వాతావరణ హెచ్చరికలు
x

వాతావరణ హెచ్చరికలు

కొత్త సంవత్సరం అది రేషన్ షాప్ కాదు ఎటిఎం మిషన్ కాదు. మహా ప్రభువులు మన తిప్పలను కనికరించి జారీ చేసిన ఉకుమ్.

గజ గజ చలి. ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కాలం నిన్ను గతానికి వీడ్కోలు భవిష్యత్తుకు స్వాగతం చెప్తూనే ఉంటుంది . 20 25 ఒక మైలురాయిని దాటి 2026లోకి ఏకధాటిగా ప్రయాణం కొనసాగుతూనేవుంటుంది. దారి దారి అంతా ఫైర్ ఇంజన్ల లాంగ్ బెల్ మోతలు వేగంతో అత్యవసరంగా కదిలే అంబులెన్స్ల కూతలు పెడుతూ పరిగెడుతుంటాయి. కుతూహలం నిన్ను ఒక్కచోట కూర్చొనివ్వదు. సాలు లేదు మూలు లేదు కాలం కరవాలపై నీపై నీ శరీరంపై నీ ఆలోచనలపై దాడి చేస్తూనే ఉంటుంది.

కాలాలన్నీ ఎటమటమై పోతున్నాయి శీతకాలం చలి ఎక్కువే ఎండాకాలం వేడి ఎక్కువే వానాకాలం అకాల వర్షం కుండపోతులు ఎక్కువే. నా చిన్నప్పటి అడవి ఇప్పుడు మైదానం అయిపోయింది మా ఊరి గుట్ట ఇప్పుడు గుటకాయ స్వాహా అయిపోయింది . మా మానేరు లో కళ కళకళలాడే నీటి గల గల చెలిమెలు వంక ఏదైతేనేం చూస్తుండగానే ఇంకిపోయాయి.

మనిషి చుట్టూ అల్లుకున్న బంధాలు మానవ సంబంధాలు పుటుక్కున ఎప్పుడైనా తెగిపోవడానికి సిద్ధంగా లుకలుకలాడుతున్నాయి. ఒక నెనరు లేనితనం ఎల్లెడలా ఆవహించి అతలాకుతలను చేస్తున్నది. దేన్నైనా వస్తువుగా చేసి అందంగా అలంకరించి షాపింగ్ మాల్ షో కేసుల్లో పెట్టి విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు . బిరసరాలు లేవు క్యూఆర్ కోడ్ లో నీ నా వేల అన్ని బంధించబడి ఉన్నాయి. క్రెడిట్ డెబిట్ కార్డు ఒక్కటి ఉన్నా చాలు వినియోగదారుడువై తగదగ పగటి వెల్తురులో దర్శనం ఇస్తావు. టు బి ఆర్ నాట్ టు బి తప్పదు అయితే కొనుక్కో లేకుంటే ఏదో ధరకు తెగ అమ్ముకో ఇది మార్కెట్ దళారి తలారి మారువేశంలో తిరుగుతుంటాడు దేశం కనబడుతుంది. సృష్టి అంతా సంతామ సాఫల్య కేంద్రాల నుండి దృష్టి అంతా లాభలే మీదే. సహజ సౌందర్యం కోల్పోయిన ఆడ మగా పిల్ల జెల్లా గొడ్డూ మేకా బ్యూటీ పార్లర్ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దక్షిణ ఇస్తుంటారు. ముఖం మేకప్ ఆహార్యమంతా సుఖదుఃఖాలను ప్రతిబింబించదు. కన్నీళ్లు అయినా కష్టసుఖాలైన మౌనంగా నీలోనే కుంగి కృషించి గొంతెత్తకూడ సమాధి అయిపోవాలి. ధనుర్మాస ఉత్తర ద్వారక దర్శనాలు. అక్కడ మద్యం మగధీరవ్యము మాదకద్రవ్యం స్వీకరించు ఇక్కడ ఖాకీ చేతిలోని సెన్సార్ లో ఊదు నీ జేబులో డబ్బు లేకున్నా పెద్దగా ఇబ్బంది లేదు. అంతా పట్వారి అడ్డగోలు జమా బంది లెక్కలే జుర్మానా ఎంత చెల్లించాలో నీ సెల్ ఫోన్ కి వస్తుంది వస్తుంది. రొడ్డ కొట్టుడు ప్రభుత్వాలు. మద్యం అమ్మకాలే కాదు అరొక్క సహజ వనరుల అమ్మకాల పైన నాలుగు కాళ్ల రామ రాజ్యం నడుస్తుంది. అంతా ఇంతే ఎడమ చేయితో ఇచ్చి కుడి చేతితో కాజేయడం అది ఏదైనా కావచ్చు ఆఫ్ లైనో ఆన్ లైనో బహరాల్ విద్యా ,వైద్యం అన్నీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనే నేర్పబడతుంది.చికిత్సింశ్చ బడుతుంది. నర్సులు డాక్టర్లు ఆసుపత్రి అంతా కాంతివంతంగా నీ నీడ నీకు కనబడనంత వైట్ కాలర్ కలవడం తప్ప కురవని నల్లని మేఘం నిన్నూ నన్నూ కుమ్ముతుంది.

కొత్త సంవత్సరం అది రేషన్ షాప్ కాదు ఎటిఎం మిషన్ కాదు. మహా ప్రభువులు మన తిప్పలను కనికరించి ఉకుమ్ జారీ చేశారు. పొద్దుగాల ఆరు నుంచే మద్యం షాపులు తెరిచి ఉంటాయి. న్యూ ఇయర్ మనాయించుకో నెరినెరి నిన్ను నువ్వు తెల్లారి లేస్తే పచ్చి అబద్ధం గా బనాయించుకో మరి.

78 ఏళ్ల స్వేఛ్ఛా భారతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మారిందోయ్ !. జి రామ్ ఉపాధి ఉపాధి హామీ పథకం గా ఏమారిందోచ్ !! ఇక మనకెందుకు పరాకత్ గా వండుకోవచ్చు కలిగిన కాడికి తిని, కడుపులకు కాళ్లు మలుచుకొని పండుకోవచ్చు. ఇక కప్పుకునేంత పరుసుకునేంత నిండా గొంగడి లింగీ లింగడు.

ఇప్పుడు ప్రపంచమంతా వశీకరణలా ప్రపంచీకరణ ఆవరించింది. ఆదరించింది. ప్రతి దేశంలో ప్రతి ప్రభుత్వం అప్పో సప్పో చేసి ఏదో ఒక ప్రాజెక్టు చేపడుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తో అసంపూర్తో అయ్యి ప్రజల పొలాల్లోకి కన్నీళ్లు పారుతాయి. ఏలికల జేబుల్లోకి రూపాయల వరద పోటెత్తి ప్రవహిస్తుంది. షాన్ షాందార్ గా పరేషాన్ ఎయిట్ లైన్స్ రోడ్డు మీద ప్రయాణిస్తుంది.

గడ్డి గాడ్పుకుపోతేంది.ఎడ్లు ఏంట్లె పౌతేంది. ఏది ఎటు పోతే నీకేంది పట్టి..మస్తు మజా ఉడాయించు. కుట్టేటోడు కుడితే చెవ్వులు నొయ్యయ్! తాగినోడు కట్టే తాళ్ల పన్ను. బంజేరు దొడ్లో పడ్డ జంతువు పాయమాల్ కట్టక తప్పదు. చెవులు పిండి చేతికి ఇచ్చినట్టు వుందిరా భై దీని అవ్వ బతుకు!అంతా తక్లీబ్ తక్లీబ్! ఎంత హరీ నామస్మరణ ఎంత చేసినా ఏం ఫాయిదా! ఏడుకొండలు నడిచి ఎక్కితే కాళ్లు నొచ్చె గోవిందా అని అని నోరు నొచ్చె ! ఎవరికి చెప్పుకోరాదు ఈ కట్టం కిట్ట భగవానునికి కూడా రావద్దు.నిప్పుల్ల బొర్రించ్చినట్టు అరి గోస అరిగోస!,

పంటలు హార్వెస్టర్ కోస్తది తుర్పార పడుతది. తీరా జోకే కాడ పొల్లు నూకయితుంది తడి ఉంది ఏదో ఒక దాని పేరు మీద మూడు కిలోల ధాన్యం తుట్టి మాత్రం తీస్తరు. రైతుకు లాగోడి కైకిళ్లు ఖర్చులు ఫోను మిగిలేది అప్పులు తిప్పలు. బాగా సక్తు ఒత్తిడి అయితే ఉరి ఆత్మహత్యే ఏకైక దిక్కు మొక్కు. పానమంతా అవిశి పోతుంది.బతుకంతా నవిశి పోతుంది.మనసంతా కలికలి అవుతుంది.గతి లేని సంసారం చయ్యవచ్చు గానీ సుతి లేని సంసారం చెయ్య రాదు.

మై డియర్ విష్ యు హ్యాపీ కుప్పిగంతుల న్యూ ఇయర్

Read More
Next Story