
వనవాసి---- బిభూతి భూషన్ బందోపాధ్యాయ.
బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ పాత నవల కొత్త పరిచయం
ఇప్పుడే పూర్తి చేశాను.గుండెలో సముద్రహోరు.కళ్ళల్లో ఊట చలములు.హృదయాన్ని ఎవరో?కాదు,కాదు బిభూతే మేలితిప్పి పిండేస్తున్నాడు.భారంగా,నిస్సహాయంగా ఓ అరగంట నుండి కూర్చున్నాను. ఎవరితోనన్నా పంచుకోవాలి.బుక్కెడు మంచినీళ్లు దొరకని అనంత సముద్రాలలో విరిగిన తెడ్డుతో పడవపై పయనిస్తున్నాను.
బిభూతిభూషణ్ బందోపాధ్యాయ అనగానే పాఠకుల మనసులో "పథేర్ పాంచాలీ" మెదులుతుంది.సత్యజిత్ రే'పతేర్ పాంచాలి'కి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిపెట్టాడు.'వనవాసి'ద్వారా బిభూతిభూషన్ తెలుగు పాఠకులకు మరింత దగ్గరయ్యాడు.
బిభూతి భూషణ్ 1894లో కలకత్తాకు ఉత్తరంగా వందమైళ్ళ దూరంలో ఉన్న మురాటిపూర్ గ్రామంలో పుట్టేడు.ఆయన బాల్యమంతా బీదరకంతోనే గడిచిపోయింది.మద్య మధ్యలో రకరకాల వృత్తులు చేసినా ఎక్కువ భాగం ఉపాధ్యాయుడే.17నవలలు,20కథా సంకనాలతో 50 వరకు పుస్తకాలు ప్రచురించారు.దట్టమైన ప్రకృతితో మమేకమై,అంతరించిపోతున్న అరణ్యాల గురించి మనుసలకు సునికితంగా హత్తుకునేలా రాసిన అరణ్యక (తెలుగులో వనవాసి)బిభూతి విశిష్ట రచనగా గణతికెక్కింది.బిభూతి 56 సంవత్సరాల వయసులోనే 1950లో మరణించారు.
అరణ్యకను సూరంపూడి సీతారాం(తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లిలో జన్మించారు)వనవాసి పేరుతో తెలుగు పాఠకులకు అందించారు.సహజ సుందర అనువాదాల రూపంలో ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయసాహిత్యాన్ని తెలుగు పాఠకులకు దగ్గర చేసిన ఘనత సీతారాం గారిది.సీతారాం 1997లో మరణించారు.
నవలంతా అన్నార్తులైన గనోరితివారి,గనూమహతో,దోషాధజాతి మహిళలు,గంగోతాబాలుడు విషువా,బిచ్చమెత్తుకునే గిరిదారిలాల్,విత్తంపట్ల నిరాశక్తి,పెద్దనష్టాలపట్ల కూడా నిర్లక్ష్యంచూపే దౌతాల్ సాహూ,ఏకాంత నిర్వికార జీవితం గడిపే జయపాల్,గిరగిరనాట్యం పట్ల విపరీతమైన ఆసక్తిగల 12 ఏళ్ళ ధాతురియా,స్వచ్ఛకాలపు సాధుపుoగవుడు,కలరా కబళిస్తున్నప్పుడు నిస్వార్థంతో వైద్యసేవ చేసిన రాజుపాండే,కలరాతో సరైన వైద్యము లేక చనిపోయిన రోగులు,హనుమంతుడు తప్ప మరోదేవుడు లేడనే ద్రోణుడు,విద్యార్థుల కోసంచూసే ఉపాద్యాయుడు పేద బ్రాహ్మణ మటకనాథ్,ఆరునెలల గంగోతా పిల్లాడిని ఎత్తుకుపోయిన పులి,
నక్ చేదిభక్త పెద్దభార్య తులసి,జబ్బుపడ్డ బిడ్డను పోగొట్టుకొని రాజపుత్ర యువకుడి మాయమాటల్లోపడి ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయిన చిన్నభార్య మంచి,పక్షులవేట నేర్పిన,సీతాఫలాలు కోచుకోచ్చి కుటుంబాన్నిగడిపే జాయ్ సీతారాo కూతుళ్లు సురతీయా,ఛనియాలు, రెండు పర్వతాలు కలుసుకునే చోటుండే జటాజుటాదారి ఒంటరి వృద్ధసన్యాసి,నా అనేవారు ఎవ్వరూలేని,జ్ఞానమురాని ముగ్గురు పిల్లలతల్లి బెంగాలీ వితంతువు రాకుల్ బాయ్ భార్య,బాయిజీ కూతురు భర్త మరణంతో రాజపుత్రులు గంగోతాలు వెలివేయగా,కచేరీ దగ్గర ఎంగిలి మెతుకుల కోసం చలిని లెక్క చేయకుండా నిలబడే,రాలిన రేగిపళ్ళను ఏరుకున్న నేరానికి దాడికి గురైన కుంత.ఎక్కడెక్కడ పూల తీగలను తెచ్చి 'లవటూ లియా'లో నాటుతూ,వాటిని ప్రేమిస్తూ ,భూములు ఆస్తులు ఏవి ఆశించని నీరుపేద గుమస్తా యుగళ ప్రసాదుల చుట్టూనే నేనూ తిరుగుతున్నాను.
1862సంతాల్ జాతుల విప్లవనాయకుడు 92 ఏళ్ల దోబరూపన్నా వీరవర్దీ,పశువులుకాస్తున్నాడు.ఆతని ముగ్గురు కొడుకులు,వారి పదిమంది పిల్లలు కలిసేఉన్నారు.మనువళ్ళు డగరూ,జగరూపన్న.తాముండే అడివి ప్రపంచంలో ఎక్కడా లేదంటూనే భారతదేశం అనేది ఎక్కడ ఉందని అమాయకంగా ప్రశ్నించే అతని మునిమనమరాలు భానుమతి ఒకవైపు ఉండగా.
చేలు, కొద్దిరోజుల్లో పంటకు వస్తాయనగా ఛటుసింగ్ తన దేశం నుంచి అనేకమంది రాజపుత్ర జాతీయులను రప్పించి,కర్రలు బరిసెలు తెప్పించి దాచి ఉంచాడు.వారికిచ్చిన మూడు నాలుగు వందల బిఘాల పొలంలో పండే పంటే కాకుండా దౌర్జన్యం చేసి వెయ్యిన్నర బిఘాల పొలాలలో పంట మొత్తం స్వాధీన పరుచుకోవాలని ఛటుసింగ్, రాసవిహారిసింగ్, బలభద్రసెంగాత్ మరోవైపు.
నవల పొడుగునా గంగోతాస్త్రీల పట్ల,వారి నిస్కాపట సహజీవన సంస్కృతి పట్ల,అణగారినజాతులు,కులాలపట్ల రచయితకున్న ప్రగాఢమైన ప్రేమ కనిపిస్తుంది. వనవాసి లోని అరణ్యము ఊహా కల్పితంకాదు.కుశీనది ఆవలతీరాన దిగంతవ్యాప్తమైన మహారణ్యాలు,గయా జిల్లాలోని అరణ్యాలు ఈనవలా కథ చిత్రానికి ఆకుపచ్చని కాన్వాస్ అయ్యాయి.
సత్యచరణ్ మేనేజర్గా వెళ్లిన తర్వాత వేలవేల బిఘాలలో కొత్తకొత్త గ్రామాలు ఏర్పడ్డాయి.లవటూలియా,నాడా, పూల్కియా, చకుముకిటోలా రూపు మాచిపోయాయి.మహాలిఖారూపపర్వతం ఉండిపోయింది.నార మిల్లులు,బట్టలమిల్లులు,ఫ్యాక్టరీగోట్టాలు కనపడుతున్నాయి.100 సంవత్సరాల క్రితం భారత భూభాగంలో 40/ ఆక్రమించుకొని ఉన్న అడవులు ప్రపంచీకరణ,సరళీకరణ,ప్రైవేటీకరణ ప్రవేశించి 1997నాటికి 19% అయ్యాయి.ఈకొద్దిశాతంకూడా బడాబడా పెట్టుబడిదారులు,కార్పోరేట్ కంపెనీలు తవ్వుకుపోతున్నాయి.ఇప్పుడు ఏ శాతంకో?
బి.ఏ.చదివి,లా పాసైన సత్యచరణ్(సత్యచరణ్ ఎవరోకాదు' బిభూతిభూషనే')ఉద్యోగం దొరకక బిల్లు కట్టనందున వేరే చూసుకోమని మెస్ మేనేజర్ చెప్పటంతో కలకత్తా వీధులన్నీ దున్నుతూ తిరుగుతున్నపుడు, జమీందారుకొడుకు,తన సహవిద్యార్దైన 'అవినాష్' మాఎస్టేట్ అడివి పూర్ణియాజిల్లాలో20,30వేలబిఘాలు(బిఘాఅంటే6400చ.అ)ఉంటుందని,ఎస్టేట్ అడివికి మేనేజర్ గా వెళ్ళమంటాడు.
ఒకరోజు బి.యస్.డబ్యూ రైల్వేలో ఇరుప్రక్కల బఠానీచేల అందాలు,పరిమళాలు ఆస్వాదిస్తూ ఒకచిన్న స్టేషన్లో దిగి 16 క్రోసులదూరం, రాత్రoతా ఎద్దుల బండిలో ప్రయాణంచేసి ఏస్టేట్ చేరుకోవటంతో నవల మొదలవుతుంది.ఆ నిశ్శబ్దాన్ని చూసి భయపడతాడు.గోష్టిబాబు దిగులు పడకండి.అడివి మిమ్మల్ని ఆవహిస్తుందని చెప్తాడు.నిజంగానే ఆరేళ్ళపాటు,అడివి నాశనం అయినదాకా లవటూలియో,పూల్ కియా అరణ్యాలు,సరస్సులు,మోహన్ పురా,కురరూప పర్వత శ్రేణులు ఆవహిస్తాయి బిభూతిని.అవన్నీ తన వల్లే నాశనం అయ్యాయన్న దుఃఖంలో కలకత్తా చేరటంతో నవల ముగుస్తుంది.మనలను దుఃఖంలో ముంచి.

