
ముత్తాత జాడ కోసం ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు.. ఫలించిన 19ఏళ్ల అన్వేషణ!
ముత్తాత అంతిమ విశ్రాంతి స్థలాన్ని ఒక పత్రికా కథనం సాయంతో గుర్తించిన బ్రిటన్ పౌరుడు.
బంధాలు, బంధుత్వాలను మర్చిపోతున్న ఈ తరంలో తన ముత్తాత అంతిమ విశ్రాంతి స్థలాన్ని వెతుక్కుంటూ ఓ బ్రిటిష్ వ్యక్తి చేపట్టిన అన్వేషణ ఎట్టకేలకు 19 ఏళ్ల తర్వాత సఫలమయింది. 119 ఏళ్ల క్రితం తన ముత్తాత ఇక్కడే నివసించాడన్న సమాచారం అందడంతో ఆ వ్యక్తి తెలంగాణలోని సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. ఆయన ఈ సుదీర్ఘ ప్రయాణం ఎట్టకేలకు అతని ముత్తాత విశ్రాంతి స్థలం కనుగొనడంతో ముగిసింది. తన ముత్తాత సమాధిని కనుగొనడానికి ఎవరైనా ఇంతలా తపన పడతారా? అని మీకు అనిపించొచ్చు. కానీ బ్రిటన్‌కు చెందిన 68ఏళ్ల రాబిన్ డిక్సన్‌కు అలా కాదు. అది తన మూలాలకు ప్రతీక. అందుకే ఎందుకొచ్చిందో? ఎలా వచ్చిందో కానీ తన ముత్తాత అంతిమ విశ్రాంతి స్థలాన్ని కనుగోనాలను అనుకున్నాడు.
అంతే కొన్నేళ్ల క్రితం తన అన్వేషణను ప్రారంభించారు. ఎంత వెతికినా దొరకని తన ముత్తాత అంతిమ విశ్రాంతి స్థలాన్ని ఒక పత్రికా కథనం సాయంతో గుర్తించిన బ్రిటన్ పౌరుడు, ఎట్టకేలకు సికింద్రాబాద్ చేరుకున్నారు. తిరుమలగిరిలోని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ (CWG) సెమెట్రీ నంబర్ 12లో ఉన్న తన ముత్తాత లెఫ్టినెంట్ చార్లెస్ విల్సన్ సమాధిపై తెల్ల గులాబీ ఉంచి, ఆయన సేవా పతకాలతో నివాళులర్పించి రాబిన్ డిక్సన్ భావోద్వేగానికి లోనయ్యారు.
పక్కా ఆధారాలతో మొదలైన అన్వేషణ
ముత్తాత సమాధి కోసం రాబిన్ గుడ్డిగా అన్వేషణ ప్రారంభించలేదు. తన దగ్గర ఉన్న ప్రతి ఆధారాన్ని సేకరించారు.. వాటితో 68 ఏళ్ల డెంటిస్ట్ రాబిన్ డిక్సన్ భారీ కసరత్తు చేశారు. తన ముత్తాతకు సంబంధించిన ఫోటోలు, మ్యాపులు, 1906లో స్టేషన్ హాస్పిటల్ జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం, 1907లో ఊటీకి చెందిన థామస్ పార్డేతో జరిగిన తన ముత్తాత కుమార్తె మౌడ్ వివాహ ధృవీకరణ పత్రం వంటి ప్రతి కీలక పత్రాన్ని సేకరించారు. 14 నెలల క్రితం 'ది హిందూ' పత్రికలో వచ్చిన ఒక కథనం ఆధారంగా, అక్కడి విలేకరిని సంప్రదించి తన ముత్తాత సమాధి ఆచూకీని రాబిన్ కనిపెట్టారు.
Source: The Hindu
ఒక వార్త అంతా మార్చేసింది
చాలా కాలంగా ఎక్కడి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? ఎవరిని అడగాలి? అన్న సందిగ్దతలు ఉన్నా రాబిన్ తన అన్వేషణను కొనసాగిస్తూనే వచ్చారు. ఎక్కడో ఒక చోట తనకు కావాల్సిన ఆధారణం దొరుకుతుందని భావించాడు. ఆయన అనుకున్నట్లే ఒక వార్త కథనం రూపంలో అతని తన ముత్తాత సమాధిని తెలుసుకునే ఆధారం దొరికిది. రాబిన్ డిక్సన్ కుటుంబం దశాబ్దాలుగా విల్సన్ సమాధి కోసం గాలిస్తోంది. 14 నెలల క్రితం 'ది హిందూ' పత్రికలో వచ్చిన ఒక కథనం వీరి అన్వేషణను కీలక మలుపు తిప్పింది. అందులో మరో బ్రిటిష్ సైనికుడి సమాధి లభ్యమైందని రాసి ఉంది. ఆ వార్త చూసిన రాబిన్, వెంటనే పత్రికా ప్రతినిధులను సంప్రదించి తన వద్ద ఉన్న పాత దస్త్రాలను షేర్ చేసుకున్నారు. ఆ వివరాలతో శ్మశానవాటిక సిబ్బంది గతేడాది ఏప్రిల్‌లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించారు.
అసలు ఎవరా చార్లెస్
జేమ్స్ హెన్రీ డిక్సన్‌గా జన్మించిన చార్లెస్ విల్సన్, 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరారు. మద్రాసు కమాండ్ పరిధిలోని బెంగళూరు, మద్రాసులలో విధులు నిర్వర్తించారు. తన చివరి రోజుల్లో సికింద్రాబాద్‌లోని సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ కార్ప్స్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. 1906 ఆగస్టు 4న, 48 ఏళ్ల వయసులో అనారోగ్యంతో స్టేషన్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత భార్య హ్యారియెట్ నలుగురు పిల్లలతో కలిసి 1907లో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయారు.
జ్ఞాపకాల బాటలో పర్యటన
ఈ పర్యటనలో రాబిన్ దంపతులకు వారి భారతీయ మిత్రులు ప్రేమ్ కామత్, రీనా కామత్ తోడుగా నిలిచారు. వారు కేవలం సమాధిని మాత్రమే కాకుండా, లెఫ్టినెంట్ విల్సన్ కుమార్తె మౌడ్ వివాహం జరిగిన 'ఆల్ సెయింట్స్ చర్చ్'ను కూడా సందర్శించారు. అలాగే తిరుమలగిరి ఎంట్రెంచ్‌మెంట్ ఫోర్ట్, సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్, మిలిటరీ ఆసుపత్రి వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించి, నాటి కాలంలో తన ముత్తాత జీవనశైలి ఎలా ఉండేదో అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.
Source: The Hindu | Harriet Wilson with her four children
119 ఏళ్ల చరిత్ర పరిపూర్ణం
తన ముత్తాత నడిచిన బాటలోనే ప్రయాణించాలని రాబిన్ డిక్సన్ తన భార్య లిన్‌తో కలిసి భారత్ వచ్చారు. ఊటీ, బెంగళూరు సందర్శించిన అనంతరం గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం నాడు తన మిత్రులు ప్రేమ్ కామత్ దంపతులతో కలిసి సమాధిని సందర్శించారు. 119 ఏళ్ల కుటుంబ చరిత్ర నేటితో పరిపూర్ణమైందని, తన ముత్తాతకు గౌరవపూర్వక నివాళి అర్పించడం సంతోషంగా ఉందని రాబిన్ పేర్కొన్నారు. తన పూర్వీకుల జ్ఞాపకార్థం ఈ పర్యటన చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
‘‘ఎట్టకేలకు 119 ఏళ్ల నాటి కుటుంబ చరిత్ర సర్కిల్‌ను పూర్తి చేశాం. ఇండియా మా ముత్తాత ల్యూటనెంట్ జార్లెస్ విల్సన్ అందించిన సేవలను, ఆయన గడిపిన జీవితాన్ని గౌరవించే భాగ్యం మాకు దక్కింది. ఆయన తన జీవితంలో సాధించిన మెడల్స్‌ను, ఆయన ఆఖరి విశ్రాంత ప్రదేశాన్ని కలవడం మాటల్లో చెప్పలేని అనుభూతిని అందించింది. ఈ క్షణం కోసం నిర్విరామంగా పనిచేసిన టీమ్స్‌కు చాలా ధన్యవాదాలు’’ అని రాబిన్ అన్నారు. అంతేకాకుండా తన ప్రయాణం గురించి కూడా రాబిన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సైనిక గౌరవంతో నివాళి
తన భార్య లిన్‌తో కలిసి వచ్చిన రాబిన్, తన ముత్తాత సమాధిపై ఒక తెల్ల గులాబీ మొగ్గను, మధ్యలో ఎర్రటి పాప్పీ పువ్వు ఉన్న చిన్న చెక్క సిలువను ఉంచారు. వీటితో పాటు చార్లెస్ విల్సన్ ధరించిన ఒరిజినల్ సర్వీస్ మెడల్స్‌ను (పతకాలను) అక్కడ ఉంచి నివాళులర్పించారు. తన ముత్తాతకు చెందిన రెజిమెంట్ సైనికులు నిర్మించిన ఆ పాలరాతి సమాధి వద్ద రాబిన్ ఒక చిన్నపాటి స్మారక వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రాబిన్ తన కుటుంబ చరిత్రలో ఒక సర్కిల్ నేటితో పరిపూర్ణమైందని సంతోషం వ్యక్తం చేశారు.
వారందరికి నా నివాళి: రాబిన్
ఈ పర్యటన తన ముత్తాతకు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సాయుధ దళాలలో పనిచేసేందుకు బ్రిటన్ వదిలి వచ్చిన వారందరికీ తన తరపున అర్పించే నివాళి అని రాబిన్ పేర్కొన్నారు. ఈ అన్వేషణలో విజయం సాధించడం, కుటుంబ పెద్దతో తిరిగి అనుబంధాన్ని ఏర్పరుచుకోవడం ఎంతో భావోద్వేగంగా ఉందని ఆయన మిత్రులు కామత్ దంపతులు తెలిపారు. ఒక శతాబ్ద కాలం తర్వాత ఒక కుటుంబం తమ మూలాలను వెతుక్కుంటూ రావడం అందరినీ కదిలించింది.

