మూడవ చెవి: ఒక విజేత కథ
x

మూడవ చెవి: ఒక విజేత కథ

రవీంద్రభట్


ప్రత్యేక అవసరాల పిల్లలకు చదువు చెప్పడమే కష్టం. అలాంటి పిల్లలను గుర్తించడం ఇంకా మరి కష్టం. ఇక మూగ పిల్లలకు మాటలు నేర్పడం, వాటికని అర్థం చేసుకునే విదంగా చేయడం అంత తేలిక విషయం ఏమి కాదు. ఎందుకంటే మనం చేసే ఏ పని కాని, మాట గాని మొదట అనుకరణ ద్వారానే వస్తుంది. మాట నేర్చుకోవాలంటే అనుకరణకు ముఖ్య అవయవం చెవి. అది శబ్దమును గ్రహించి, మెదడుకు చెరవేసి , అటుపిమ్మట నోటి గుండా అనుకరిస్తూ నేర్చుకుంటాము.కాని ఈ ప్రత్యేక పిల్లలు పూర్తి వినికిడి లోపం గల వారు. వాళ్లకు మాటలు నేర్పడం కొరకు ఒక తల్లి పడిన పాట్లు , మానసిక సంఘర్షణ , శారీరక శ్రమ లెక్కించడానికి ఏ కొలమానం సరిపోదు. ఆ తల్లికి , ఆమె బర్త మద్దతు , యావత్ కుటుంబం మొత్తం అండగా ఉండీ తన కొడుకుకు మాటలు నేర్పడమే కాదు. సాదారణ పిల్లల మాదిరిగా తయ్యారు చేసినది ఆ తల్లి , ఆ కుటుంబం పడిన పాట్లు యదార్థ అనుభవాల కథే “ మూడో చెవి .. ఓ విజేత కథ” . దీనిని రవీంద్ర భట్ కన్నడ బాషలో “మురనే కివి” అనే పేరుతో రాయగా , తెలుగులో ప్రతాప్ రాజుల పల్లి చక్కగా తెలుగులో అనువాదం చేసి ఇవ్వడం మన అదృష్టం. ఆ విజేత కథను ఒకసారి విశ్లేసించే ప్రయత్నం చేద్దాం.

కర్ణాటక రాష్ట్రం లో దావణగెరే పట్టణంలో రవీంద్రభట్ , దీప దంపతులకు నిరంజన్ రెండవ కుమారుడుగా జన్మించాడు. 13 నెలల పసి వయస్సు ఉన్నప్పుడు దీపావళి పండుగ నాడు కాల్చిన టపాసుల పెద్ద పెద్ద శబ్దాల మోతకు ఏమాత్రం స్పందించని పుట్టు మూగ బాలుడైన నిరంజన్ కథే ఇది.



మొట్ట మొదట విద్యాభ్యాసం ఏదైనా ఒక శ్లోకామో , పద్యమో , ఒక చిన్న గీతముతోనో మొదలు పెట్టుతారు. కాని ఇక్కడ ఒక తండ్రి తన పుట్టు మూగ కొడుకుకు బూతుమాటలతో మొదలు పెట్టుతాడు. “అమ్మ మొద్దు” అంటాడు. తరువాత “మూర్కుడు” అంటాడు. అటు పిమ్మట “తల్లి ముండా” అంటాడు. తల్లి చాలా బాధ పడుతుంది. అలాంటి మాటలు వద్దని అంటుంది. కాని తండ్రి అసలు మాటలే రాని తన కొడుకు మంచో చెడో ఒక మాట పలికినందుకు పాజిటివ్ గాను తీసుకుంటాడు.ఆ తరువాత అది మంచిది కాదని నేర్పి సరి చేస్తాడు.

ప్రత్యేక పిల్లల అవసరాలు గల పిల్లల తల్లి దండ్రులు తొందరగా నేర్చుకోవాలని ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. కాని ఇలాంటి పిల్లలు నేర్చుకోవడానికి చాల సమయం పడుతుంది. నేర్పడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎంతో శ్రమ , విసుగు , విరామమం లేకుండా టీచర్లు , తల్లి దండ్రులు ఓపికగా చెప్పిన దానినే మళ్ళీ మళ్ళీ వత్తి పలుకుతూ మొఖం పెదవుల కదలిక చూపుతూ చెప్పించి, పలికించుటకు పడే శ్రమ ఇంత కాదు. “అమ్మ మొద్దు”, మూర్కుడు , ముండా” లాంటి వాటిని పలికించుటకు షుమారు 8 రోజులు పట్టిందని అంటాడు ఆ తండ్రి . ఇది ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టి ఉండవచ్చు. ఇవి నేర్పించడానికి ఇంటిలోని మొత్తం కుటుంబ సభ్యులు సమిష్టిగా కృషి చేయాల్సి వచ్చింది. “అన్నం” అని పలికే వరకు అన్నం ప్లేటు లో పెట్టక పోవడం, అందరికీ వడ్డించడం నిరంజన్ కు పెట్టక పోవడం. అతడు తప్పనిసరి పరిస్థితిలో మాట ద్వారానే పలుకాలనే పరిస్స్థితి కల్పించిన తీరు అమోఘం. చూసే వాళ్ళకి క్రూరంగా అనిపించ వచ్చు. ఇక్కడ తల్లి దండ్రులు పుట్టు మూగ పసి వాడి పట్ల అమానుషంగా ప్రవర్తించినట్టు కనబడుతుంది. ఇక్కడ వారి శ్రమ , సంకల్పం , తపనను మాత్రమే చూడాలి. అందుకే ఆ తండ్రి “ చెవిటి పిల్లల తల్లి దండ్రులు పిల్లలకు నేర్పించే ప్రయత్నంలో మొదట 4-5 సంవత్సరాల వరకు దయ , దాక్షిణ్యం ,నయం , బయం, కష్టం, నష్టం , పాపం, పుణ్యం అన్నీ సుగుణాలను వదిలి వేయాలి. లేకుంటే ప్రగతి కుంటుపడుతుంది” అని తన అనుభవముతో చెప్పుతారు. “అప్పా” అని పలికించుటకు రెండు నెలల సమయం పట్టిందంటే ఎంత స్థాయిలో ఏ మెరకు శ్రమ పడవలసి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పిల్లలకు నేర్పే క్రమంలో ఒకరు కఠిన వైఖరి ఉంటే, ఇంకొకరు అమ్మో, నాన్నో , అక్కనో , తమ్ముడు లాంటి వారు ఎవరో ఒకరు మద్యలో కల్పించుకుని ,అతి గారబంతో తరువాత నేర్చుకుంటాడులే , అని వెనుక వేసుకుని రావడం వల్ల , పిల్లవానికి తప్పించుకునే అవకాశం కలిగి నేర్చుకోవడంలో మొండికేసి , చిరాకు, కోపం, అరవడం లాంటివి చేసి ఆ పని (task) పూర్తిచేయడు. ఇలాంటి అవకాశం ఇవ్వకుండా కుటుంబం మొత్తం కలిసి కట్టుగా , ఒకే మాట మీద నిలబడి పిల్లవాడికి నేర్పిన తీరు, నేర్పే టప్పుడు తండ్రి అర్థ రాత్రి వరకు ఇంటికి రాకుండా బయటే ఉండడం జరిగేది. సాధారణంగా తప్పించుకునే మార్గములు వెదికినంత కాలం తప్పించుకునే ప్రయత్నం చేసినంత కాలం నేర్చుకోలేడు. ఏ పని పూర్తి చేయలేడు. తప్పించుకునే మార్గాలు లేవు. తప్పసరి నేర్వాలి , చేయాలి, చదవాలి అనే పరిస్థితి కల్పించి నేర్పించడం ఇక్కడ స్పష్టంగా ఉంది.

అంతే గాక కుటుంబ సభ్యుల సంబంధాలు తెలియ జేసే పదాలు అమ్మ, నాన్న, బార్య, బర్త, అత్త, కోడలు , అన్న , తమ్ముడు లాంటివి నేర్పే క్రమంలో , బార్యను బార్య అని బర్త పిలువడం , బర్తను బర్త అని బార్య పిలువడం , అత్తను అత్త అని కోడలు, కోడలును కోడలా అని అత్త అని పిలుచుకోవడం చేసేవారు,. పిలిచే టప్పుడు నోరు తెరిచే విదం, పెదవులు కదిలే విదం , నాలిక కదలికలను పిల్లవానికి స్పష్టంగా చూపే వారు.

అమూర్త భావనలైన అసూయ, ద్వేషం, కోపం, ప్రేమ, అబద్దం, సంతోషం, సుఖం, దుఖం ,నిజం లాంటి భావోద్వేగ విషయాలను నేర్పుటకు ఒక తల్లి అనుసరించిన విధానం , పద్దతి , అవలంబించిన వ్యూహాలు వర్ణించ లేనివి. పలువురి తల్లులకు ఇవి మార్గ దర్శి కాగలవు.

వాక్యం నేర్పించాలంటే ఎంత శ్రమ కలుగుతుందో “నిరంజన్ దోసె తిన్నాడు” అనే పాఠం నేర్పుటకు ఎనిమిది రోజుల పాఠం అయ్యింది. ఈమె చేసిన అన్నింటిలోనూ shaping,chaining, forward chaining, backward chaining, flooding, prompting లాంటి అన్నీ నవీన బోధన పద్దతులు ఆమె తెలియకుండానే ఉపయోగించింది. ఆ తల్లి పట్టుదల , నిబద్దత , తపన లలే ఆమె చేత సహజంగా చేయించింది. శాస్త్రీయ పద్దతులన్నీ అందులో ఇమిడి ఉన్నాయి.మహా బాగవతం రాసిన సహజ పండితుడు పోతన కవి మాదిరి. దీపికా సహజ ప్రత్యేక ఉపాద్యాయురాలు. సజీవ పద్దతిలోను, ఇంటిలో ఉపయోగించే అన్నింటినీ సహజంగా ఉపయోగించి, ఇంటినే పరిశోదన – అభివృద్ది(r &d) విభాగంగా మలిచింది. కుటుంబ సభ్యులంతా ఉపాద్యాయులే కాక సహజ విషయ నిపుణులుగా మారిపోయారు.

వీటితో పాటు ప్రతి వస్తువును పరిచయం చేస్తూ , దానితో పాటు ఆకారం, రంగు, పరిమాణం, అందలి భాగాల పేర్లు , దాని ఉపయోగం లాంటి పలువిషయాలు నేర్పుటకు గంటలు, రోజులు, గడిపి ఆ తల్లి నేర్పించింది. జంతు ప్రదర్శన శాలకు తీసుకుని వెళ్ళి జంతువులను పరిచయం చేయడం . వారు ఏమి నేర్పుతున్నారో వాటికి సంబందించిన మాటలనే ఇంట్లో వాడటం, ఆ బొమ్మలు , చాయా చిత్రాలు గోడలకు అంటించడం వాటిని నేర్పడం చేసేది. చావుకు వెళ్ళి దుఖంను పరిచయం చేయడం . ఇంటికి వచ్చి దుఖాన్ని అనుకరిస్తూ , చూపుతూ నేర్పించడం. లాంటివి ఎన్నో విషయాలు మనల్ని అబ్బుర పరుస్తాయి.

దోశలు చేస్తూ లెక్కలు నేర్పడం. మొదటి ఒకరికి తో ఒకటి. రెండవ దోస ఒకరికి తో రెండు అని వెళ్ళు లెక్క పెట్టుతు కొన్ని సార్లు, చిన్న చిన్న చిల్లర రాళ్ళు ఉపయోగించి కుడికలు, తీసివేత్తలు , గుణకారాలు , బాగాహారాలు నేర్పి, వివిధ రూపాయల నోట్లు, నాణేలు ఇచ్చి డబ్బు యొక్క భావన( money concept)ను కలిగించుటకు మాదిరి కొట్టు లేదా నిజమైన కొట్టు వెళ్ళి కొనుక్కోవడం లాంటివి అనుభవం మరియు ప్రాక్టికల్ గా నేర్పించింది.

ఈ కథ ఎందరికో కరదీపిక కాగలదు. ఒక లక్ష్యాన్ని, ఒక ఆశయాన్ని సాదించాలంటే ఏలాంటి పట్టుదల, కృషి, దృడ సంకల్పం కావాలి. దానిని చేరుకోవడానికి ఎంతటి కటోర మైన శ్రమ పడాలి. తమ విలాసలు , సుఖాలు, ఆనందాలు వదులుకుని లక్ష్యం వైపు ఎలా ఏకాగ్రతగా , శ్రద్దగా దృష్టి కేంద్రీకరించాలి అనే విషయాలు ఈ కథలో మనకు బోధ పడుతుంది.

ఒక సమిస్టీ కార్యం ఎలా చేయాలో నిరంజన్ తల్లి దండ్రులు. కుటుంబ సభ్యులు చురుకైన భాగస్వాములుగా ఉంటూ తల్లికి , బాబుకు ఇచ్చిన మద్దతు , చేయూత జట్టు ప్రేరణ( team spirit) కలిగించిన తీరు ఎందరికో ఆదర్శం.

ఇది చవితి పిల్లల తల్లి దండ్రులకే కాక సమాజములోని ప్రతి వ్యక్తికి , వ్యక్తిత్వ వికాస నిపుణుడికి ఇది ఒక సజీవ కేస్ స్టడీ గా ఉపయోగపడుతుంది. శారీరక వైకల్యం, మానసిక వైకల్యం, ఆటిజం లాంటి పలు ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లి దండ్రులకు , ప్రవర్తన లోపాలు గల పిల్లల తల్లి దండ్రులు కూడా చదువ దగ్గ పుస్తకం.

దురదృష్టమైన విషయం ఏమిటంటే ప్రపంచములోని అందరి హక్కుల గురించి, అందె సదుపాయాల గురించి అడిగే , పోరాడే ఎన్నో సంఘాలు ఉన్నాయి. వీరి గురించి అడిగే వారు లేరు. అట్టడుగు స్తాయి , మారుమూల గ్రామాలలో ఇలాంటి పిల్లలు ఎందరు ఉన్నారో ? వారికి చేరే సదుపాయాలు ఏ మాత్రం ఉన్నాయో ? తీవ్రమైన తగిన శిక్షణ లేని మానవ వనరులు. విద్యా సంస్థల లేమి. ఉన్నవి చాలా మటుకు అన్నీ ప్రయివేట్ రంగంలోనే ఉన్నవి. అర కొర కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆద్వర్యంలో ఉన్నవి. కాని ఇంత విశాల దేశానికి, ఇంత పెద్ద జనాబాకు సరిపోవు. వీరిని పట్టిచ్చుకుని మేధావులు, రాజకీయ వేత్తలు, హక్కుల సంఘాల వాళ్ళు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను.

ఇంతకు విజేత ఎవరు ? నేర్చిన కొడుకా ? నేర్పిన తల్లియా ? కుటుంబ సభ్యులా ? ఇందులో అందరు విజేతలే సుమా !


Read More
Next Story