హజార్ రాహే ముడ్ కె దేఖీ... వెనక వెేదన వెల్లడించిన గుల్జారు
x

హజార్ రాహే ముడ్ కె దేఖీ... వెనక వెేదన వెల్లడించిన గుల్జారు

గుల్జార్ పాట వింటేచాలు వెంటబడుతుంది. గుల్జార్ పాటలకు ఆ మాధుర్యం ఉర్దూ నుంచి వచ్చింది. ఇలాంటి మహాకవి మన మధ్య ఉన్నాడంటే కారణం ఎవరో ఆయన మాటల్లోనే చదవండి.


సినీ నిర్మాత, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ తనకు స్ఫూర్తినివ్వకపోయి ఉంటే నా సినీ ప్రయాణం ఎప్పుడో ముగిసిపోయి ఉండేదని పాటల రచయిత, దర్శకుడు గుల్జార్ అన్నారు. గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కాల్రా. ఉర్దూకవి, విశిషమయిన రచయిత, దర్శకుడు. బందినిచిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ డి బర్మన్ సహాయకుడిగా ఆయన సినీజీవన యాత్ర మొదలయింది. ఈ రోజు హిందీ చిత్రరంగంలో మిగిలిన విశష్టమయిన కళాకారుడు, రచయిత, కవి, గాయకుడు కూడా.

ముంబైలో జాతీయ అవార్డ్ గ్రహీత యతీంద్ర మిశ్రా రాసిన ‘హజార్ రాహే ముడ్ కే దేఖి’ (Hazaar Rahen Mud Ke Dekhin)పుస్తకావిష్కరణ సభ జరిగింది. నటి ఎంపీ హేమా మాలిని ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి గుల్జార్, సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్, ఆయన భార్య, గాయని రేఖా భరద్వాజ్, పాటల రచయిత ప్రసూన్ జోషి తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పుస్తకం టైటిల్ తోడిసి బే వఫాయి లోని సూపర్ హిట్ సాంగ్.

ఈ సందర్భంగా ఆయన నెమరువేసుకున్న జ్జాపకాలు.

"నాకు చాలాకాలం పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ డీ బర్మన్ తో అనుబంధం ఉంది. అయితే నేను అప్పటికే కష్టాలను ఎదుర్కొంటున్నాను.. అదే సమయంలో ఓ యువ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత వచ్చి నా చేయి పట్టుకుని నడిపించారు. అది ఎవరో కాదు.. విశాలే" అని ఎవరికి తెలియన సున్నితమయిన రహస్యం బయటపెట్టారు.


" అయితే మొదట్లో నా కలం అంత పదునుగా లేదు. విశాల్ తో కలిసి పని చేయడం ప్రారంభం కాగానే అనుభవం తో పాటు పదును తేలింది, అయితే కొన్నిసార్లు నా కలం కాస్త పట్టుతప్పి కొన్ని వేరే అర్థం వచ్చే పాటలు సైతం బయటకు వచ్చాయి. వాటిలో ఓంకార చిత్రంలోని బీడీ జలైలే లాంటివి అంటూ" గుల్జార్ చెప్పుకొచ్చారు.

"నేను ఇప్పటికీ నిత్య విద్యార్థినే. నేర్చుకోవాలనే తపన, ఉత్సాహం ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. నేను పెద్దవాడినైనంత మాత్రానా నేర్చుకోవడం మానేయ్యాలా" అంటూ ఆయన ప్రశ్నించారు. ఒంటరిగా ఎవరూ ఏమి సాధించలేరని, చాలా మంది నా నుంచి కూడా ఎంతో నేర్చుకున్నామని, నేర్చుకుంటున్నామని చెబుతున్నారని, అది నిజమని అన్నారు. విజ్ఞానం అనేది వన్ వే ట్రాఫిక్ వంటిది కాదని అన్నారు. నేను ఎక్కువ నేర్చుకున్నాననే భావన ఎప్పుడూ ఉండకూడదన్నారు. "ఇతరుల నుంచి ప్రేరణ పొందాను అని చెప్పుకోవడానికి ఎలాంటి సంశయం అవసరం లేదు" అని గుల్జార్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికి నా వయస్సు 89, అయినప్పటికీ నేను కూడా ఇతరుల నుంచి ప్రేరణ పొందుతూనే ఉన్నానని, నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనే అర్థంలో వివరించే ప్రయత్నం చేశారు.

గుల్జార్ లాంటి రచయితతో పని చేయడం నా అదృష్టం అని సంగీత దర్శకుడు విశాల్ భరద్వాజ్ అన్నారు. " గుల్జార్ లేనట్లయితే హిందీ సినిమా ప్రపంచం అసంపూర్తిగా ఉండేది. కనీసం ఒక్కసారైన ఆయనతో పని చేయాలని అనుకున్నాను. అందుకే ముంబై వచ్చాను. కానీ మేము దాదాపు 700 పాటల వరకూ కలిసి పనిచేశాం. నా చిత్రాల్లోని 99 శాతం పాటలు ఆయనవే. దేవుడికి కృతజ్ఞతలు" అని భరద్వాజ్ అన్నారు. గుల్జార్ ను సినిమా ప్రపంచంలోని పెద్ద మర్రిచెట్టుగా ఆయన అభివర్ణించారు.

హేమమాలిని.. అద్భుత డాన్సర్: గుల్జార్

హేమతో నా మొదటి చిత్రం అందాజ్ (Andaz :1971). అందులో ఇద్దరం నటులుగా చేశాం. అదే చిత్రానికి నేను పాటలు సైతం అందించాను. సెట్ కి ఆమె తల్లి, అత్తతో కలిసి వచ్చేవారు. నా సినిమాలు ఆడిన, ఆడకపోయినా సరే నేను డ్యాన్స్ వదిలిపెట్టను అనేది.. నాజీవితానికి డ్యాన్సే ముగింపు అని చెప్పేది.. ఆమె ఇప్పటికి అదే అంకితభావంతో ఉందని గుల్జార్ చెప్పుకొచ్చారు. హేమామాలినితో మొత్తం మూడు చిత్రాలకు దర్శకత్వం వహించాను. అందులో మొదటిదీ కినారా(1977), ఖుష్బూ(1975), మీరా(1979) ఆ తరువాత దర్శకత్వం వహించడం మానేశానని చెప్పారు. అనంతరం రచయితగా నిలదొక్కుకోవడం పై దృష్టిపెట్టినట్లు వివరించారు.

నటిగా ఎదిగానంటే, ఆయనే కారణం: హేమామాలిని

గుల్జార్ సినిమాల వల్లే నేను నటిగా ఎదిగానని ఎంపీ, బాలీవుడ్ నటి హేమామాలిని అన్నారు. హీరోయిన్లను కేవలం గ్లామరస్ గా మాత్రమే చూపించాలనే ఆలోచనలకు ఆయన వ్యతిరేకమని చెప్పారు. ఖుష్బూ సినిమా తీసినప్పుడు సాధ్యమైనంత వరకూ మేకప్, హేర్ స్టైయిల్ లేకుండా ఉండాలని దర్శకుడిగా గుల్జార్ తనకు సూచించారని ఆమె గుర్తు చేసుకున్నారు. మొదట్లో కొంచెం కష్టమనిపించిన తరువాత అలవాటు అయిందని చెప్పారు. అలాగే డైలాగ్ డెలివరిని కూడా సరిచేశారని వివరించారు. "నాకు చాలావేగంగా డైలాగ్ లు చెప్పడం అలవాటు. ఓ సారి గుల్జార్ వచ్చి.. ఇంటి దగ్గర ఏదైన పని ఉందా? లేదా వేరే షూటింగ్ ఏదైనా ఉందా? అని అడిగారని చెప్పారు. కొంచెం నెమ్మదిగా డైలాగ్ లు చెప్పండి అంటూ హెచ్చరించారని .. కొంచెం కష్టమైన తరువాత నేర్చుకున్నానని వివరించారు.

అనంతరం పుస్తకరచయిత మిశ్రా మాట్లాడారు. హేమామాలిని, ధర్మేంద్ర, షర్మిలాఠాగూర్ తో కలిసి దేవదాస్ చిత్రం తీయాలని గుల్జార్ భావించారని చెప్పారు. అయితే అది కార్యరూపం దాల్చలేదని అన్నారు.

కాగా, గుల్జార్, భరద్వాజ్ లు 1990 ల నుంచి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు. ‘జంగిల్ జంగిల్ బాత్ చలీ హై’ వారి కలయికలో వచ్చిన మొదటి పాట. ఇది హిందీ డబ్బింగ్ టీవీ సిరీస్ ‘ది జంగిల్ బుక్ థీమ్ సాంగ్. తరువాత గుల్జార్ చిత్రం "మాచిస్" అలాగే భరద్వాజ్ దర్శకత్వం వహించిన "మక్బూల్", "ఓంకార", " హైదర్" వంటి వాటికి కలిసి పనిచేశారు. అంతకుముందు గుల్జార్ కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించారు. వాటిలో " మేరే అప్నే, పరిచయ్, మౌసమ్, ఆంధీ" వంటివి ఉన్నాయి. స్లమ్ డాగ్ మిలియనర్ చిత్రంలో ఆయన రాసిన జయహో కు ఆస్కార్ ఆవార్డు వచ్చింది.

Read More
Next Story