తిరుమల వెళ్లొచ్చారుగా ? ఈ 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
x

తిరుమల వెళ్లొచ్చారుగా ? ఈ 20 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి

తిరుమల ఆలయంలో విశేషాలు, విచిత్రాలు లెక్కలేనన్ని. రకరకాల పూజలుంటాయి. పేర్లుంటాయి. ప్రతిదాని వెనక గొప్ప చరిత్ర. తిరుమల గురించి కొన్ని ఆసక్తికమయిన విషయాలుమీరంతా తిరుమల ఎన్నో సార్లు సందర్శించి ఉంటారు. చాలా మందికి కొండమీదికి వెళ్లడం మొక్కు.ఈ మొక్కు తీర్చుకోవడానికి కొందరయితే ఏడాదికోసారి తప్పక వెళ్తారు.ఇంకొందరయితే అరునెలలకొకసారి వెళ్తారు. తిరుపతి పరసరాల్లో ఉన్నవాళ్లు నెలకోసారయినా వెళ్లొస్తుంటారు.పది సార్లు ఇరవై సార్లు వందసార్లు తిరుమలేశుని దర్శించుకుని వచ్చిన వాళ్లున్నారు. ఎన్ని సార్లు వెళ్లొచ్చినా ఈ పాటికి మీకు తిరుమల ఆలయం గురించి బాగా తెలిసుండాలి. అయితే, మీ తిరుమల విజ్ఞానానికొక చిన్న పరీక్ష. ఈ ఇరవై ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

1.తిరుమల ఏడు కొండల పేర్లేమిటి?
జవాబు. ఈ ఏడుకొండలను కలిపి శేషాచలం కొండలంటారు. వాటి పేర్లు నీలాద్రి, గురుడాద్రి,అంజనాద్రి, వృషాభాద్రి,నీలాద్రి, నారాయణాద్రి,వెంకటాద్రి.


2. శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు?
జ. ఉగ్రాణం. దేవాలయానికి, ప్రసాదాలకు అవసరమయిన సరుకులన్నింటిని నిల్వచేసే గోడవున్ ఇది. ఇక్కడి నుంచి సరుకులు పోటు (వంటశాల)కు వెళతాయి.


3. వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
జ. నడిమి కావాలి. ఇక్కడే మహంత్ బాబాజీ, వెంకటేశ్వరస్వామిపాచికలాడుతున్న చిత్రాలుంటాయి. వెండి వాకిలి మీద దశావతారాల బొమ్మలుంటాయి. భక్తులు వెండివంటి స్వచ్ఛమయిన మనసుతో ఆలయంలోకి ప్రవేశించాలనేందుకు వెండివాకిలి సూచన.


4. స్వామివారి నామానికి అవసరమయ్యే కర్పూరం రాళ్లను నున్నటి పొడిగా చేసేందు వినియోగించే రాయిని లేదా ప్రదేశాన్ని ఏమంటారు?
జ. పరిమళపు అర


5. సంపంగి ప్రదక్షిణ అంటే ఏమిటి?
జ. ఆలయంలోకి ప్రవేశిస్తూనే మీకు ప్రదక్షిణ మార్గం కనబడుతుంది. ఇదే సంపంగి ప్రద్శక్షిణ. పూర్వం ఈ ప్రదక్షిణ మార్గం వెంబడి సంపంగి చెట్లు పెంచేవారు. ఆలయానికి అసవరమయిన సంపంగిపూలను ఇక్కడినుంచే సేకరించేవారు. అందుకే ఇది సంపంగి ప్రదక్షిణ అయింది.1470లో దీని చుట్టూర మందిరాలను సాళువ నరసింహరాయలు కట్టించారు.


6. వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
జ. 30 అడుగులు


7. విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
జ. అంగ ప్రదక్షిణం. అంగప్రదక్షిణ అంటే పొర్లుదండాలు. భక్తులు సాంష్టంగ పడి దొర్లుకుంటూ చేసేదండాల ప్రదక్షిణ. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరిచిన తర్వాత అంగప్రదక్షిణ క్యూలో నిలబడాలి. వీటికి ప్రత్యేకంగా టోకెన్లుంటాయి. ప్రతి రోజు తెల్లవారుజామున రెండుగంటలకు అంగప్రదక్షిణ మొదలవుతుంది.


8. బంగారు వాకిలికి గరుడ మందిరానికి ముందున్న మండపాన్ని ఏమంటారు?

జ. మహామణిమండపం.దీనిని 1417లో నిర్మించారు.దీనికి పదహారు కాళ్లుంటాయి.


9. బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?

జ. కొలువు మండపం


10. రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?

జ. శయన మండపం. ఇక్కడే భోగశ్రీనివాసుడుికి ఏకాంత సేవ జరిగేది.


11. శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?

జ. అద్దాల మండపం


12. అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి?

జ. అయన మండపం. ఇది ప్రతిమ మండపానికి ఉత్తరాన ఉంటుంది. దేవుడికి రధానికి సంబంధించిన గొలుసులు భద్రపరుస్తారు. ఈ గది గోడలు పైకప్పుఅద్దాలతో ఉంటుంది. ఇది 42 చ.అ గది. ఉంజల సేవ సమయంలో అన్నింటా దేవుడి బొమ్మ రిఫ్లెక్టవుతూ ఉంటుంది.


13. అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
జ. రంగ మండపం లేదా రంగనాయకులు మండపం ఆలయం నడవలో ఆగ్నేయాన ఉంటుంది. 1320 -60 మధ్యదీనిని నిర్మించినట్లు చెబుతారు. 14వ శతాబ్దంలో ఢిల్లీ మొగలుల సైన్యాధి మాలిక్ ఖపూర్ శ్రీరంగం మీద దాడిచేసినపుడు రంగనాథ స్వామి విగ్రహాలను ఇక్కడి తెచ్చి భద్రపరిచినట్లు చెబుతారు.


14. తిరుమల రాయ మండపం లో ఉన్న విగ్రహం ఎవరిది?
జ. రాజా తొడరమల్లు.రంగమండపానికి 12 అడుగుల దూరాన తిరుమల రాయ మండపం ఉంటుంది. అక్బర్ దగ్గిర మంత్రిగా ఉన్న రాజాతోడర్ మల్ రాగి విగ్రహం ఇక్కడ ఉండటంతో ఈ ప్రాతం ఒకపుడు ముస్లింపాలనలో ఉండిందనుకోవాలి.


15. ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
జ. బలి పీఠం. ఆలయంలో జండా పక్కనే ఉంటుంది. దర్శనాలు పూర్తయి, వెండివాకిలినుంచి బయటకు వచ్చాక ఇక్కడ భక్తులు ప్రసాదం పెడతారు. దీనిని సర్వదేవతలు స్వీకరిస్తారని నమ్మకం.


16. శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
జ. కోయిల్ తిరుమంజనం.


17. చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
జ. 4 సార్లు. చక్రస్నానం అంటేశ్రవారి పుష్కరిణిలో చక్రాయుధాన్ని ముంచి స్నానం చేయించడం. ఇది బ్రహ్మోత్సవాలలో చివరిఘటం. తొమ్మిది రోజులు జరిగే ఈ ఉత్సవాలలో వెంకటేశ్వర స్వామి మలయప్ప శ్రీదేవి, భూదేవితో కలసి వూరేగింపు గా వస్తారు. వారి వెంబడి చక్రం ప్రత్యేక వాహనం మీద వస్తుంది. చక్రస్నానం తర్వాత పురోహితులు, భక్తులు కూడా పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. చక్రస్నానం జరిగే సందర్భాలు: బ్రహ్మోత్సవాలు,రథ సప్తమి, వైకుంఠ ద్వాదశి, అనంతపద్మనాభ వ్రతం.


18. విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
జ. 2 సార్లు (విష్ణు సహస్రనామాలు 1008. ఇందులో శ్రీనివాస,శ్రీనిధి అనే వెేంకటశ్వరునికి సంబంధించినవి)


19. వెంకటేశ్వర సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
జ.సాలుగు భాగాలు 70 శ్లోకాలు. ఇందులో సుప్రభాత భాగంలో 29 శ్లోకాలున్నాయి. వీటిని రాసిన వ్యక్తి ప్రతివాద భయంకర శ్రీ అనంతాాచార్య. ఆయననే అనంగరాచార్యా అని పిలుస్తారు. 1430లో సుప్రభాతం రచించారు.అంతకు ముందు ఆయన రంగనాధ సుప్రభాతం రాశారు.సోత్రం, ప్రపత్తి, మంగళశాసనం అనేవి మిగతా మూడు భాగాలు.


20. ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
జ. కోయల్ అళ్వార్ తిరుమంజనం అంటే సుగంధద్రవ్యాలతో గర్భగృహాన్ని, పరిసరాలను, విగ్రహాలను శుభ్రం చేయడం. ఇది ఏడాదికి నాలుగు సార్లు జరుగుతుంది.అవి: ఉగాది ముందు, అనివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాలు.


Read More
Next Story