
జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 25 వరకు వాహనసేవలు, 26న పుష్పయాగం.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
ధ్వజారోహణంకు హాజరైన టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం ఉదయం 10.30 గం.లకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, ప్రత్యేక పూజలు చేపట్టి ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను , ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్షణం. కంకణబట్టార్ గా శ్రీ పి.కృష్ణసాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
17-02-2026
ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం – ఉ. 10.30 – 11.00 గంటల వరకు)
రాత్రి – పెద్దశేష వాహనం
18-02-2026
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
19-02-2026
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
20-02-2026
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
21-02-2026
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం.ల నుండి 09.00 గం.ల వరకు)
22-02-2026
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
23-02-2026
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
24-02-2026
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
25-02-2026
ఉదయం – చక్రస్నానం(ఉ. 08.00 నుండి 10.00 గంటల వరకు)
రాత్రి – ధ్వజావరోహణం( సా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)
26.02.2026.
మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం.
జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా టిటిడి పటిష్ట చర్యలు చేపట్టింది. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, పటిష్ట సెక్యూరిటీ ఏర్పాటు చేసారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
స్వామి వారి వాహన సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్.ఏ.సి ప్రెసిడెంట్ శ్రీ ఏ. వి. రెడ్డి, ఏఈవో శ్రీ రమేశ్, టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్, శ్రీ హరికృష్ణ, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

