
బీసీ వాద కవితలకు ఆహ్వానం
తెలుగు రాష్ట్రాల్లోని బీసీ కవులు రాస్తున్న కవిత్వాన్ని సమీకరించేందుకు సాగుతున్న తొలి ప్రయత్నం
వెనకబడిన కులాల(బీసీ) అస్తిత్వ, సాంస్కృతిక, రాజకీయవాదాన్ని బలపరుస్తూ వచ్చిన రచనలను సమీకరించే ప్రయత్నం మొదలయింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన బీసీ సాహిత్య వేదిక ఈ ప్రయత్నం మొదలుపెట్టింది. సామాజిక న్యాయం కోసం వెనకబడిన వర్గాలు రెండు తెలుగు రాష్ట్రాలలలో సాగిస్తున్న పోరాటాల నేపథ్యంలో మొదటి సారిగా బీసీల రచలను సమీకరించే ప్రయత్నం మొదలయింది. ఇందులో భాగంగా బీసి కవుల నుండి వచన కవిత సంకలనం తీసుకురావాలనుకుంటున్నట్లు బీసీ సాహిత్య వేదిక రచయిత డా.సంగిశెట్టి శ్రీనివాస్, వనపట్ల సుబయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీసీకవులు తన కవితలను పంపాలని వారు కోరారు.
సాహిత్య చరిత్రను రికార్డు చేసేవాళ్లు, వీరేశలింగ పంతులు దగ్గిర నుంచి ఆరుద్ర దాకా, బీసీ కులాలనుంచి వచ్చిన సాహిత్యానికి పెద్ద ప్రాముఖ్యమీయ లేదని, ప్రధాన సాహిత్య స్రవంతిలో ఈ వర్గాల కవులకు, కళాకారులకు చోటీయలేదని ఈ సందర్బంగా మాట్లాడుతూ డా. శ్రీనివాస్ తెలిపారు.
“ఉదాహరణకు బాలా పాపాంబ ని తీసుకుందాం. ఆమె తొలియక్షగాన కవయిత్రి. శైవ మతానికి చెందిన అక్కమహాదేవి జీవితచరిత్రను యక్షగానంగా మలిచిన కవియిత్రి పాపాంబ. ఆమెకు ప్రధాన స్రవంతి సాహిత్య చరిత్రలో చోటేలేదు. రెండు తెలుగు రాష్ట్రాలో ఇలా మరుగన పడిన వారెందరో ఉన్నారు. వాళ్లని వెలుగులోకి తీసుకువచ్చిన బీసీ చైతన్య వ్యాప్తి కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతానికి బీసీ వాద కవులు సృష్టించిన కవిత్వాన్నిసేకరించాలని నిర్ణయించాం,” ఆయన చెప్పారు.
బీసి వాద కవితలను ఏప్రిల్ 15 .2025 లోపట bcsahityavedika2025@gmail.com కు లేదా వాట్సప్ నెంబర్ 9492765358, పంపించవచ్చు. బీసీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఎప్రిల్ నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి బీసీ సాహిత్య సదస్సులో సంకలనంగా ప్రచురించి ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు.