నువ్వు తిరిగొస్తావ్, మళ్లీ చిందులేస్తావ్, లిఖేష్ (మరొక ఆసుపత్రి గీతం)
x

నువ్వు తిరిగొస్తావ్, మళ్లీ చిందులేస్తావ్, లిఖేష్ (మరొక ఆసుపత్రి గీతం)

ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సైట్ ఎందుకు సరిగా పనిచేయడం లేదు? వాకబు చేస్తే ఎన్నికల కోడ్ వల్ల సరిగా సైట్ పనిచేయడం లేదని తెలిసింది..అదెలా ఎన్నికల కోడ్ ఉంటే జబ్బులు రావా


(రాయలసీమ రవికుమార్)


కర్నూలు: ఈ ఫోటోల్లో కనిపిస్తున్న చిన్నోడి పేరు లిఖేష్. వయసు 5సంవత్సరాలు.

లిఖేష్ ఐదు నెలల పసికందుగా ఉన్నపుడే తండ్రి మరణించాడు.
తల్లి కూలీ నాలీ చేస్తూ కొడుకును చూసుకుని బతుకుతోంది..

ఆ వయసులో అందరు చిన్నారుల్లాగే ఆడుతూ పాడుతూ సాగుతున్న
లిఖేష్ కు ఎవ్వరూ ఊహించని పెద్ద ఆపద వచ్చింది. ఏదో జబ్బు ఇలా ఆటల్లోంచి అతడ్ని ఆసుపత్రికీడ్చింది

కర్నూలు అమీలియో హాస్పిటల్స్, కర్నూలు కిమ్స్ హాస్పటల్ లకు తీసుకువచ్చారు.

మిత్రులు మదాసి కురువ సుంకన్న,చంద్రశేఖర్ కర్నూలులో ఉన్ననాకు విషయం తెలిపారు. చిన్నారివిరాలు అందించి వీలైతే కిమ్స్ ఆసుపత్రి వెళ్లి లిఖేష్ నొకసారి చూసి రావాలని 20-03-2024న పురమాయించారు.
ఎందుకంటే లిఖేష్ తల్లికి,అవ్వకు చదువురాదు, ఎంజరిగిందో, ఎంజరుగుతుందో తెలియదు. వాళ్లకి ఆసుపత్రివాళ్లకి కీకారరణ్యం. దానికి పేదరికం తోడైతే ఎలా ఉంటుంది. కీకారణ్యంలో అంధకారం అలుముకుంటుంది.
నేను, మా రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు నా తమ్ముడు అశోక్ హాస్పిటల్ కు వెళ్లి లిఖేష్ ను చూశాను.

నొప్పితో విలవిల్లాడుతున్నాడు లిఖేష్. ఊతిత్తులకు పైప్ వేసీ అందులో నుండి చేరిన నీరు చెడు పఫ్ ను తీసివేస్తున్నారు. ఒళ్లంతా వివిధ రకాల పైపులు వేసారు. చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి డాక్టర్లను అడిగి పరిస్థితిని తెలుసుకుంటే..
లిఖేష్ కు కడుపులో ఇన్ఫెక్షన్ వలన ఊపిరితిత్తులలో నీరు చేరింది,అది సమయం గడుస్తున్న కొద్దీ గుండెలకు చేరుతుందని దానికి ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ కర్నూలులో అందుబాటులో లేదని చెప్పారు.
మరెలా?
పాండిచ్చేరిలోని JIPMER (జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కు తీసుకువెళ్తే వెళ్లాలన్నార. తీరా చూస్తే చిన్నారి పరిస్థితి అయితే బాగోలేదని తెలిపారు. ఎక్కడ కర్నూలు పల్లెటూరు, ఎక్కడ పాండిచ్చేరి. ఈ సలహా కూడా అర్థంకాని అమాయకులు అవ్వ, అమ్మ.
వెంటనే పిల్లాడిని తీసుకువెళ్తాము పంపించమని లిఖేష్ తల్లి తరపున డాక్టర్లను కోరాము.

ఆరోగ్య శ్రీ ట్రస్టు వెబ్ సైట్ ఓపెన్ కాలేదు

అయితే పిల్లాడిని ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నామని దాని అప్రూవల్ రాగానే పంపిచేస్తామని తెలిపారు. మేము వెంటనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ శాఖను సంప్రదించాము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సైట్ ఓపెన్ కావడంలేదని ఓపెన్ అయితే అదే రోజు రాత్రి లేదా రేపు అనగా 21న ఉదయాన్నే పాండిచ్చేరి పంపించేస్తామని తెలిపారు సరేనని మేము హాస్పిటల్ నుండి వచ్చేసిన చిన్నోడు లిఖేష్ జాలిగా వాడు మా వైపు చూసిన చూపులు నన్ను వెంటాడుతూనేవున్నాయి వాడికి ఏమీ కాకూడదనుకుంటునే నిద్రపోయాను నిన్న.





ఈ (శుక్రవారం) ఉదయాన్నే హాస్పిటల్ కు వెళ్లాము, లిఖేష్ కు ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చుంటుంది పాండిచ్చేరి పంపించివద్దామనే నమ్మకంతో.. తీరా వెళ్తే లిఖేష్ నిన్నటికన్నా ఎక్కువ ఇబ్బంది పడుతూ నొప్పితో ఏడుస్తూనేవున్నాడు డాక్టర్లను సంప్రదిస్తే ఆరోగ్యశ్రీ రాలేదని తెలిపారు.


మల్లా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ శాఖను సంప్రదించాము. సైట్ ఓపెన్ కావడంలేదు అన్నారు. బాబును పంపిద్దామన్నా బిల్ ఎక్కువవుంది. సగం అమౌంట్ మాత్రమే కట్టించుకుని పంపిద్దామన్నా వాళ్లు కట్టే పరిస్థితి లేదు. లిఖేష్ పరిస్థితి బాగాలేదు,పాండిచ్చేరి పంపిద్దామంటే ఆరోగ్యశ్రీ రెండు రోజులుగా సైట్ సరిగా పనిచేయడంలేదు, డబ్బులు కట్టే పరిస్థితి ఆ తల్లికి లేదు.

ఎందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సైట్ సరిగా పనిచేయడం లేదు. వాకబు చేస్తే ఎన్నికల కోడ్ వల్ల సరిగా సైట్ పనిచేయడం లేదని తెలిసింది..
అదేంటీ మొన్నటివరకు బాగానే పనిచేసిన సైట్ ఎన్నికల కోడ్ రాగానే పనిచేయకపోవడం ఏంటీ..??
పేదోడికి అభయహస్తమే కదా ఆరోగ్యశ్రీ..
మరీ సైట్ సరిగా పనిచేయకపోతే..
ఎంతమంది రోగుల ఆర్తనాదాలు..
ఎంతమంది అభాగ్యుల దీనావస్థలు..
ఎన్నికల కోడ్ వస్తే సైట్ ఆగిపోతే ఎలా..??
రాజకీయాలకోసం పేదల జీవితాలతో ఆడుకోవడం అన్యాయం..
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సైట్ ఎప్పటిలాగే పనిచేయాలి లేకపోతే పేదింటి దీపాలు ఆరిపోతాయి..
ఇదే విషయం అధికారులు దృష్టికి కూడా తీసుకుపోతాము,ఆరోగ్యశ్రీ ట్రస్ట్ విధులు సక్రమంగా అమలు చేయాలని కోరతాము.




ఆరోగ్యశ్రీ శాఖ ఉద్యోగి ఒకరు మా విన్నపాన్ని స్వీకరించి ప్రయత్నిస్తూనే ఉండటంవల్ల సైట్ ఓపెన్ అవ్వడం లిఖేష్ కేస్ అప్రూవల్ రావడంతో లిఖేష్ ను అంబులెన్స్ లో పాండిచ్చేరి పంపించి ఇప్పుడే ఇంటికి చేరాము నేను మరియు అశోక్,మదాసి కురువ శివలింగం అన్న.

లిఖేష్ మనందరికీ దీవెనలు,ఆశీస్సులతో ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకుంటూ..

మళ్లీ కలుద్దాం లిఖేష్ సంపూర్ణ ఆరోగ్యవంతుడివై తిరిగి రా చిన్నోడా..

నీకోసం ఎదురుచూస్తూనేవుంటాం...


(*రాయలసీమ రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు.రాయలసీమ విద్యార్థి పోరాట సమితి)


Read More
Next Story