పార్కుల్లో పుడుతున్న మరో గ్రంథాలయోద్యమం
x
Source: Rural Development Trust (RDT)

పార్కుల్లో పుడుతున్న మరో గ్రంథాలయోద్యమం

పార్కులో చదువు "ఆలోచననాది-ఆచరణ మంచికంటి"ది.


'మరో గ్రంథాలయ ఉద్యమం' తరుఫున "పార్కుల్లో పుస్తకపఠన కార్యక్రమంను"హైదరాబాద్ మహానగరంలో ఇందిరాపార్కులో అక్టోబర్ 26వ తేదీ ఉదయం10గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పిల్లలు మరియుపెద్దలు పాల్గొనాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యమ కమిటీలు ఆహ్వానిస్తున్నారు.

గ్రంథాలయోధ్యమం
గాంధీ పార్కులో పిల్లలతో పుస్తకాలు ఎందుకు చదివించాలి? నాకు ప్రేరణ ఏమిటి? 2003 ప్రాంతంలో ఎంపీపీఎస్ పూలవారిపాలెం,చిన్నగంజాం మండలంలో చేస్తున్నాను.శ్రావణి అనే అమ్మాయి కాన్వెంట్లు తిరిగి రెండుతరగతి చివరిలో మాబడికి వచ్చింది. ఆటైంలో కోస్టల్ బెల్టుకు(తుఫాన్ వచ్చి)కొంత పర్నిచర్,విద్యార్థులకు ఫైల్,ఓ బుక్ లెట్ ఇచ్చారు. రోజుకు ఒకపేజీ చొప్పున రాసి అది తీసి ఫైల్ లో పెట్టుకోవాలి.ఈ పుస్తకం విద్యార్థులకు చాలా ఉపయోగపడింది.శ్రావణి క్రమంగా తరగతి పెరిగే కొద్దీ విపరీతంగా చదివేది.అప్పట్లో పాఠశాలలకు గ్రంధాలయపుస్తకాలు ఇవ్వలేదు.మాఇంట్లో ఉన్న చిన్నచిన్న పుస్తకాలు(కొన్నే ఉండేవి) ఇవ్వటం మొదలు పెట్టాను.మా కొలీగ్ కూతురు'యాని' తోడైంది. జ్యోతి సండేపత్రిక,పజిల్స్ కూడా తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. వారిద్దరికోసం ‘ప్రజాశక్తి’లో చిన్నచిన్న పుస్తకాలు కొనడం మొదలు పెట్టాను.
పాఠశాలల్లో ఇంట్రాక్షన్ ప్రోగ్రాం వచ్చింది. జంతువుల,పక్షుల గురించి మావిద్యార్థులు మాకు తెలియని విషయాలు కూడా తెలుగులో కవితాత్మకంగా భలే రాసేవాళ్లు. ఇంగ్లీషులో కూడా రాయటం నేర్పుతున్నాము.ఉదా.ఏనుగు గురించి
My name is kari,gajam,hathi....
I am a biggest animal on the earth.
I have four strang legs.
I have two small eyes.
I have two valuable teeth.
I have.................
...........................
ఎవరికి వాహనం,రంగు,తినేఫుడ్,నీళ్ళు రాస్తూ, చివరిలో But, I have no hands and
I have no harns రాసేవాళ్ళు. జిల్లా,హైదరాబాద్ నుండి వచ్చిన టీమ్లు ఆ వ్యాసాలుచూసి భలే పొంగిపోయేవారు.మాకు ఉత్సాహం నింపేవారు. 2013 కొరిసపాడు వెళ్లాను. పాఠశాలలకు గ్రంథాలయపుస్తకాలు విపరీతంగా ఇచ్చారు.వీటిలో కథాకార్డులు100,జనవిజ్ఞానవేదిక వారి పుస్తకాలుఉండేవి.లైబ్రరీపిరియడు,నోబ్యాగుడే వచ్చింది.బాగా ఉపయోగించుకున్నాం.పిల్లలందరు పుస్తకాలు చదవడం ప్రేయర్ లో చెప్పడం చేసేవారు.ఇలా కాదని పుస్తకాల విష్యు నమోదుపుస్తకంలో ప్రతి ఒక్కరూ రివ్యూ రాసేలా ప్రోత్సహించాను.ఇలా రాయటంలో పోటీపడ్డారు.ఇన్స్పెక్షన్కు వచ్చినటీం అబ్బుర పడింది.ఆశ్చర్యపోయింది.ఇలా రాయడం ఎక్కడా చూడలేదు అన్నారు.
పిల్లలకు రాయటం నేర్పాలని తప్పులున్నా పర్వాలేదు,అవిచూడం కథలు రాసుకు రమ్మన్నాం. వాళ్లను వీళ్లను అడిగి రోజుకోక కథ రాసుకోచ్చేవాళ్ళు."సిరంజన్" ఊహ లోకంలో విహరిస్తూ(హోంవర్క్ చెయ్యకపోయినా)రోజుకొక కథ రాసుకొచ్చేవాడు.సిరంజన్,వాళ్ళఅక్క కూడా కాన్వెంట్ నుండి వచ్చినవాళ్లే.అమ్మలు,నాన్నలు కుటుంబ సభ్యులు,పంటలు,ఊరు,టీచరు అన్నింటి మీద రాతల పోటీలు పెట్టేవాళ్ళం.పక్కనున్న లైబ్రరీయన్ సుగుణాకరరావు బాగా ఫ్రైజ్ లు ఇచ్చేవాడు.
ఈ విద్యార్థులతో అనుభవాల నుండే పిల్లల దగ్గరకు పుస్తకాలు తీసుకెళ్లాలనిపించింది. రిటైర్ అయిన తర్వాత మాఇంటి దగ్గరున్న గవర్నమెంట్ స్కూలుకు వెళ్లాను సంవత్సరం పాటు కొత్తగా వచ్చినరికార్డ్స్ వర్క్,పిల్లలు రెగ్యులర్ గా రాకపోవడం. కారణం ఏదైతేనేం పుస్తకాలను పిల్లల దగ్గరకు తీసుకెళ్లలేకపోయాను.
ఒంగోలు నుండి విజయవాడ పాదయాత్రతో మరో గ్రంథాలయోగ్యమంలో భాగమయ్యాను. గ్రంథాలయోద్యమంలో భాగంగా పాఠశాలలకు వెళ్లాం.విద్యార్థులకు ఉపాధ్యాయులకు పుస్తకాలు చదవడం ప్రాధాన్యత చెప్పేవాళ్లం.క్లాస్ పుస్తకాలు సిలబసులు,వాళ్ల ఇబ్బందులు చెప్పేవాళ్లు. నలుగురo సమకూడటం,ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో ఇలా వెళ్లడంకూడా క్రమంగా తగ్గిపోతుంది.
ఇలాకాదు, మంచికంటి! పెద్దవాళ్లదగ్గరకు, పిల్లలదగ్గరకు పుస్తకాలుతీసుకెళ్దాం.పార్కులలో ఓ పదిమందిమి కూర్చుని చదువుదాం. మనల్ని చూసి మరికొంతమంది చదవటం,వాళ్ళని చూసి మరికొంతమంది అన్నాను. ఖర్చు, నలుగురు రావడం సమస్య ఉండదన్నాను. మంచికంటి వెంటనే అంగీకరించి పెద్దలు ఫోన్లలో (పాదయాత్రఅనుభవాలతో) ముదిరిపోయారు. వాళ్లతో కాదు పిల్లలే మనలక్ష్యం అని మరుసటివారమే ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై ఉన్న గాంధీపార్క్ లో మొదలు పెట్టేసాం.
నాకు ఆలోచనరావటం గొప్పకాదు. దానిని ఆచరణలోకి తీసుకొచ్చిన 'మంచికంటి' ఉండటమే. ఆలోచనలు చాలామందికి వస్తాయి.ఆలోచనల కన్నా ఆచరణ ముఖ్యం.
పార్కులో గ్రంథాలయోద్యమ బ్యానర్ కట్టి ఓ 100 పుస్తకాలపైనే,నేలమీద ఆకర్షణయంగా పరిచే వాళ్ళం. స్లొగన్స్ కార్డులు డిస్ప్లే చేసేవాళ్లం. ఈ స్లోగన్ కార్డ్స్ భలే ఆకర్షించినవి. పార్కులో అడుగుపెట్టి, చూచిన ప్రతి ఒక్కరూ ఆగి స్లొగన్స్ చదివేవాళ్ళు. హ్యాండ్ మైక్ లో స్లొగన్స్ ఇచ్చేవాళ్ళం. చదవమని ఆహ్వానించేవాళ్ళం.కథలు చదివి వినిపించేవాళ్ళం.పుస్తకాల ప్రాధాన్యతను చెప్పేవాళ్ళo.స్లొగన్స్ కార్డ్స్ తర్వాత ఈహ్యాండ్ మైకు రెండవ ఆకర్షణ అయింది.పెద్దవాళ్లు చదివేవారు.పాటలు పాడేవారు.సుధాకర్,బా రహంతుల్లా,సి.ఏ.ప్రసాద్ మరొకందరు మాకు తోడయ్యారు.పిల్లలు,పెద్దలు చదవడం మొదలుపెట్టారు.5టు8 అనుకున్న వాళ్ళం,పిల్లలు చదువుతుంటే 9,9:30 దాకా ఉండేవాళ్ళం.
పిల్లలు పెద్దలు మాకోసం ఎదురు చూసేవాళ్ళు.వేళ్ళగానే బ్యానర్,స్లోగన్ల ఏర్పాట్లలో మేం ఉంటే,పిల్లలే పుస్తకాలు తీసి నేలమీద దబదబా పేర్చేవారు.స్వాతి అనే విద్యార్థి, వాళ్ళఅమ్మ రెగ్యులర్ గా వచ్చేవాళ్లు.పార్కులో గ్రంథాలయపుస్తకాల దగ్గర ఉన్నాం,రండనే ల్యాండ్ మార్కెర్పడింది.అక్కడ గడ్డిమీదనే చాలామంది కూర్చునేవాళ్లు.పుట్టినరోజుల,పెళ్లిరోజుల కేక్ కటింగులు ఇక్కడే.ఓసందడి,సమూహ వాతావరణం ఏర్పడింది.మాకుతోడు నాయుడు మాల్యాద్రిగారు,వాళ్ళవిద్యార్థులు మొక్కలు విత్తనాలు పంచేవాళ్లు.
హ్యాండ్ మైక్ లో తప్పులు లేకుండా చదివితే ఆపుస్తకం లేదా మరొకటి ఇస్తామని మంచికంటి ప్రకటించేవాడు. పిల్లలు మైక్ లో చదవడంకోసం,పుస్తకం కోసం పోటీలుపడ్డారు. పుస్తకాలు"అమ్ముతారా" అని అడగడంతో ఇది మరీ మంచిదని 20శాతం డిస్కౌంట్తో ఒక్కొక్కరోజు నాలుగైదు వందలకు కూడా అమ్మేవాళ్ళం.మొదట్లో పుస్తకాలు ఎత్తుకెళ్లేవాళ్లు"మంచిదొంగలు"అని నవ్వుకునేవాళ్ళం.ముస్లిం మహిళలు చాలాఇష్టంగా చదువుతున్నారు.
ఒకరోజు ఓఅతను,మాట్లాడిన తర్వాత 500రూ.లు ఇచ్చాడు,పుస్తకాలు ఇస్తున్న తీసుకోకుండా.మేము డబ్బులు తీసుకోమండి. ఇదంతా పిల్లలను ఫోన్లకు ఎడిట్ కాకుండా పుస్తకాల పట్ల ఆసక్తి పెంచడంకోసమే అన్నాo.మాఇంట్లో చాలా పుస్తకాలున్నాయి.ఇక్కడికే పుస్తకాలు కొన్నండి అన్నాడు.మేమిద్దరం చాలాహ్యాపీగా ఫీల్ అయ్యాం.మరిన్ని పుస్తకాలు వచ్చాయి.
రెగ్యులర్గా వచ్చేవాళ్లతో,ఆసక్తి ఉన్న వాళ్ళతో,జర్నలిస్టులతో మాట్లాడేవాళ్ళం.వాళ్ళ ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుని పుస్తకాలు ఇచ్చేవాళ్ళం.అవి తీసుకొచ్చి మరుసటి వారం మరికొన్ని పట్టుకెళ్లేవాళ్లు.పుస్తకాలు చిరిగినా పర్వాలేదు చుట్టుపక్కల పిల్లలతో చదివించమనే వాళ్ళం.
మాఇంటి నుండి పార్కుకు వెళ్లి రావడానికి ఆటోలకు వందరూపాయలు.అయినా టైంకు ఉండేవికావు.దాదాపు రెండుకి.మీ.మంచికంటి వచ్చి తీసుకెళ్లి,ఇంటిదగ్గర వదిలిపెట్టి వెళ్లేవాడు. చుట్టుపక్కల ఏమనుకున్నా పర్లేదు అనుకున్న. పార్కులో"చదువు ప్రోగ్రాo"నాకు అంతటి ప్రేరణను ఇచ్చింది.
ఇలా మరో గ్రంథాలయోద్యమం తరుపున పార్కులో రీడింగు ఒకటిన్నర సంవత్సరం నడిచింది. మంచికంటి అమెరికాయాత్ర,నా మూవింగ్,పనుల ఒత్తిడి,సమ్మర్లో రెగ్యులర్గా ఇద్దరం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల దగ్గరకు వెళ్లడం.ఒంగోలులో మేళ తాళాలతో, వేషాలతో పుస్తకంతో నడక, హైదరాబాద్ లో పుస్తకంతో నడక కార్యక్రమాలతో గాంధీ పార్కులలో గ్రంథాలయపుస్తకాల చదువు తాత్కాలికంగా ఆగింది.మా ఒంగోలు ఆగితేనేమి, మేం వెలిగించిన దీపం రెండు తెలుగురాష్ట్రాల్లో, యూనివర్సిటీలలో మొదలైంది.ఆలోచన నాది. ఆశ్చర్యలో పెట్టింది మంచికంటి.



Read More
Next Story