సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దులు, హరిదాసులు కనుమరుగు
x
సంక్రాంతి పండుగ సందర్భంలో నల్గొండలో తిరుగుతున్న గంగిరెద్దులు ఆడించేవారు

సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దులు, హరిదాసులు కనుమరుగు

ఆదాయం సరిగ్గా లేకపోవటంతో కుల వృత్తుల వాళ్ళు గంగిరెద్దులను ఆడించటం నుంచి ఇతర ఆదాయం సమకూర్చే పనులను చేపట్టారు.


తెలంగాణాలో సంక్రాంతి పండుగ అంటే భోగిమంటలు, గొబ్బిమ్మల ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసులు. సహజంగా కోడి పందాలు ఇక్కడ సంక్రాంతి సాంప్రదాయ పండుగ సంస్కృతిలో భాగం కావు. గంగిరెద్దులు, హరిదాసులు సంక్రాంతి సంబరాలలో కనుమరుగు అవుతుండటం పండుగ వాతావరణం అసలైన కళను క్రమంగా కోల్పోతుంది.

ఆదాయం సరిగ్గా లేకపోవటంతో కుల వృత్తుల వాళ్ళు గంగిరెద్దులను ఆడించటం నుంచి ఇతర ఆదాయం సమకూర్చే పనులను చేపట్టారు.

రంగురంగుల అలంకరణలతో ఉండే 'గంగిరెద్దు' మరియు సాంప్రదాయ గాయకుడైన 'హరిదాసు' గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ పండుగ వాతావరణాన్ని నింపుతారు. కానీ, ఇప్పుడు సంక్రాంతి పండుగ సమయంలో కూడా ఈ కళారూపాలు గ్రామాల్లో అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి. పూజ గొల్ల కులానికి చెందిన వారు గంగిరెద్దు ఆడించటం, దాసరి కులానికి చెందిన వారు హరిదాసు గా కులవుతులను చేపట్టేవారు. ఈ వృత్తుల ద్వారా వచ్చే ఆదాయం వారి జీవనవారు జీవనం సాగించటానికి సరిపోకపోవటంతో వారు ఇతర పనులను జీవనోపాధిగా చేపడుతున్నారు. ఈ కులాలకు చెందిన చాలా తక్కువ కుటుంబాలు మాత్రమే తమ కులవృత్తిని కొనసాగిస్తున్నాయి.

నల్గొండ జిల్లాలోని మామిళ్లగూడెం గ్రామంలో పూజ గొల్ల కులానికి చెందిన మొత్తం 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 10 సంవత్సరాల క్రితం, వీరు ౩౦ గంగిరెద్దులను కలిగిఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. ఇది అంతరించుకపోతున్న గంగిరెద్దులు కుల వృత్తికి నిదర్శనం.

గంగిరెద్దు కళాకారుడు ఉగ్గం నర్సింహా ది ఫెడరల్ తెలంగాణ తో మాట్లాడుతూ తాము ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నుండి ఒక్కో గంగిరెద్దును రూ. 70,000కు కొనుగోలు చేస్తామని చెప్పారు. శిక్షణ పొందిన ఎద్దులు ఆట నైపుణ్యాలను మరచిపోతే, వాటిని పశువుల సంతలో రూ. 30,000కు అమ్మేయడం లేదా మరో రూ. 15,000 చెల్లించి తిరిగి శిక్షణకు పంపడం తప్ప తమకు వేరే మార్గం లేదని ఆయన వాపోయారు. గంగిరెద్దులను ఆడిస్తున్నప్పుడు తమ కాళ్లకు గాయాలవుతాయని, ఆ నొప్పిని ముఖంలో కనపడనీయకుండా ఆటను కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

మరో కళాకారుడు జిడ్డు చిన్న వెంకటయ్య మాట్లాడుతూ సంక్రాంతి సమయంలో గంగిరెద్దులతో ఇంటింటికీ తిరిగినప్పుడు తమకు రోజుకు కేవలం రూ. 1,000 నుండి రూ. 1,200 మాత్రమే వస్తుందని చెప్పారు. ఒక గంగిరెద్దును ఆడించడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమని, ఒక్కో ఎద్దు మేత కోసం నెలకు రూ. 20,000 ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. అందుకే, పూజ గొల్ల కులానికి చెందిన చాలా కుటుంబాలు గంగిరెద్దులను ఆడించడం మానేసి ఇతర పనులను స్వీకరించాయని ఆయన తెలిపారు.

ఎ. మల్లేష్ మాట్లాడుతూ గంగిరెద్దులను ఆడించడం ద్వారా వచ్చే తక్కువ ఆదాయం కారణంగా తాను సాంప్రదాయ షెహనాయ్ సంగీత కళాకారుడిగా మారాను అని చెప్పాడు. అయితే, తమ గంగిరెద్దుల ప్రదర్శన కనుమరుగైపోకూడదనే ఉద్దేశ్యంతో, సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజుల పాటు తమ కుటుంబానికి చెందిన గంగిరెద్దును తానే ఆడిస్తుంటానని ఆయన తెలిపారు.

ప్రభుత్వం గంగిరెద్దుల కుల వృత్తిని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని అయన కోరారు. సంక్రాంతి పండుగ సమయంలో హరిదాసులు కూడా ప్రత్యేక వేషధారణలో పాటలు పడుతూ ఇంటింటికి తిరిగి సందడి చేసేవారు. ప్రజలు ఇచ్చే ధాన్యం, ధనమును పండుగ కానుకగా స్వీకరించేవారు. కొన్ని కారణాల వల్ల హరిదాసు వృత్తిని స్వీకరించే వారు గణనీయంగా తగ్గారు. పాత తరంకు చెందిన కొందరు వృద్దులు మాత్రమే తమ కుల వృతి మనుగడ కోల్పోకుండా పండుగ సమయంలో హరిదాసు వేషం వేస్తూ అక్కడ అక్కడ కనిపిస్తున్నారు.

కనీసం పండుగ సమయంలో అయినా ప్రజలు మన సంస్కృతి, సంప్రదాయాలను ఆనందించేందుకు ఇలాంటి కుల వృత్తులను పునరుద్దరణకు ప్రభుత్వం నడుంబిగించాల్సిన అవసరం ఎంతో ఉంది.



Read More
Next Story