20న తెనాలిలో అలూరి బైరాగి, శారదల శతజయంతి సభ
x
కవి ఆలూరి బైరాగి(ఎడమ), రచయిత శారద

20న తెనాలిలో అలూరి బైరాగి, శారదల శతజయంతి సభ

కేంద్ర సాహిత్య అకాడమీ, వీజీకే-వీవీఎల్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణ


తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత శారద, మరో ప్రముఖ కవి ఆలూరి బైరాగి శతజయంతి సభను ఈనెల 20వ తేదీన తెనాలిలో నిర్వ హించనున్నారు.

ఆరోజు ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాలులో మధ్యాహ్నం వరకు జరగనున్న శతజయంతి సభను కేంద్ర సాహిత్య అకాడమీ, స్వాతంత్య్ర యోధుడు వడ్లమూడి గోపాల కృష్ణయ్య, వడ్లమూడి వెంకట లక్ష్మమ్మ ఫౌండేషన్ సంయుక్తంగా జరుపనున్నారు.
ఈ సందర్భంగా ముత్యంశెట్టిపా లెంలో గురువారం ఫౌండేషన్ అధ్యక్షుడు, ప్రవాస భారతీయుడు డాక్టర్ బాబు ఆర్.వడ్లమూడి ఆహ్వన పత్రికను ఆవిష్కరించి, వివరాలను తెలియ జేశారు. డాక్టర్ బాబు ఆర్. వడ్లమూడి అధ్యక్షతన జరిగే ప్రారంభ సభలో సాహిత్య అకాడమీ, తెలుగు సలహామండలి సభ్యుడు వల్లూరు శివప్రసాద్ స్వాగతోపన్యాసం చేస్తారు.
కేంద్ర సాహత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్ 'ఆలూరి బైరాగి జీవితం, రచనలు' పై, పెనుగొండ లక్ష్మీ నారాయణ 'శారద జీవితం, రచనలు' అంశం పై ప్రసంగిస్తారు. ముఖ్యతిథిగా సుప్రసిద్ధ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విశిష్ట అతిథిగా శారద కుమార్తె శారద హాజరవుతారని తెలిపారు. అనంతరం కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన జరిగే తొలి సమావేశంలో కందిమళ్ల శివప్రసాద్, కొర్రపాటి ఆదిత్య, పేరిశెట్టి శ్రీనివాసరావులు ఆలూరి బైరాగి కవిత్వం, కథలు, నవల, నాటకం, హిందీ సాహిత్య కృషిపై పత్రసమర్పణ చేస్తారు.
మధ్యాహ్నం ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి అధ్యక్షతన ఏర్పాటయే సమావేశంలో కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ, చెరుకూరి సత్యనారాయణలు శారద కథా, నవలా సాహిత్యంపై పత్రసమర్పణ చేస్తారని వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి తుమ్మల కిషోర్ కుమార్, 'అరసం' జిల్లా అధ్యక్షుడు చెరుకు మల్లి సింగారావు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు గరికపాటి సుబ్బారావు, ప్రముఖ బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని పాల్గొన్నారు.


Read More
Next Story