బయలు దేరింది బామ్మర్ది కొండకు, చేరుకుంది ఏవో తాత్విక తీరాలకు
x

బయలు దేరింది బామ్మర్ది కొండకు, చేరుకుంది ఏవో తాత్విక తీరాలకు

ట్రెకింగ్ మొదట ఆరోగ్యం కోసం మొదలయింది. ఆ కొండల్లో కోనల్లో అడవుల్లో పోతున్నపుడు,మడుగుల్లో దూకి సేదతీరుతున్నపుడు చెవుల్లో ఏవో జీవిత సత్యాలు వినబడుతున్నట్లు ఉంటుంది


భూమన్


శేషాచలం కొండల్లో పేరున్న ప్రతిచోటకి వెళ్లాను. కొత్త వాటి అన్వేషణ కోసం పరుగులు తీశాను. మళ్లీ మళ్లీ చూడాలనిపించి విచిత్రాల చుట్టూ తిరగాను. అయితే, నా పాదయాత్రల్లో భిన్నమైంది బామ్మర్ది బండ యాత్ర. కొంతమంది మిత్రులతో కలసి 2022 నవంబర్ బామ్మర్ది బండకు వెళ్లాను. అడవిలో అదారి పట్టినప్పటినుంచి ఈ యాత్ర తాత్వితక చింతనలోకి లాక్కెళ్లింది. దాన్నిపుడు మీతో షేర్ చేసుకుంటున్నాను.


ఒక మారు మొదలైతే ఈ కాలినడకల అన్వేషణ ఆగేట్టుగా లేదు. ఇక ఆగాలి అన్న స్పృహ ఉండి సరిపోయింది , లేదంటే ప్రపంచపు నలుమూలలకు లాక్కు పోయేట్టున్నాయి ఈ రెండు పాదాలు.
ట్రెక్కింగ్ ఒక అలవాటుగా మారిన తర్వాత ఆరోగ్యం గురించి కాకుండా ఇంకేదో అన్వేషణకు దారి తీసేట్టుగా ఉంది. అడవులు, నదులు, జలపాతాలు, ఎడారులు.. ఏవేవో రహస్యాలు విప్పి చెబుతున్నట్లు ఉన్నాయి. చెవొగ్గితే చాలు జీవితపు తాత్విక చింతన లేవో ప్రతి ధ్వనింపచేసేట్లు ఉన్నాయి.



ఇన్నేళ్ల నా ట్రెక్కింగ్ లా అనుభవాలు చాలా చాలా రహస్యాలను విప్పి చెబుతున్నాయి.




ట్రెక్కింగ్ అంటేనే గవేషణ కొండలు, బండలు, అడవులు, నదీనదాలు, ఎప్డరిలో మంచి పర్వతాలు ప్రకృతి విశ్వరూపంలో మన కాలినడకల సవ్వడిలా సాహస విన్యాసమే ట్రిక్కింగ్. ఆ సాహసమే ఎన్నెన్నో జీవిత రహస్యాలను విప్పి చెబుతుంది. నువ్వేమిటో కనుగొనమని ప్రశ్నిస్తుంది. ఆ తాత్విక చింతనా యావ… మనం సంచరించే సమాజాన్ని సంస్కరించమని.. ఆరోగ్యప్రదంగా ఉంచమని.. చెబుతుంది.












అడవుల్లోని చెట్లు, చేమ, పక్షులు, జంతువులు, క్రిమి కీటకాదులు.. వాటి పెరుగుదల, ముగింపు ఒక పాఠం.. ప్రత్యక్ష ప్రసారం. అక్కడ లేని కులం, మతం, ఆర్థిక వ్యత్యాసాలు, వివక్ష.. గమనించమని చెబుతాయి. అక్కడి ప్రకృతి సూత్రాలు చిన చేపను.. పెద చేప మింగటంలోని ఆంతర్యాలు మానవ సమాజానికి పోల్చుకుని చూసేలా చేస్తాయి ట్రిక్కింగ్లు.



మన పూర్వీకులు అందరూ ఈ ట్రిక్కింగ్ల మూలానే తాత్వికచింతన అందజేశారు. బుద్ధుడు కాలినడకన తిరిగి లక్షలాది మందిని ప్రభావితం చేసినాడు. మరెందరో మహానుభావులు హిమాలయాల వరకు నడిచి ఎన్నెన్నో తాత్విక చింతనలందజేస్తున్నారు. అడవి మన అస్తిత్వం. మనమే అడవి. అందుకే అన్ని రకాల పోరాటాలకు అడవే కేంద్రమయింది.




ఈ ఆలోచనలు నా మనుసులో సుళ్లు తిరగడం మొదలయింది బామ్మర్ది బండకు వెళ్లుతన్నపుడు.

ఈ బండ తిరుపతి కి 57 కి మీ దూరాన ఉంటుంది.కోడూరు మార్గములో కుక్కలదొడ్డీ నుండి సిద్దలేరు, కంగుమడుగు ,మూడేల్లకురువ ల మీదుగ .పక్కకుపోకుండా నేరుగాపోతే యుద్దగళము చేరుకోగలము. అపైన వచ్చేది బామ్మర్ది బండ.





ఈ పేరెందుకు వచ్చిందని మా యానాది మార్గదర్శకుడు మణి ని అడిగాను. అన్నింటికి ఆయన మాకు మార్గదర్శకుడు. ఇక్కడి అణువణువు గురించి తెలియడమే కాదు, ఈ ప్రదేశాలకు ఆ పేర్లు ఎందుకువచ్చాయో ఆయన దగ్గిర లేక్కలేనన్ని కథలున్నాయి. ఒక విధంగా మణి స్థానికపురాణాల పుట్ట.
ఆయన చెప్పిన కథ.
అప్పుడెప్పుడో ఏళ్ళ క్రితం ఇక్కడ ఒక గిరిజన గూడెం ఉండేది. దానికో పెద్ద కుటుంబం ఉండేదేమో. ఒక సారి ఎలుగుబంట్లు దాడి చేసి గూడెం పెద్ద బామ్మర్దిని చంపేశాయట. అంతే, ఆ నేలకు బామ్మర్ది బండలని పిలుపు వచ్చిందట. ఇపుడయితే, అక్కడ గూడేలేవీ లేవు.


ఇదే బామ్మర్ది బండ ట్రెక్ టీమ్


అట్టాంటి దట్టమైన అడవి మధ్యలోకి వంద మైళ్ళ దూరం ప్రయాణం చేసి మనిషేత్తు బోద, చీక్కంప, వెదురు… దాటుకుంటూ మొదటిసారిగా ఈ బామ్మర్ది బండలకు చేరుకున్నాము.



Read More
Next Story