‘మురారి’ పెళ్లి సీన్ చూస్తూ థియేటర్ లో ప్రేమికుల పెళ్లి...వైరల్ వీడియో...
x

‘మురారి’ పెళ్లి సీన్ చూస్తూ థియేటర్ లో ప్రేమికుల పెళ్లి...వైరల్ వీడియో...

2001వ‌చ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ , ఇపుడు తిరిగొచ్చి సంచలనం సృష్టిస్తున్నది. అయితే, ఈ సినిమా చూస్తూ ఒక అభిమాని ఏకంగా ప్రియురాలికి తాలిబొట్టు కట్టేశాడు.


క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో 2001లో వచ్చిన మురారి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే... ఈ సినిమాలో చూపించిన బంధాలు, బంధుత్వాలు, ప్రేమ ప్రతి ఒక్కటి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చాలా ఇష్టపడుతూ చూస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు.


అయితే గత నెల రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మహేష్ బాబు అభిమానులు తారాస్థాయిలో చేయడం విశేషం... ఇక అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 9న రీ రిలీజ్ అయిన ఈ సినిమా రీ రిలీజ్ అయిన ప్రతి చోట హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోవడం నిజంగా ఒక గొప్ప రికార్డు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలోని 'అలనాటి రామచంద్రుడు' అనే పెళ్లి సాంగ్ ని మన ఇళ్ళల్లో జరిగే ప్రతి పెళ్లిలో వాడుతూ ఉంటారు. ఇక తెలుగులో ఇంతకు మించిన పెళ్లి పాట మరొకటి లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు... ఇక ఇదే క్రమంలో నిన్న మురారి సినిమా రీ రిలీజ్ అయిన సందర్భంగా ఒక ప్రేమ జంట 'అలనాటి రామచంద్రుడు' అనే సాంగ్ వస్తున్నప్పుడు థియేటర్ లో నిజంగానే పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన కాకినాడ తిరుమల ధియోటర్ లో జరిగింది.

అలా ఒక సినిమా ధియేటర్ లో పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక వీళ్ళ పెళ్లికి మహేష్ బాబు అభిమానులు కూడా సపోర్ట్ చేయడం విశేషము.. ఇక దాంతో పాటుగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే వాళ్లు అలా పెళ్లి చేసుకోవడం పట్ల కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే, మరి కొంతమంది మాత్రం పెద్దలకు చెప్పకుండా థియేటర్ లో పెళ్లి చేసుకోవడం అనేది సరైన విషయం కాదు అంటూ నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

ఇక ఏది ఏమైనప్పటికీ ఒక సినిమాను చూస్తూ పెళ్లి చేసుకోవాలని ప్రేరణ కలగడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడెప్పుడో వచ్చిన ఆ సినిమా లోని పాట ఇప్పటి యువతను కూడా ప్రభావితం చేసింది అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ప్రస్తుతం చాలా మంది యువత పెళ్లికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ధియోటర్లో సినిమాచూస్తూ పెళ్లి చేసుకోవడం అంటే కొంచెం అభిమానం వెర్రితలలు వెసినట్లు అనిపిస్తుందని కూడా కామెంట్ చేస్తున్నారు.


Read More
Next Story