
మిద్దెతోటలకు బహుమానం... దరఖాస్తు చేయండి
'తుమ్మేటి రఘోత్తమరెడ్డి- రైతునేస్తం మిద్దెతోట పురస్కారాలు'
రెైతు అంటే సామాన్య అర్థం పొలం దున్నేవాడు. దీనికి పొలం అవసరం. ఈ పొలాన్ని తోటగా మలిచే వాడే రైతు. ఈ పొలాలు ఎక్కడో పల్లెటూర్లలోనే ఉంటాయి. అందువల్ల రైతు కావడం అంత సులభం కాదు. అందరి తరం కాదు. రైతులు పుట్టకతో రావాలి. లేదా వనరులు సమకూర్చుకుని చాలా శ్రమించి రైతులు కావాలి. రెండోది అరుదుగా జరిగే పని. ఇది పాతమాట.
ఇపుడు పక్కా ఇల్లున్నవారెవరైనా రైతు కావచ్చు. రైతు కాన్సెప్ట్ ఇపుడు మారిపోయింది. నాలుగు గజాల స్థలంలో కూడా తోటవేయవచ్చు. అంతేకాాదు, ఇంటికి కప్పు ఉంటే చాలు పూలు, కూరగాయలు, పళ్లు పండే తోట వేయవచ్చు. దీన్ని చక్కగా మిద్దె తోట అని పిలిచి, మిద్దెతోట పెంచేవాళ్లని ‘మిద్దెతోట రైతులు’ అని పిలవడం మొదలయింది. భూమే ఉండనవసరం లేదు, మిద్దె ఉన్నా, నాలుగు డ్రమ్ములున్నా, పూల కుండీలొక అరడజన్ సమకూర్చుకున్నా ఇపుడు ఎవరైనా రైతు కావచ్చు. అంతేకాదు, ఇపుడు ఈ మిద్దె తోట సేద్యానికి బహుమతులు కూాడా ఇస్తున్నారు.దీని వెనక ఉన్నది ఇద్దరు వ్యక్తులు. ఒకరు మిద్దె తోటని కాన్సెప్ట్ స్థాయికి తీసుకువెళ్లిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి. రెండో వ్యక్తి ఈ మిద్దెతోటను సేద్యంగా గుర్తించి, ఈరైతుకు అవార్డులివ్వాలనుకున్న రైతునేస్తం ఫౌండేషన్ అధినేత యడపల్లి వేంకటేశ్వరరావు.
ఇలా మిద్దెతోటలను ఒక గొప్ప క్రాఫ్ట్ గా తీర్చిదిద్దిన ఈ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలలో మిద్దెతోటల సాగు అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన కృషికి సర్వత్రా గుర్తింపు వచ్చింది. మిద్దెతోటకు ఆయన పర్యాయపదం అయ్యాడు. ఆయన స్ఫూర్తిగా చాలా మంది చిన్నచిన్ని మిదెలను కూడా తోటలకు మార్చుకుంటున్నారు. తుమ్మోటి రూపుదిద్దిన ఈ మిద్దెతోటల కాన్సెప్ట్ ను గౌరవించాలని 2021 నుండి ఆయన పేరుతో మిద్దెతోట రైతులకు సత్కారాలను 'రైతునేస్తం ఫౌండేషన్' అందిస్తున్నది.
2. మిద్దెతోటలను క్రమంగా శాశ్వత మడులలోకి మార్చుకుంటూ ఇతరత్రా సాధనాలను అదనంగా పెట్టుకుంటూ పోవాలి. తోటను అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దుకోవాలి. విశ్రాంతి, వ్యాయామ, పని ప్రదేశంగా కూడా చేసుకోవాలి.
3. మిద్దెతోటల నిర్వహణ గురించి చీడపీడల గురించి మెరుగైన సస్యరక్షణ చర్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అందుకు తగిన పనిముట్లు, సాహిత్యం సేకరించుకోవాలి.
4. మిద్దెతోటలో పండించిన ఉత్పత్తిని ప్రదర్శించడం ద్వారా, ఇతరులను మిద్దెతోట సందర్శనకు అనుమతించడం ద్వారా, సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం ద్వారా, టీవీలలో పత్రికలలో మీ మిద్దెతోట గురించి తెలియజేయడం ద్వారా ఇలాంటి సంస్కృతి వ్యాప్తికి కృషి చేయాలి.
5. మిద్దెతోట సంస్కృతి వ్యాప్తికి తమ వంతుగా దోహదం చేయాలి. ఇతరులను మిద్దె తోటల పెంపకం చేసేలా స్ఫూర్తిని ఇవ్వాలి.
6. ఒకప్పుడు బాగా చేసి ఇప్పుడు మామూలుగా ఉన్న మిద్దెతోటలను పరిగణలోకి తీసుకోవడం జరగదు. అవార్డు ఇచ్చే సమయానికి కూడా మిద్దెతోట బాగా ఉండాలి.
7. అవార్డులు నిర్ణయించడంలో కొన్నిసార్లు ప్రాతినిధ్యం లేని ప్రాంతాల వారికి ప్రోత్సాహం కోసం ప్రాధాన్యత ఇవ్వవలిసి ఉంటుంది.
8. మిద్దెతోట గ్రూపులలో ఉండటం తప్పనిసరి కాదు గానీ ఉండటం ద్వారా మీ మిద్దెతోట గురించి త్వరగా ప్రచారం కావడానికి వీలుంటుంది.
9. మిద్దెతోట సమావేశాలలో పాల్గొనడం కూడా తప్పనిసరి కాదుగానీ పాల్గొనడం ద్వారా ఏం జరుగుతోందో తెలుసుకొని అవసరమైన దిశలో _ప్రయాణించడానికి వీలుంటుంది.
10. ఈ అవార్డుల కోసం వెలువడే ప్రకటనకు స్పందించి కోరిన పద్ధతిలో చివరితేది లోగా దరఖాస్తు చేసుకోవాలి.

