సినీ రాజధానిగా వికసిస్తున్న విశాఖ
x

సినీ రాజధానిగా వికసిస్తున్న విశాఖ

ఒకప్పుడు పాటకో ఫైట్ కో పరిమితమైన విశాఖ నేడు పూర్తిస్థాయి చిత్రాన్ని నిర్మించేందుకు అనువుగా మారింది. నటతారాగణాన్ని ఆకట్టుకుంటోంది..


(టి నానాజీ, విశాఖపట్నం)

మెున్నటి కమల్ హాసన్ మరో చరిత్ర ...మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నితిన్ హైపర్.. నేటి రవితేజ ఈగల్ చిత్రం వరకు విశాఖలో నిర్మితమైన ఎన్నో చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. విశాఖ సాగర తీరం... భీమిలి ఎర్రమట్టి దిబ్బలు.. అరకు కొండకోనలు చూసి ముచ్చట పడి వచ్చే సినీ జీవులు చిత్ర ముహర్తం షాట్ నుంచి శుభం కార్డు వరకు విశాఖలోనే షూటింగులు పూర్తి చేసుకుంటున్నారు. ఇక్కడి సహజ అందాలకు సెట్ లు తోడు చేసి, సాంకేతిక అంశాలను స్టూడియెాలో మిక్స్ చేసి పూర్తి స్థాయిలో చిత్ర నిర్మాణాలను విశాఖలోనే పూర్తికావిస్తున్నారు. ప్రస్తుతం ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న తెలుగు సినీ పరిశ్రమ ప్రశాంత విశాఖలో వేళ్ళూనుకుంటుందా అంటే..అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు..

"చిత్ర పరిశ్రమను ఆహ్వానిస్తున్న విశాఖ సహజ అందాలు"

ఒకనాడు చెన్న పట్నం.. తర్వాత భాగ్యనగరం.. మరి ఇప్పడు విశాఖమహానగరం .. తెలుగు సినీ పరిశ్రమ విశాఖలో వేళ్ళూనుకుంటుంది. గతంలో పాటల షూటింగ్ లకే.. పరిమితమైన విశాఖ.. నేడు పరిపూర్ణ చిత్ర నిర్మాణానికి వేదికయ్యింది. విశాఖ అందాలు సినీమావాళ్ళను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. నాడు చిరంజీవి బంగారు కోడిపెట్ట అంటూ.. స్టెప్పులేసిన పోర్టు నుంచి పిష్పింగ్ హార్బర్ తో పాటు సాయం కాలం... సాగరం తీరం.. అంటూ.. విశాఖ సాగర తీర అందాలను వర్ణిస్తూ చిందులేసిన ఎన్నో పాటలు ఇక్కడ చిత్రీకరించినవే.. ఇక అరకు అందాల గురించి అయితే చెప్పనవసరమే లేదు. అలనాడే విశాఖ గొప్పదనాన్ని సినీ ప్రముఖలు గుర్తించినప్పటికీ.. పాటలు, ఫైట్ లకే పరిమితమంచేశారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ సంకట స్థితిలో వున్న కారణంగా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి విదేశాల్లోనూ.. భారీ సెట్ ల నడుమ.. షూటింగ్ చేసే కంటే.. సహజ సిద్ద అందాలకు నెలవైన విశాఖలో షూటింగ్ చేయటమే మేలని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

"విశాఖకు తరలివస్తున్న చిత్ర పరిశ్రమ"

చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి విశాఖ తరలి వస్తోంది. ఒకటొకటిగా స్టూడియోలు రూపుదిద్దుకుంటున్నాయి. సినీ దిగ్గజం రామానాయుడు ఇప్పటికే విశాఖ సినీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని అన్ని హంగులతో.. స్టూడియెాని ఏర్పాటు చేయగా.. ఇటీవల రామోజీ ఫిలిం సిటీ కూడా విశాఖలో స్టూడియోను ఏర్పాటు చేసింది. ఇక రాజేంద్రప్రసాద్, జగతిబాబు, మురళీ మెాహన్ లు విశాఖలో స్టూడియెాలు ఏర్పాటు చేసేందుకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గతంలో మాదిరిగా విశాఖలో షూటింగ్ లే కాకుండా గ్రాఫిక్ ఎడిటింగ్, మిక్సింగ్ పనులు సాగించేందుకు కూడా పలు స్టూడియోలు ఏర్పాటయ్యాయి.

"అన్ని రంగాల చూపు.... విశాఖ వైపు...."

ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. విశాఖ పారిశ్రామిక రాజధానే కాదు. అన్ని రంగాల్లోనూ శరవేగంగా దూసుకుపోతుంది.ఐటి, ఫార్మా రంగాలలో ఎంతో పురోగతి సాధించిన విశాఖ పారిశ్రామికంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందింది. సెజ్ లను నెలకొల్పటంలోనూ ముందుండటంతో.. మౌలిక సదుపాయల కల్పన కూడా మెరుగు పడింది. దీంతో అన్ని రంగాల ప్రముఖులు విశాఖవైపే చూస్తున్నారు. విశాఖలో తమ సంస్థ కార్యకలాపాలను నిర్వహించాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. ఈ కోవలోనే.. తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు విశాఖ వైపు చూస్తోంది. తెలుగు భాషే కాకుండా తెలుగుతో పాటు తమిళ, మళయాళీ, బెంగాలీ సినిమా షూటింగ్ లు కూడా జోరుగా సాగుతున్నాయి.

"సహజ సిద్ధ అందాలకు నెలవు విశాఖ"

విశాఖ సహజసిద్ధ అందాలకు నెలవు... ఓవైపు సాగర్ తీరం... మరోవైపు కొండలపై పచ్చదనం పరుచుకున్న సహజ సిద్ధ అందాలు విశాఖ సొంతం. విశాఖలోని గంగవరం పోర్ట్, యారాడ బీచ్, ఆర్కెబీచ్, ఉడాపార్కు, తెన్నేటి పార్కు, కైలాసగిరి, భీమిలి బీచ్, రుషికొం బీచ్, ఇలా నగరంలోని పర్యాటక ప్రాంతాలేకాకుండా.. ఆంధ్రా ఊటీగా ప్రసిద్దికెక్కిన అందాల అరకులోని బొర్రా గుహలు, పచ్చ పూల సొగబులు, కొండ కోనలు, సెలయేరులు, వాటర్ ఫాల్స్ చిత్ర షూటింగ్ లకు సెట్టింగ్ లా మారుతున్నాయి. సహజ సిద్ద అందాలు సినీ కెమెరాలను ఆకర్షిస్తుండగా.. ఖర్చుకూడా పెద్దగా లేకపోవటంతో .. ఇక్కడ షూటింగ్ లకే నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. భవిష్యత్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు విశాఖ కేరాఫ్ అడ్రస్ గా మారనుందని సినీ రంగ ప్రముఖులే చెబుతున్నారు.

"సినీ పరిశ్రమకు విశాఖ అనువైన ప్రాంతం"

సినీ పరిశ్రమకు విశాఖ అనువైన ప్రాంతమని పలు సందర్భాల్లో సినీ ప్రముఖులు వెల్లడించారు. గతంలో మా అధ్యక్షునిగా చేసిన ప్రముఖ నటుడు మురళీమోహన్ చిత్ర పరిశ్రమను విశాఖ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పగా... తాజాగా విశాఖలో షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా హైపర్ మూవీ హీరో నితిన్ చిత్ర నిర్మాణాలకు విశాఖ అనువైన ప్రాంతమని, అందుకే తన చిత్రాలు ఎక్కువగా విశాఖలోనే షూటింగ్ నిర్వహిస్తామంటున్నారు.

Read More
Next Story