మూగజీవాల పాలిట వరం!!
x

మూగజీవాల పాలిట వరం!!

గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌ నగర్‌ సిటీ నుంచి ఔటర్‌కి వెళుతుంటే 'గ్రీన్ జోన్' వస్తుంది. అక్కడ ఏర్పాటైందే వంతార.


గుజరాత్‌.. ప్రస్తుత వైబ్రెంట్‌ స్టేట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రం. ఆ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌ నుంచి హైవే మీది నుంచి 90 కిలోమీటర్లు ప్రయాణిస్తే జామ్‌నగర్‌ వస్తుంది. జామ్‌ నగర్‌ సిటీ నుంచి ఔటర్‌కి వెళుతుంటే 'గ్రీన్ జోన్' వస్తుంది. అక్కడ ఏర్పాటైందే వంతార. వంతార అంటే స్టార్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌. అదో జంతు సంరక్షణ శాల. జంతు పునరావాస కేంద్రం. దీన్ని ఏర్పాటు చేసింది ఈ దేశంలోని ప్రముఖ సంపన్నుడు, ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులు అయిన రిలయన్స్‌ అంబానీ కుమారుడు అనంత్‌. ఇందులో ప్రస్తుతం 200లకు పైగా ఏనుగులు, దాదాపు 300 పెద్ద పెద్ద పిల్లులు, 120 సరీసృపాలు ఉన్నాయి. వీటిని సంరక్షించడానికి ఏకంగా ఓ క్యాంప్‌ నడుస్తోంది. ప్రాణాపాయంలో ఉన్న జంతుకోటిని కాపాడడం ఈ ఈ జంతు సంరక్షణ శాల లక్ష్యం.

వంతార అంటే ఏమిటీ?

వంతార. ఇది దేశంలోనే అతిపెద్ద జంతు సంరక్షణశాల. మూగ జీవుల సంరక్షణకు రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించిన ఈ అతిపెద్ద జూ. జంతు సంరక్షణకు ఇక్కడ ఉన్న వసతులు దేశంలో మరెక్కడా లేవట. వంతారా అంటే అర్థం స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్. అచ్చతెలుగులో చెప్పుకోవాలంటే వనానికే వేగు చుక్క. ఈ పేరుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ వంతార జూను ప్రారంభించింది. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను కాపాడి వైద్యం అందించి మళ్లీ పునరావాసం కల్పించడం ఈ వంతార లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద ఇండియాలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో.. రిలయన్స్ గ్రీన్ బెల్ట్‌లో 6వందల ఎకరాల్లో విస్తరించి ఉంది.

ఇది ఎలా మొదలైందంటే...

దేశంలో అంతరించిపోతున్న జంతువుల్ని కాపాడేందుకు ఈ జూ ఏర్పాటైంది. ఈ జూ లో లక్ష చదరపు అడుగుల్లో ఆస్పత్రి, పరిశోధనా కేంద్రం ఉంది. మానవులకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ జంతువుల చికిత్సకు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ వంటి సదుపాయాలూ ఉన్నాయి. సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ ఉంది.

43 జాతులు.. 2వేలకు పైగా ప్రాణులు...

ఈ కేంద్రంలో 100 జాతులకు చెందిన 2 వేలకు పైగా ప్రాణులు ఉన్నాయి. మన దేశంలో అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు ఉన్నాయి. విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. ప్రస్తుతం ఇక్కడ 2వేలకు పైగా ఏనుగులు, 3వందలకు పైగా చిరుతపులులు, పులులు, సింహాలు, జాగ్వార్లు ఉన్నాయి. అలాగే.. 300కి పైగా జింకల లాంటి శాఖాహార జీవులు, 12వందలకు పైగా మొసళ్లు, పాములు, తాబేళ్లున్నాయి.


2 వందల ఏనుగుల్ని కాపాడారు...

జంతు సంరక్షణలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేశారు. వాటిని ఇప్పుడు వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూలో 100 జాతులకు పైగా ప్రాణులున్నాయి. అరుదైన జాతుల ప్రాణులను కూడా సంరక్షిస్తున్నారు. జూ ను చూసేందుకు 3 వేల-4 వేల మంది వస్తున్నారు. వందలాది మంది పని చేస్తున్నారు. సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించారు.

మూడేళ్ల సమయంలో ఏమి జరిగిందంటే...

ఈ జూ ఒక్కరోజుతో ఏర్పాటు అయింది కాదు. వంతార రూపు దాల్చడానికి మూడేళ్లకు పైగా సమయం పట్టింది. 'ఎప్పటి నుంచో జూ ఏర్పాటు చేయాలని ఉన్నా.. కరోనా సమయంలో వంతార గురించి ఆలోచించేందుకు ఎక్కువ సమయం దొరికింది' అని చెప్పారు అనిల్‌ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ. జూ లో సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. 'ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది' అన్నారు అనంత్‌. ఇది ఎలాంటి లాభాపేక్ష లేని.. సేవాగుణంతో తల్లిదండ్రులు ఇచ్చిన ప్రేరణతో స్టార్ట్ చేసిందని చెబుతున్నారు అనంత్ అంబానీ.

జంతు సంరక్షణ, సంక్షేమం కోసం ప్రముఖ నిపుణులతో కలిసి పనిచేస్తోంది వంతార. రక్షించిన ప్రాణి జాతులు వృద్ధి చెందడానికి సహజమైన, పచ్చని ఆవాసాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ యూనియన్ వంటి.. ప్రకృతి పరిరక్షణ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో భాగంగా వందలాది జంతువులను కాపాడారు. వేలాది ఇతర జంతువులు, పాములు, పక్షులు, ఖడ్గమృగం, చిరుతపులి, మొసలి వంటి కీలక జాతుల జీవులకు పునరావాసం కల్పిస్తోంది వంతార.

మెక్సికో, వెనిజులా నుంచి...

భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడంపైనే వంతార ఫోకస్ చేసింది. మెక్సికో, వెనిజులా మొదలైన దేశాలలో జరిగే అటవీ జంతువుల రెస్క్యూ మిషన్లలో కూడా వంతారా పాల్గొననుంది. వంతార అనేది ఒక కృత్రిమ అడవి. 6వందల ఎకరాల్లో ఈ అడవిని నిర్మించారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు.భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి.


అనంత్ అంబానీకి చిన్నతనం నుంచి జంతువులు అంటే చాలా ఇష్టం. వాటిని కాపాడటం మరింత ఇష్టం. అతని ఆలోచన, ఇష్టంతో రూపుదిద్దుకున్నదే ఈ వంతారా. దేశంలో అంతరించిపోతున్న జంతు జాతుల్ని రక్షించి ఆదర్శంగా నిలుస్తున్న ఈ రిలయన్స్ ఫౌండేషన్ మిషన్‌కు భారతదేశంతో పాటు.. అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభిస్తోంది.

Read More
Next Story