రేవ్ పార్టీ కేసులో హేమకు ట్విస్టులే ట్విస్ట్‌లు.. నిషేధం తప్పదా..!
x

రేవ్ పార్టీ కేసులో హేమకు ట్విస్టులే ట్విస్ట్‌లు.. నిషేధం తప్పదా..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్‌. హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హేమపై నిషేధం విధించే దిశగా టాలీవుడ్ చర్చలు చేస్తున్నట్లు సమాచారం..


బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు తేలిన నటీనటుల్లో ప్రస్తుతం హేమ ప్రధానంగా కనిపిస్తోంది. అందుకు హైదరాబాద్‌లోనే ఉన్నాంటూ వీడియో, బిర్యానీ వండుతూ వీడియో చేయడమే హేమను ఎక్కువగా దెబ్బకొట్టాయని అందరూ అంటున్నారు. అదే సమయంలో ఆమెకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో హేమ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే ‘మా’ అసోసియేషన్.. హేమపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఈ అంశంపై ఎలా స్పందిస్తుంది? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇదే సమయంలో టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాత చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేకెత్తిస్తున్నాయి.

హేమపై ‘మా’ యాక్షన్

రేవ్ పార్టీ కేసులో పేరు నమోదు కావడం, హేమకు పోలీసులు నోటీసులు పంపడం అంతా తెలిసిన విషయమే. తాజాగా ఈ కేసుపై మా అసోసియేషన్ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అందులో భాగంగా మా అసోసియేషన్ కార్యవర్గ సభ్యురాలిగా హేమను తొలగించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పుడు రానున్న మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని కూడా అసోసియేషన్ ఆలోచిస్తుందని సమాచారం.

హేమపై నిషేధం తప్పదా..

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంతో టాలీవుడ్‌లో డ్రగ్స్ మరోసారి కలకలం రేపాయి. ఈ పార్టీకి నటి హేమ హాజరయినట్లే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు నిర్ధారితమయింది. తాజాగా దీనిపై టాలీవుడ్‌లోకి ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘డ్రగ్స్ మాఫియా, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా వాటిలో ఒకరో ఇద్దరో సినిమా వాళ్లు ఉంటున్నారు. వాళ్లు పాల్పడుతున్న ఈ నేరాలు, అపసక్రమ మార్గాలను ప్రజలు యావత్తు సినీ పరిశ్రమకు ఆపాదిస్తున్నారు. వాస్తవానికి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అది ఎవరైనా సరే. ఇందులో భాగంగానే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారితమైన హేమపై నిషేధం విధిస్తూ చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, పరిశ్రమకు చెందిన ఛాంబర్ వంటి సంస్థలను కోరుతున్నా’’ అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడంతో ఆమెపై నిషేధం కూడా విధించే అవకాశాలు అధికంగానే ఉన్నాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశంపై రానున్న వారం రోజుల్లో కమిటీ సమావేశం కావొచ్చని సమాచారం.

హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసు రోజురోజుకు ముదుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిలో నటి హేమ కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు నోటీసులు అందుకున్న వారందరూ కూడా తమ ముందు హాజరుకావాలని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు తెలిపారు. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని కూడా వివరించారు.

Read More
Next Story