
ఉస్మానియా, నీకు సలాం! (కవిత)
వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ని ఉద్యమాలకు పుట్టినిల్లో...
-వంగల సంతోష్
వందేళ్ల చరిత్ర కలిగిన నీవు
ఎందరేందరికో ప్రాణం పోసావో
ఎందరేందరికో అక్షర దివిటివై నిలిచావో
ఎందరేందరికో దిక్సూచివై నడిపావో
ఎందరెందరికో పోరు మార్గాలు నేర్పావో
అవన్ని నీవే కదా
నా ప్రియమైనా ఉస్మానియా
నీకివే నా సలాములు..!!
నీవు తెలంగాణ గుండె చప్పుడువు
పీడిత ప్రజల ప్రాణ వాయువువు
విద్యార్థుల పోరు సమర నాదానివి
కోటానుకోట్ల శోషిత జనసముహానికి
నీవు ప్రతిబింబానికి కదా
నా ప్రియమైన ఉస్మానియా
నీకివే నా సలాములు..!!
ఎన్నెన్ని వేదికలకు పురుడోసావో
ఎన్నెన్ని సంఘాలను నెలకోల్పావో
ఎన్నెన్ని ఉద్యమబావుటాలను ఎగిరేసావో
ఎన్నెన్ని రాజకీయ సంఘర్షణల ఘర్షణల
నడుమనే నీవు నిటారుగా నిలబడ్డావు కదా
నా ప్రియమైన ఉస్మానియా
నీకివే నా సలాములు..!!
ఓ నా ఉస్మానియా
నీకివి కొత్తనా
నీవు చూడనిది ఏది
ఎన్ని ముళ్ల కంచల ఆంక్షలు
ఎన్ని నిర్బంధాలు
ఎన్ని అరెస్టులు
ఎన్ని అణిచివేతలు
ఎన్ని నిత్య నిర్బంధాలు
అన్ని వెరిసేలా ఛేదించిన
నిప్పుల కొలిమివి
నీవే కదా
నా ప్రియమైనా ఉస్మానియా
నీవు కోటానుకోట్ల జనసమూహపు
ప్రతి బింబానివి
ఏకునాదం లాగా పెకిలించే
నీ గొంతుకకు
జడిసినా కాలం గతం కాదు
అది ఓ చరిత్ర
మళ్లీ నీవు ఆ చరిత్రను
పునారావృతం చెయ్యక తప్పదు
నా ప్రియమైన ఉస్మానియా
నీకివే నా సలాములు..!!
Next Story