వామ్మో, ఇదేం బెంగళూర్రా నాయనా!  రద్దీ నగరాల్లో ఏడోదట!!
x
బెంగళూరు సిటీ ట్రాఫిక్ ఫైల్ ఫోటో

వామ్మో, ఇదేం బెంగళూర్రా నాయనా! రద్దీ నగరాల్లో ఏడోదట!!

మామూలుగా హైదరాాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువని మనవాళ్లు ఆపసోపాలు పడుతుంటారు. మరి దీన్నేమనాలి.. హైటెక్, టెక్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు ట్రాఫిక్ తో బెంబేలెత్తుతోందట


ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల జాబితాలో టెక్‌ సిటీ, స్టార్టప్‌లకు రాజధానిగా నిలిచిన బెంగళూరు నగరంలో ఆరో స్థానంలో నిలిచింది. డచ్ లొకేషన్ టెక్నాలజీ నిపుణుడు టామ్ టామ్ 2023 సంవత్సరం ఆధారంగా ఈ నివేదికను విడుదల చేశారు. 2022లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో నిలవడం గమనార్హం. గత ఏడాది బెంగళూరులో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సగటున 29 నిమిషాలు పట్టింది. బెంగళూరులో ప్రస్తుతం 28 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతున్నది.


సగటు వేగం 18 కిలోమీటర్లే.. 2023లో బెంగళూరులో రద్దీ సమయాల్లో వాహనాల సగటు వేగం గంటకు 18 కిలోమీటర్లు. బెంగళూరు ప్రజలు ఏడాదిలో సుమారు 132 గంటల ట్రాఫిక్‌లో సమయం వృథా అయ్యింది. 2023 నాటికి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరంగా లండన్ నిలిచిందని నివేదిక పేర్కొంది. లండన్‌లో సగటు వేగం గంటకు 14 కిలోమీటర్లు. లండన్‌తో పాటు పాటు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో గంటకు 16 కిలోమీటర్లు. కెనడాలోని టొరంటో నగరంలో గంటకు 18 కిలోమీటర్లు. ఇటలీలోని మిలన్ నగరంలో గంటకు 17 కిలోమీటర్లు.

పేరూలోని లిమాలో గంటకు 17కిలోమీటర్లు... పెరూలోని లిమాలో గంటకు 17 కిలోమీటర్లు. ఈ ఐదునగరాల అత్యంత రద్దీ నగరాల జాబితాలో టాప్‌-5లో నిలిచాయి. ఇదే జాబితాలో పుణే నగరం సైతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా, ట్రాఫిక్‌ అత్యధికంగా ఉండే నగరాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. పుణేలో పది కిలోమీటర్ల దూరం ప్రమాణం చేసేందుకు 27 నిమిషాల 50 సెకన్ల సమయం పడుతున్నది. ఇక్కడ వాహనాల సగటు వేగం గంటకు 19 కిలోమీటర్లు. పుణే తర్వాత బుకారెస్ట్, మనీలా, బ్రస్సెల్స్ నగరాలున్నాయి.

ట్రాఫిక్ లో ఢిల్లీ 47వ స్థానం... దేశ రాజధాని రాజధాని ఢిల్లీ అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో 44వ స్థానంలో ఉన్నది. ఇక్కడ రద్దీ సమయంలో సగటు వేగం గంటకు 24 కిలోమీటర్లు. ఇదే జాబితాలో ఆర్థిక రాజధాని ముంబయి ప్రపంచవ్యాప్తంగా 54వ స్థానంలో నిలిచింది. గతేడాది సెప్టెంబర్ 27న బెంగళూరులో అత్యధిక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ రోజు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి సగటున 32 నిమిషాలు పట్టింది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్‌ 55 దేశాల్లోని 387 నగరాలను కవర్ చేయగా..దేశవ్యాప్తంగా ఇంధన ఖర్చులు, కర్బన ఉద్గారాలను సైతం అంచనా వేసింది.

Read More
Next Story