దాశరథి రాసిన మూడు అపురూప కీర్తనలు
x

దాశరథి రాసిన మూడు అపురూప కీర్తనలు

ఈ రోజు దాశరథి శతజయంతి ఆరంభం. త్యాగయ్య అన్నమయ్య, రామదాసులకు ధీటైన కీర్తనలు రాసిన కవి దాశరథి. స్వరకల్పన ఉండిఉంటే ఆయన ఆ కోవలోని వాగ్గేయ కారుడయ్యే వాడు


అద్భుతమైన కవి దాశరథిని తెలుగు సినిమాన్ని హృదయస్ఫూర్తిగా హత్తుకున్నది. ఆయన పాట మరచిపోలేనిది. ఆలాగే ఆయన రాసిన కీర్తనలు కూడా. త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు వంటి వారికి తీసిపోని రచయిత దాశరథి. స్వరకల్పన ఉండిఉంటే ఆయన ఆ బృందం లో చేరివుండే వాగ్గేయకారుడు.

ఆయన రచించిన మూడు కీర్తనలను ఆయన శతజయంతి సందర్భంగా గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఈ మధ్య ‘నడిరేయి ఏ జాములో’ అనే పాట ని రోజూ ఆ పాట వింటూ ఉంటాను . అందులో శ్రీవైష్ణవ విశిష్టాద్వైత తత్వాన్ని వివరిస్తునే పదాలు ‘‘మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ...విభునికి మా మాట వినిపించవమ్మా... స్వామి నిను చేర దిగి వచ్చునో తిరుమల శిఖరాలు దిగి వచ్చునో’’, అంటూ మరో చరణంలో ‘‘పతిదేవు ఒడిలోన మురిసేటివేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ’’ అంటూ అమ్మవారిని పురుషాకారాపు బాధ్యతను తీసుకుని శ్రీవేంకటేశునికి మోక్షానికి ఇవ్వాలని సిఫార్సు చేసుకుంటుందని దాశరథి తన కవితలో వివరించారు. ఎంత గొప్ప భావన. ఇది అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు కీర్తనలకు ఏ మాత్రం తీసి పోని రచన.

1. ఏడేడు శిఖరాల నే నడువలేనన్న భక్త కవి

నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో

తిరుమల శిఖరాలు దిగి వచ్చునో నడిరేయి ఏ జాములో

స్వామి నిను చేర దిగి వచ్చునో తిరుమల శిఖరాలు దిగి వచ్చునో

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ

మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ

పతిదేవు ఒడిలోన మురిసేటివేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ

విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను ఏపాటి కానుకలందించలేను

వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించి నా బాధ వినిపించలేను

అమ్మా....ఆ...ఆ..ఆ.. మముగన్న మాయమ్మ

అలివేలుమంగా....ఆ...ఆ... మముగన్న మాయమ్మ

అలివేలుమంగా విభునికి మా మాట వినిపించవమ్మా

ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా

కలవారినేగాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా

కన్నీటి బ్రతుకుల కనలేని నాడు స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా

అడగవే మా తల్లీ అనురాగవల్లీ అడగవే మాయమ్మ అలివేలు మంగా

నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చునో

తిరుమల శిఖరాలు దిగి వచ్చునో

ఈ విధంగా మామూలు పదాలతో విశిష్టాద్వైతాన్ని వివరించడం ఎవరి సాధ్యం అవుతుంది? (Nadireyi ye Jaamulo Rangula Ratnam Telugu Old Classics Ghantasala S Janaki ) రచన దాశరథి కృష్ణమాచార్య, గానం ఘంటసాల. ఈ పాటకు సరైన చిత్రాన్ని గీసిన వారు వడ్డాది పాపయ్య గారు.






వరంగల్లు లో రవి వర్మ ఫోటో స్టూడియోలో శ్రీ బిట్ల నారాయణ గారి కుమారుడు రవి వర్మ గీసిన దాశరథి చిత్రం ఇది





  1. శరణాగతి సిద్ధాంతం ‘‘రారాకృష్ణయ్యా రారా..’’

మరో శ్రీవైష్ణవ సిధ్దాంతం శరణాగతి. ఇది దాశరథి రాసిన గొప్ప గేయం ‘‘రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!’’ అనేకానేక కష్టాలలో పడిపోయిన తండ్రి పుత్రుడికి ఏమీ చేయలేక ఆత్మహత్యకు సముద్రానికి మునిగిపోదామంటూ వెళుతున్నపుడుకు ప్రబోధించే గీతం ఇది. దేవుడు దప్ప మరో గతిలేదనుకుని శరణాగతి అని నేర్పే గురువు ఉంటే చాలు.

దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు

ఆకలికి అన్నము వేదనకు ఔషదం పరమాత్ముని సన్నిధికి రావే ఓ... మనసా

రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

దీనులను కాపాడ రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

దీనులను కాపాడ రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా! రారా

పరమాత్ముడు, దేవుడు, దీనులుడు, నీవే ఇలవేలుపు, మొరలాలించే విభుడు, వరాలు కోరే వాడు. అజ్ఞానపు చీకటికి దీపము, అన్యాయాన్ని ఎదిరించే ధర్మం అని గీత చెప్పే గీతం ఇది.

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా

మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా

పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడవీవే

పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడవీవే

అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే

నీవే కృష్ణా..నీవే కృష్ణా..నీవే కృష్ణా రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

దీనులను కాపాడ రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

భక్తుడు నమ్ముకుంటే కుంటివాడివైనా నడిపిస్తామని. గ్రుడ్డివాడికి చూపేవాడు బృందావనం అని గురువు బోధిస్తున్నాడు. అంగవైకల్యాలు కొన్ని సమస్యలైతే, మూఢత్వం వస్తే జ్ఞానానికి ఏవిధంగా ఎవరిస్తారు? అది సన్నిధానం అంటారు. ఈ పాటలో ఒక్కో చరణంలో ఒక శాంతిని ఇచ్చి ఆశాదీపాన్ని చూపే దారి చూపుతారు. అదే అభియమిస్తుంది అనే విశ్వాసం అడగడుగునా వినపడుతుంది.

కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం

కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం

మూఢునికి జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం

మూఢునికి జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం

అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం

సన్నిధానం! దేవుని సన్నిధానం! సన్నిధానం రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

దీనులను కాపాడ రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా! కృష్ణా... కృష్ణా... కృష్ణా... కృష్ణా...

కరుణించే చూపులు, శరనొసగే కరములు, మూగవాడిని పలికించే వారు తల్లిని కృష్ణాడే దారి. అతనే ఆధారం, అతనే సమాధానం.

శ్రీకృష్ణుడే సనాతనమైన సంపూర్ణ అవతారం ఆ మహావిష్ణువు. ఆ కృష్ణుడే శరణు అంటాడు. శరణాగతి సిద్ధాంతాన్ని చెబుతుంది.

శరణుడు కనపడని గురువు శ్రీకృష్ణుడు అని భగవద్గీత చెప్పే గీతం ఇది.

కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా

కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా

మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా

మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా

నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రారా కృష్ణా...

నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రారా కృష్ణా..

కృష్ణా... కృష్ణా... రారా... కృష్ణా... రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

దీనులను కాపాడ రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

రారా కృష్ణయ్యా!

దాశరథి భగవద్గీత రహస్యాలను వివరించే గేయం, గొప్ప ప్రబోధ గీతం అంటారు. (Ra Ra Krishnayya (రారా కృష్ణయ్య) -Telugu Devotional Songs - In Ramu Telugu మూవీ ఈ పాట యు ట్యూబ్ లో వినవచ్చు చూడవచ్చు.రచన దాశరథి కృష్ణమాచార్య, గానం...ఘంటసాల వెంకటేశ్వరరావు)

3. రాసలీలా గేయం, మరో అద్భుతం

ఈ పాట కూడా దాశరథి శ్రీవైష్ణవ శ్రీకృష్ణుని రాసలీలా గేయం. ఆయన కవితలో వేణువులు, రాధమ్మ, పాలింపగ నడచే గోపాల, మొరలాలించడం వంటి దృశ్యాలు కళ్లముందు నిలబెడుతాయి.

వేయి వేణువులు మ్రోగేవేళ హాయి వెల్లువై పొంగేవేళ

రాసకేళిలొ తేలేవేళ రాధమ్మను లాలించే వేళ

నను పాలింపగ నడచీ వచ్చితివా గోపాలా మొరలాలింపగ తరలీ వచ్చితివా... గోపాలా

అర చెదరిన తిలకముతో అల్లదిగో రాధమ్మ అరజారిన పయ్యెదతో అదిగదిగో గోపెమ్మా

ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదుగో సత్యభామ పొదపొదలో ఎద ఎదలో నీ కొరకై వెదుకుచుండగా

ఓవైపు చెదరిన తిలకపు రాధమ్మ, ఆపక్కన గోపెమ్మా, ఎరుపెక్కిన కన్నుల సత్యభామ, ఎద ఎదలో వెతుక్కుంటున్నారట.

కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు

కరకు రాతి గుళ్లలో ఖైదీవై నిలిచావు ఈభక్తుని గుండెలో ఖైదీగా వుండాలని

నను పాలింపగ నడచి వచ్చితివా మొరలాలింపగ తరలీ వచ్చితివా... మొరలాలింపగ తరలీ వచ్చితివా...గోపాల నను పాలింపగ నడచి వచ్చితివా..ఆ..ఆ..ఆ.

చెరసాలల్లో ఖైదీగా. కాంతల కౌగిళ్లలో ఖైదీగా. రాతి గుళ్లలో ఖైదీ, భక్తుని గుండెలో ఖైదీ అయినాడట. ఎంత గొప్ప భావన. అను క్షణం శ్రీకృష్ణుడు, పరిపాలించే భక్తులు అని వివరిస్తున్నాడు. ఇది కూడా యుట్యూబ్ లో దొరుకుతుంది..

సంగీతం కె వి మహదేవన్, రచన, దాశరథి కృష్ణమాచార్య, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు)

ఇవికాక దాశరథ రాసిన చాలాగొప్ప గేయాలు ఉన్నాయి. అవన్ని వివరిస్తే అనేక వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే ఓ పుస్తకం లేదా పిహెచ్ డి రచన అవుతుంది. మచ్చుకు మూడు సినిమా గీతాలు తెలుసుకోగలుగుతాం.


Read More
Next Story