'...చివరకు భగత్ సింగ్ ఎవరో తెలియని పరిస్థితి వచ్చింది: డా ఓబుల్ రెడ్డి
ఇపుడు మనువాదం,మతోన్మాదం ప్రబలుతున్నపుడు మానవతా విలువలను ప్రచారం చేసేందుకు లెనిన్ మీద పుస్తకం రావడం విశేషమని వక్తలు అన్నారు. వివరాలు
వామపక్షాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిళ్లా కుమార స్వామి రచించిన "లెనిన్ లేడు చూడు జనంలో ఉన్నాడు"( లెనిన్ జీవిత కథనం) పుస్తకాన్ని బ్రౌన్ గ్రంథాలయంలో డాక్టర్ సి ఓబుల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెనిన్ జీవితం ప్రతి కమ్యూనిస్టుకు ఆదర్శమని ఆయన మార్క్సిజాన్ని ఆచరణాత్మకంగా రుజువు చేశాడని అన్నారు. లెనిన్ చూపిన బాటలోనే ప్రపంచాప్తంగా అన్ని దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు పయనించాయని లెనిన్ పార్టీని ఎలా నిర్మించాలో చెప్పడం వల్ల ఆ విధానాలు నేటికీ అందరూ అనుసరిస్తున్నారని అన్నారు. లెనిన్ చెప్పినటువంటి మార్గం పోరాట మార్గమని ప్రపంచంలో ఏ మూల ఏ పోరాటం జరిగినా అది లెనిన్ చెప్పిన విధానమేనని అన్నాడు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ సి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ లెనిన్ గురించి నేటి యువత అసలు పట్టించుకోవడంలేదని ఆఖరికి భగత్ సింగ్ గురించి కూడా వారికి తెలియకుండా పోతోందని ఇటువంటి పరిస్థితుల్లో లెనిన్ జీవితం గురించి ఒక చిన్న పుస్తకం రాసి అందరికీ అందుబాటులోకి తెచ్చి దానిపైన చర్చ జరిగే విధంగా చేసినటువంటి కుమారస్వామి అభినందనీయుడని అన్నారు.
లెనిన్ జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి సమాజంలో మానవ విలువలు పెంచుకుంటాడని నేడు మానవత్వం కరువు అవుతుందని ఈ మానవ విలువలను పెంచడం ద్వారానే సమాజం ముందుకు పోతుందని అన్నారు. మనువాద మతోన్మాదాన్ని ఎదుర్కోవడమే లెనిన్ కు సరైన నివాళి అవుతుందని ఆయన అన్నారు.
సిపిఐ నాయకులు చంద్ర మాట్లాడుతూ లెనిన్ రష్యా లో విప్లవం తెచ్చినప్పటికీ ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీలకు ప్రపంచంలో ఉన్న అన్ని పోరాట మార్గాలకు ఆయనే ఆదర్శనీయమని అన్నారు లెనిన్ గురించి క్లుప్తంగా ఈ పుస్తకంలో పరిచయం చేసినందుకు కుమారస్వామికి అభినందనలు తెలుపుతున్నామని చెప్పారు సిపిఎం పార్టీ మాజీ నాయకులు నారాయణ మాట్లాడుతూ సృజాత్మకంగా ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి విప్లవాన్ని తీసుకురావడం లెనిన్ కే సాధ్యమైందని అన్నారు.
విప్లవం వచ్చేటప్పటికి 36,000 మందే కమ్యూనిస్టు పార్టీ సభ్యులు ఉన్నారని ఆ 36000 మందితోనే లెనిన్ విప్లవాన్ని తీసుకొచ్చాడు అని కానీ భారతదేశంలో దాదాపు అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలుపుకుంటే 10 లక్షల దాకా ఉంటారని అయినప్పటికీ భారతదేశంలో విప్లవం రాలేదని ఇది ఎంతమంది సభ్యులు ఉన్నారని కాకుండా ఎంత మంది పోరాటపటముతో ముందుకెళ్తున్నారని దాని బట్టి ఉంటాదని చెప్పారు ఈ కార్యక్రమంలో హేతువా సంఘం నాయకులు సి ఆర్ వి ప్రసాద్ బుద్ధిష్ట్ర సంఘం నాయకులు శివారెడ్డి భాస్కర్ సిపిఐ ఎంఎల్ నాయకులు సుబ్బరాయుడు రమణయ్య రాము అంకన్న శివ మొదలగు వారందరూ పాల్గొన్నారు.
Next Story