పెరియార్ మీద విపరీతంగా వస్తున్న పుస్తకాలు...ఏమిటి దీనర్థం
x

పెరియార్ మీద విపరీతంగా వస్తున్న పుస్తకాలు...ఏమిటి దీనర్థం

ద్రవిడ ఉద్యమ తాత్వికుడు, హేతువాది, బహుజనవాది పెరియార్ రామస్వామి మీద ఈ తరంలో ఆసక్తి పెరుగుతూ ఉంది. చెన్నై బుక్ ఫెయిర్ లో కనిపించిన పెరియార్ పుస్తకాలే సాక్ష్యం.


-బి. గోపాల క్రిష్ణమ్మ


దేశమంతా ఒక వైపు బిజెపి రామనామం మారుమోగుతూ ఉంటే, మరొక తమిళనాడులో మరొక విచిత్రం జరుగుతూ ఉంది. అ క్కడ పెరియార్ పునరుజ్జీవనం పెరుగుతోంది. పెరియార్ గా పేరొందిన ఈరోడ్ వెంకటప్ప రామసామి (సెప్టెంబర్ 17, 1879- డిసెంబర్ 24, 1973) చుట్టూ నేడు వేడుకలు జరుగుతున్నాయి. చర్చ కొనసాగుతున్నాయి. విపరీతంగా పుస్తకాలొస్తున్నాయి. ఈ పుస్తకాలను విపరీతంగా జనం చదువుతున్నారు. మొత్తంగా, నాస్తికుడు, ద్రవిడఉద్యమ తత్వాతికుడైన పెరియార్ వారసత్వం బలపడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి సాక్ష్యం మొన్న చెన్నై లో ముగిసిన బుక్ ఫెయిర్.

పుస్తక పఠనం, సాహిత్యం పట్ల మక్కువ ప్రజలలలో పెరుగుతూ ఉందనేందుకు 2024 జనవరి 21న ముగిసిన చెన్నై బుక్ ఫెయిర్ 47వ ఎడిషన్ ఒక నిదర్శనం. అయితే, అదే సమయంలో పెరియార్ మీద ఆసక్తి ప్రజలల్లో విస్తరిస్తూ ఉందని కూడా చెన్నై బుక్ ఫెయిర్ వెల్లడించింది.

చెన్నై బుక్ ఫెయిర్ లోని 900 బుక్‌స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఇందులో కనీసం 60 స్టాల్స్‌ను చూసినప్పుడు అక్కడ ఒక్క పెరియార్ పుస్తకమైనా కనిపిస్తుంది. బుక్ స్టాల్స్ వాళ్లని వాకబు చేస్తే, పెరియార్ మీద విడుదలవుతున్న పుస్తకాల సంఖ్య పెరిగిందని, అదే సమయంలో వాటిని కొనే వారి సంఖ్య కూడా పెరిగిందని తెలుస్తుంది. ఇపుడు తమిళనాట ఒకటే వాతావరణం, పెరియారన్ ప్రేమించండి లేదా ద్వేషించండి... కానీ మీరు పెరియార్‌ను విస్మరించలేరు.

ఆత్మగౌరవ ఉద్యమ స్థాపకుడైన పెరియార్, సమకాలీన రచయితలు రాయడానికి తగిన ప్రేరణను ఇప్పటికీ అందిస్తూనే ఉన్నారు. 2023 చెన్నై బుక్ ఫెయిర్ తర్వాత ఒక సంవత్సరం లోనే, పెరియార్ ఇతివృత్తంతో దాదాపు 70 పుస్తకాలు విడుదలయ్యాయి. ఇస్రో శాస్త్రవేత్త మైల్‌స్వామి (Mylsamy Annadurai)అన్నాదురై రచించిన 'పెరియార్ అండ్ సైన్స్‌' (Peryar and Science) తోపాటు 'పెరియార్ ఆత్మగౌరవ ప్రచార సంస్థ' 41 పుస్తకాలను ఒక్కటే ప్రచురించింది. ‘దేశంలోని రాజకీయ వాతావరణం కారణంగా పెరియార్ అనేకమందిని కొత్తగా ఆకర్షిస్తున్నారు. తమిళనాడు యువత ఆయనను మత రాజకీయాలకు విరుగుడుగా చూస్తున్నారు’ అని మద్రాస్ విశ్వవిద్యాలయం తమిళ విభాగం మాజీ అధిపతి వి. అరసు అన్నారు.


ఇస్రో శాస్త్రవేత్త మైల్ సామి అన్నాదురై రాసిన పెరియారుమ్ అరివియలుమ్ (Periyaurm Ariviyalum) పుస్తకం కవర్ పేజీ



మతతత్వానికి విరుగుడు

39 ఏళ్ల కవి మోహన ప్రియ ఒక పెరియార్ పుస్తకాన్ని బుక్ ఫెయిర్‌లో తిరగేస్తూ, ఇలా అన్నారు, “కొన్ని వర్గాల సాంస్కృతిక, రాజకీయ ఆధిపత్యాన్ని మనం చూస్తున్నాం. పెరియార్ రచనలు ఈ రోజు మరింతగా అవసరం మని ఈ వాతావరణ చెబుతుంది’’. పెరియార్ ఆత్మగౌరవ ప్రచార సంస్థ ఇంతవరకు పెరియార్‌పై 790 పుస్తకాలను ప్రచురించింది. అయితే వీటిలో 460 పుస్తకాలు గత పదేళ్ల కాలంలో విడుదల కావడం పెరియార్ భావజాల విస్తృతికి ఖచ్చితంగా సంకేతమే.

''పెరియార్‌ గురించి చదివిన, చర్చించిన అనేక ఉద్యమాలను మనం చూశాం. అవి ద్రావిడర్ కళగం, ద్రవిడర్ విడుతలై కళగం, తంథై పెరియార్ ద్రావిడర్ కళగం వంటివి. కానీ ఈ ఉద్యమాలకు వెలుపల నుండి పెరియార్ గురించి మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది" అని జర్నలిస్ట్, రచయిత సుగుణ దివాకర్ అన్నారు.

“రచనలో, ప్రయాణంలో పెరియార్ స్థాయికి ఎవరూ సరిపోరు” అని అరసు అన్నారు. “పెరియార్ జీవితంతో దాదాపు మూడు వంతుల కాలం ప్రజా జీవితంలో గడిపారు. గత పదేళ్లలో, ఆయన ప్రసంగాలు, రచనల సంకలనాలు వెలువడ్డదాయి. ఐదు సంపుటాలుగా విడుదలైన నాన్ సొన్నాల్ ఉనక్కు యెన్ కోవమ్ వరదు (“నేను చెబితే మీకు కోపం ఎందుకు రాదు”) భాష, కళలు, సంస్కృతి, సాహిత్యం, తత్వశాస్త్రంపై పెరియార్ ప్రసంగాలను, రచనలను సంకలనం చేసింది.''

అంబేడ్కర్ టు మార్క్స్ రచనల ప్రచురణ కర్త

''పెరియార్ తన జీవిత కాలంలో హిందీ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించారు. భాషా సంస్కరణను ప్రవేశపెట్టారు. తిరుక్కురల్ సమావేశాలను నిర్వహించారు. పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలపై తమిళ అనువాదాలను విడుదల చేసిన మొదటి వ్యక్తి ఆయనే. కులనిర్మూలన, భగత్ సింగ్ నేను ఎందుకు నాస్తికుడిని, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో తదితర ఎన్నో పుస్తకాలను ఆయన తొలిసారిగా తమిళంలోకి తీసుకొచ్చారు'' అని దివాకర్ పేర్కొన్నారు.

1944లో పెరియార్ స్థాపించిన సామాజిక ఉద్యమమైన ‘ద్రావిడర్ కళగం’ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ప్రిన్స్ ఎన్నారెస్ ఇపుడు దేశవ్యాప్త రాజకీయ చర్చలో పెరియార్ ప్రభావం వివరించారు. “2015లో, ఐఐటీ మద్రాస్‌లో అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ (ఏపీఎస్‌సి)ని నిషేధించినప్పుడు, దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థులు నిరసన తెలిపారు. సంఘీభావంగా, వారు తమ సొంత ఏపీఎస్‌సి సంస్కరణను ప్రారంభించారు. బిర్సా ముండా, భగత్ సింగ్ వంటి నాయకుల పేర్లను ఈ గ్రూప్ టైటిల్‌లో చేర్చారు. పెరియార్ అలాగే తన స్థానంలో దృఢంగా నిలబడటమే కాదు, మళ్లీ దేశవ్యాప్త రాజకీయ చర్చల్లో కూడా వినిపిస్తున్నారు.''

యువతపై విస్తృత ప్రభావం

చెన్నై బుక్ ఫెయిర్‌ని సందర్శించిన ఒక ఇంజినీరింగ్ మాట్లాడుతూ, “పెరియార్ పఠనం నా ఆలోచనలను మార్చింది. ముఖ్యంగా కులం, మహిళల హక్కుల, మతానికి సంబంధించి హేతుబద్ధంగా ఆలోచించడానికి నాకు సహాయపడింది. ఆయన పరిచయం నాకు అభ్యుదయ సాహిత్యంతలుపులు తెరిచింది . నేను పెరియార్‌తో ఈ తత్వచింతన అధ్యయనం మొదలుపెట్టాను. అది నన్ను ఇప్పుడు అంబేద్కర్, ఎంగెల్స్, మార్క్స్‌ దాకా తీసుకెళ్లింది. ఇప్పుడు నేను మార్క్సిజం, పెరియారిజంపై వచ్చిన ఈ కొత్త తులనాత్మక విశ్లేషణ గ్రంథాన్నికొన్నాను" అని చెప్పాడు.

ఈయనే బుక్ ఫెయిర్ లో కనిపిస్తున్న పెరియార్ పుస్తకాలను బట్టి చూస్తే, ఆయన తాత్విక చింతన యువతరంలో ఆకర్షణ కోల్పోలేదని అర్థమవుతుంది.

.


Read More
Next Story