యాన్స్ ఆతృత, రూమర్స్, అంతర్గత గుసగుసలు—అంతా హై పీక్స్. కానీ నిజంగా ఏముంది? అక్కడే అసలు కథ మొదలవుతుంది.
“రంగస్థలం” తర్వాత రామ్ చరణ్–సుకుమార్ కాంబో అంటే ఏ స్థాయి అంచనాలో ఉందో అందరికీ తెలిసిన విషయం. ఫ్యాన్స్ దాదాపు రెండు సంవత్సరాలుగా అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. కానీ… ప్లాన్ లాగే ముందుకు వెళ్లడం లేదు. ఇంకా క్లియర్‌గా ఏం లాక్ కాలేదు.
అయితే… రామ్ చరణ్ సుకుమార్ కోసం సైలెంట్‌గా వెయిట్ చేస్తాడా? లేక మద్యలోనే మరో సినిమా చేసి ఇండస్ట్రీని షాక్ చేస్తాడా? ఇదే టాలీవుడ్‌లో పెద్ద ప్రశ్న!
ఎందుకు ఆలస్యం?
“పుష్పా 2”తో 2024 చివర వరకు బిజీగా ఉన్నాడు సుకుమార్. ఇదే టైమ్ లో రామ్ చరణ్ “గేమ్‌ఛేంజర్”, తర్వాత “పెద్ది”లో బిజీ. సమ్మర్ 2026కి ముందు రామ్ చరణ్ పూర్తిగా ఫ్రీ అవ్వడు. ఇంత టైమ్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ అప్పటికే రెడీ అయిపోయి ఉంటుంది.
అయితే అసలు గ్రౌండ్ రిపోర్ట్స్ మాత్రం వేరే చెబుతున్నాయి… సుకుమార్ ఇంకా కథ వండకంలోనే ఉన్నాడు!
సుకుమార్ ఇప్పటికీ రైటింగ్ స్టేజ్‌లోనే ఉన్నాడట. బేసిక్ స్టోరీ కూడా పూర్తిగా లాక్ కాలేదని లోపలి వర్గాల మాట. అద్బుతంగా వచ్చాకే ముందుకు వెళ్దామనుకుంటున్నారట. ఎందుకంటే క్రేజ్ ఎలా ఉంటుందో ఆయనకు అంచనా ఉంది. ఇప్పుడు ఆయన మనసు రెండు ఐడియాల మధ్య నగిలిపోతుంది:
1. స్టైలిష్, మోడ్రన్, ఎమోషనల్ డ్రామా
ఆర్టిస్టిక్‌గా దీంట్లో డెప్త్ ఉంది, కానీ క్లాస్ ఆడియన్స్‌కి మాత్రమే పనిచేయొచ్చని ఫియర్.
2. రా, మాస్ రూరల్ ఎంటర్టైనర్
ఇది హిట్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ… రంగస్థలం–పుష్పా కంపారిజన్స్ ఖచ్చితమని సుకుమార్‌కి క్లారిటీ. అది తప్పించుకోవాలన్న దృక్కోణే ఆలస్యానికి కారణం. సబ్జెక్ట్ ఏది సెలెక్ట్ చేసినా… సుకుమార్ స్టైల్లో డీటైల్డ్ స్క్రీన్‌ప్లే రావడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఆయన బాగా రాస్తాడు కానీ స్లోగా, లేయర్లతో.
రామ్ చరణ్ ఎప్పటికి ఫ్రీ అవుతాడు?
చరణ్ మార్చ్ చివరిలో ఫ్రీ అవుతాడు. అప్పటికి స్క్రిప్ట్ పూర్తి కాకపోతే? ఇండస్ట్రీ ఇప్పుడు ఆలోచిస్తున్నది ఇదే: చరణ్ ఒక చిన్న సినిమా, క్వికీ చేస్తాడా? లేదా ఓపికగా సుకుమార్ కోసం వెయిట్ చేస్తాడా?
సుకుమార్ స్క్రిప్ట్ లేట్ అయినా, అది చివరికి వెయిట్ వర్ధ్ అవుతుందని, లోతు, లేయర్లు, ఇంపాక్ట్ ఉంటాయని అనుభవం చెబుతోంది. కానీ… ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నది ప్రస్తుతం ఉన్నది ఒకే ఫీలింగ్:
ఈ కాంబోపై ఇంకా క్లారిటీ లేదు… కానీ హైప్ మాత్రం అసలు తగ్గట్లేదు!

