కమనీయం తిరుమల పుష్పయాగం- దృశ్య మాలిక
x

కమనీయం తిరుమల పుష్పయాగం- దృశ్య మాలిక

9 టన్నుల పుష్పాలతో శ్రీవారికి పుష్పయాగం


తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్ప యాగం ఘనంగా ప్రారంభమైంది.

స్వామి వారి పూజకు ఉపయోగించే పుష్పాల ఊరేగింపు గురువారం ఉదయం తిరుమలలో జరిగింది.

తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో ఈ యాగాన్ని నిర్వహిస్తారు.

శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహిస్తుంటారు.

శ్రీవారి పుష్పయాగానికి 24 గంటల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తుంటారు.

ఇవాళ మధ్యాహ్నం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతోంది.

ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తారు.

చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి, ఇతర పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు.









తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు విరాళంగా వచ్చాయి.

మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు.

Read More
Next Story