‘ఆయన భావం బాణంలా సూటిగా గుండెల్లో దిగుతుంది’
x

‘ఆయన భావం బాణంలా సూటిగా గుండెల్లో దిగుతుంది’

'నూతన శతాబ్ది వైతాళికుడు' నల్లాల లక్ష్మి రాజం కు ప్రముఖ రచయిత బిఎస్ రాములు నివాళి


జగిత్యాల , కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం మార్చి 25 న అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వీరి మరణం తెలుగు సాహిత్య రంగానికి తీరని లోటు . కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి రాజం విశిష్ట స్థానం సంపాదించారు. ఆయన రచించిన “తిరుగు ప్రయాణం” కథల సంపుటి విశేష ఆదరణ పొందడంతో పాటు విశాల సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. నూతన శతాబ్ది యువ వైతాళికుడు లక్ష్మి రాజం అని తిరుగు బాటు కథల సంపుటికి రాసిన నా ముందుమాటలకు నిదర్శనంగా ఎదిగిన వాడు.( అదే సమయంలో ఎదిగిన మరో నూతన వైతాళికుడు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్!)

లక్ష్మి రాజం “జీబీ రాజ్ జిందాబాద్” నాటక ప్రదర్శన ద్వారా మద్యపాన వ్యతిరేక చైతన్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. ఇందులో తాను రాసిన పాటలతో ఒక కళారూపం ఇచ్చారు. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై ఆయన నిరంతరం పోరాడారు.“నీ బాకీ తప్పక తీరుస్తాను…” అంటూ సామాజిక వ్యంగ్యంతో కూడిన ఆయన పాట ప్రజల్లో విశేష ప్రాచుర్యం పొందింది.
జగిత్యాల సమీపంలోని తక్కల్లపల్లి గ్రామంలో 5 అక్టోబర్ 1970 న జన్మించిన లక్ష్మి రాజం విప్లవ భావజాలానికి సానుభూతి కలిగి జీవించారు. అంబేద్కర్ సంఘాలు పెట్టి పెత్తందారులను ఎదిరించారు. పెత్తందార్లు నక్సలైట్ అని ముద్ర వేసి కష్టాల పాలు చేయడంతో పోలీసు ఉద్యోగంలో చేరి పోయాడు.
ఇలా పరిస్థితుల కారణంగా పోలీస్ శాఖలో చేరి, కరీంనగర్ జిల్లాలో పోలీస్ విభాగం తరఫున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కవి సమ్మేళనాల్లో పాల్గొని ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు.
1992 నుంచి తనకు పరిచయమై, కుటుంబ సభ్యుడిలా మారిన లక్ష్మి రాజం మరణం తీవ్రంగా కలచి వేసింది. వారి కిడ్నీలనా దానం చేసి వారి సహచరి రాధ తన ధైర్యాన్ని చైతన్యాన్ని ప్రదర్శించింది.
దళిత సాహిత్యంలో నల్లాల లక్ష్మి రాజం ఒక మణి పూస. దరకమే ఐక్య వేదికలో ఆవిర్భవించిన వజ్ర సంకల్పుడు నల్లాల లక్ష్మి రాజం. కథ, నవల, నాటకం, ప్రయోక్త , నటుడుగా కరీనగర్ జిల్లా వ్యాప్త గా ప్రజలలఅభిమానం చూరగొన్నారు. 1998 ఆగస్టులో జరిగిన నా యాభయి జన్మదిన స్వర్ణోత్సవం లో రాష్ట్ర వ్యాపితంగా రచయితలు పాల్గొనడంతో పాటు స్థానికంగా ఎందరో రచయితలు తమకుతాము వెల్లడి కావడానికి ఒక వాహిక అయింది.
సాహిత్యంలో లక్ష్మి రాజానిది ప్రత్యేక ముద్ర.
1990 నుండి బీసీ ఎస్సీ ఎస్టీ రచయితలను, కళాకారులను , మేధావులను ఒక వేదికపైకి తీసుకు రావడానికి చేసిన కృషిలో వేలాది మంది ఎదిగి వచ్చారు. అంతదాకా వర్గ దృక్పథం తప్ప జీవితంలో అనేక రూపాల్లో కొనసాగుతున్న కుల వివక్ష , అసమానతలు , అణిచి వేతలను పెట్టించుకునే చైతన్యం కోల్పోయిన దశలో దరకమే ఆవిర్భవించింది. లక్షలాది ప్రజలకు ధైర్యాన్ని అందించింది. బుద్ధుడు నుండి మహాత్మా జ్యోతిరావు ఫూలే , డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, కాన్సీరాం దాకా గల చరిత్ర వారసత్వాన్ని స్వీకరించింది.
వేలాదిగా ఎదిగిన దరకమే ఐక్య వేదిక బిడ్డలు
1993 ఫిబ్రవరిలో రెండు రోజులపాటు జరిగిన తొలి రాష్ట్ర మహాసభలు రాష్ట్ర సాహిత్య సామాజిక చరిత్రను మలుపు చివ్వాయి. సమస్థ వర్గ కు లింగ జాతి మత ప్రాంత దేశ భాష వివక్షలను అసమానతలను తొలిగించే కృషి ని తన కర్తవ్యంగా ప్రటించుకుంది. అలా ఎదిగిన వందలాది రచయితల్లో నల్లాల లక్ష్మి రాజం , కల్లపెల్లి రామ లక్ష్మణ్ , కె వెంకట రమణ, పులి గోవర్దన్, రమేశ్, నేరెళ్ల శ్రీనిస్ గౌడ్, జగిత్యాల కావడం నాకు మరింత సన్నిహితులయ్యారు. క్రమంగా కుటుంబ సభ్యులుగా కలిసి పోయారు.


నల్లాల లక్ష్మి రాజం భావాల్లో ఒక స్ఫష్టత వుంది. భావ వ్యక్తీకరణలో బాణం సూటిగా గుండెల్లో దిగుతుంది. జీవితం నేర్పిన అనుభవాలకు అంబేద్కరిజం, దరకమే ఐక్యవేదిక ఆసరా నిచ్చాయి. ఆశు కవితలా అనేకం రాస్తూ వినిపిస్తూ ఎదుగుతూ వచ్చారు. తన రచనల ద్వారా సాహిత్య రంగంలో గుర్తింపు పొందారు.. కాళీ పట్నం రామారావు ‘కథా నిలయం’ లో ఈ కథలు వెబ్ సైట్ లో చేర్చారు. ..
1) అంతర్మథనం, కథ, పత్రిక: ప్రజాతంత్ర - వారంప్రచురణ తేది:2005-07-24
2) తిరుగు ప్రయాణం, పత్రిక: సుప్రభాతం - వారంప్రచురణ తేది: 2002-06-01
3) మావూరి ముచ్చట్లు, కథ, పత్రిక: నేటినిజం - వారంప్రచురణ తేది: 2002-05-31
4) యమపురి...కథ, పత్రిక: సుప్రభాతం - వారంప్రచురణ తేది:, 2001-10-27
5) రాజవ్వ కొడుకు, కథ, పత్రిక, నేటినిజం . ప్రచురణ తేది: 2002-03-15
2003 లో వెలు వడిన తిరుగుబాటు కథల సంపుటిలో ఈ కథలతోపాటు దొమ్మరి గంగడు, పునరావృతం, భలే బమ్మర్ది, యమపురిలో ఒకరోజు, పడగ నీడలో పావురాలు, కథలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత కూడా పలు కథలు రాసారు. తిరుగుబాటు కథల సంపుటికి
విశాల సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. బి ఎస్ రాములు జన్మదిన సభల్లో నల్లాల లక్ష్మి రాజం, జనగామ శంకర్ లు రాసిన జన్మదిన పాటలు
ఒక ప్రత్యేక ఆకర్శణ గా నిలిచేవి. నా గురించి కాకుండా మా శ్యామల జీవితాన్ని నవలగా రాస్తున్నానని అపుడపుడు కొంత వినిపించేవాడు. తండ్రికి భయ పడే కొడుకులా నాతో కన్నా శ్యామలతోనే అమ్మా అమ్మా అంటూ ఫోన్ చేసి మాట్లాడి నాకు చెప్పుమనే వాడు. లక్ష్మి రాజం రాసిన ‘జిబీ రాజ్ జిందాబాద్’ నాటిక ఒక ప్రత్యేక కళా రూపం. అది నాటకమా నిజ జీవితమా అని ప్రేక్షకులు ఆశ్చర్య పోతారు. అందులో అనేక పాటలు టాయిలెట్. అవన్నీ కుల వివక్షను, వ్యసనాలను వివరించినా చైతన్య పరిచేవే.
అలా జీబీ రాజ్ జిందాబాద్ నాటక ప్రదర్శనతో మద్య పాన వ్యతిరేక చైతన్యం కలిగించారు. కుల వివక్ష అంటరాని తనం పై నిరంతరం పోరాటం చేసారు. పోలీస్ ఉద్యోగంలో చేరి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ తరఫున అనేక కళా ప్రదర్శనలు, ఇవ్వడం, కవి సమ్మేళనాల్లో పాల్గొని అధికారులతో పాటు ప్రజల ప్రశంసలు అందుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందారు. 2003 లో దళిత సాహిత్య అకాడమీ చే అంబేద్కర్ ఫెలో షిప్ పొందారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు అనేక ప్రశంసలు ప్రోత్సాహాలు అందించారు. తిరుగుబాటు కథల సంుపుటికి రచయిత ముందుమాటతో పాటు, జైశెట్టి రమణయ్య, కాలువ మల్లయ్య, వేముల పెరుమాళ్లు ఆశీస్సులందించారు. వీరి రచనలు చాలా వున్నాయి. అవి పుస్తక రూపంలో వెలువడినపుడు వీరి విస్తార కృషి లోకానికి అందుతుంది. సాహిత్యంలో గొప్ప చేర్పు అవుతుంది.
Read More
Next Story