ఓం భీమ్ బుష్.. బుస్సు అయ్యిందా? కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?
x
Source: Twitter

'ఓం భీమ్ బుష్'.. బుస్సు అయ్యిందా? కలెక్షన్స్ ఎలా ఉన్నాయి?

వీకెండ్స్‌లో థియేటర్లను నింపేస్తున్న ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే..


ఇండస్ట్రీలో ఏ సమయానికి ఏ సినిమా ఆడుతుందో.. ఎందుకు ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. ట్రేడ్‌ని ఎంతో అనుభవం ఉన్నవాళ్లు కూడా అంచనా వేయటం కష్టం. శ్రీవిష్ణు.. ఆ మధ్య వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేశాడు. అవన్నీ టోకున చీదేసాయి. దాంతో కామెడీగా ‘సామజవరగమన’ చేస్తే అది పెద్ద హిట్టై కూర్చుంది. సరే అని ఇప్పుడు అదే కామెడీ దారిలో మరింత ముందుకు వెళ్లి జాతిరత్నాలు సినిమాలను ఇమిటేట్ చేస్తున్నట్లుగా సీన్స్ రాసుకుని 'ఓం భీమ్ బుష్' అంటూ మన ముందుకు వచ్చారు.

ఈ సినిమాతో పాటు.. వందే భారత్, లైన్ మ్యాన్, యమధీర, హద్దు లేదురా అనే సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు. ఆ విషయం వాళ్లకీ తెలిసినట్లుంది. పెద్దగా ప్రచారం చేయకుండానే థియేటర్లలోకి వచ్చేశాయి ఈ మూవీస్. ఉన్నంతలో.. ఈవారం ‘ఓం భీష్ బుష్’కు సినిమాకే ఎడ్జ్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా హిట్టవుతుందనే అంచనా ఉంది. అందుకు తగ్గట్లే మొదటి 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌తో దుమ్ము లేపింది.

‘ఓం భీమ్ బుష్’(Om Bheem Bush Collections) సినిమా వీకెండ్‌లో ఓవరాల్‌గా సాలిడ్ గానే ట్రెండ్ అయ్యింది, మూడో రోజు సండే అడ్వాంటేజ్‌తో మరోసారి అన్ని చోట్లా దాదాపు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఇక 4వ రోజు హోలీ హాలిడే కూడా కావటంతో 3వ రోజు నైట్ షోలకి కూడా మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ట్రాక్ చేసిన సెంటర్స్‌లో ఆల్ మోస్ట్ సిటీల్లో బాక్స్ అఫీస్ దగ్గర ట్రెండ్ అవుతూ ఉండటం గమనించవచ్చు. అయితే రేపటి నుంచి ఈ సినిమాకు అగ్నిపరీక్ష.

మూడో రోజు ప్రజెంట్ ట్రెండ్‌ను బట్టి చూస్తూ ఉంటే మొత్తం మీద 1.5 కోట్ల రేంజ్‌కి అటూ ఇటుగా షేర్‌ని అందుకునే అవకాశం కనిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా సినిమా 1.8 కోట్ల రేంజ్‌కి అటూ ఇటూగా షేర్‌ని అందుకుంటుంది, అన్ని సెంటర్స్‌లో ఎక్స్ లెంట్‌గా ట్రెండ్‌ని చూపెడుతున్న ‘ఓం భీమ్ బుష్’ సినిమా లాంగ్ 4 డేస్ వీకెండ్ అంటే హోలీ రోజు కూడా ఇలానే జోరు చూపిస్తే బిజినెస్‌లో మాగ్జిమం కవర్ చేసే అవకాశం ఉంది.

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్‍లో వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమా స్లోగా స్టార్ట్ అయ్యినా మెల్లిగా పికప్ అవుతోంది. బ్యాంగ్ బ్రోస్ అనే పేరుతో భైరవపురంలో మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించే ముగ్గురు యువకుల కథగా ఓం భీమ్ బుష్ తెరకెక్కింది. మొదటి నుంచీ ఈ సినిమాలో కామెడీ తప్ప పెద్దగా కథ ఏమీ ఉండదని చిత్ర బృందం చెప్తూ వచ్చింది. అయితే విడుదలకు ముందు సినిమాకి సంభందించిన ఒక ఎమోషనల్ లైన్ బయటకి రాకుండా చూసుకున్నారు.

ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే అసలు కథ కోసం ఎల్జీబీటీ అంశాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ అంశాన్ని కేరళ రాజులతో ముడిపెట్టారు. శ్రీ హర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో ప్రీతి ముకుంద్, ప్రియ వడ్లమాని, కామాక్షి భాస్కర్ల, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సన్నీ ఎమ్ఆర్ సంగీతాన్ని ఇచ్చాడు. మరో ప్రక్క ఈ వారం కూడా రీ-రిలీజెస్ హవా కనిపిస్తోంది. ఆల్రెడీ నువ్వు-నేను రిలీజైంది. 'ఈరోజుల్లో' అనే సినిమా వస్తోంది. మరో 3 రోజుల్లో నాయక్ సినిమా కూడా రీ-రిలీజ్ అవుతోంది.

Read More
Next Story