మృత్యువు ! (ఫారుఖ్ నజ్కీ కవిత)
x
Farooq Nazki (Source: Kashmir Observer)

మృత్యువు ! (ఫారుఖ్ నజ్కీ కవిత)

కాశ్మీర్ ఉర్దూ కవిత్వమే విలక్షణమయింది. నిరసన వ్యక్తీకరణ మీద నిషేధం ఉన్నపుడు మాట కవిత్వమై పెల్లుబికిందక్కడ. దానికి అప్రకటిత నాయకుడు ఫారుఖ్ నజ్కీ




మృత్యువు !



-ఫారూఖ్ నజ్కి (కశ్మీర్ కవి)

తెలుగు అనుసృజన 'గీతాంజలి’


***
ఈ మృత్యు ఘడియలు ఎంత విచిత్రమైనవో కదా...!
కొన్నిసార్లు అసలు భయమే కలిగించదు .
మరికొన్నిసార్లు ఆశ పుట్టించే ప్రియురాలు లాంటిది కూడా కాదు ఈ మృత్యువు !
కానీ... ఈ మనిషున్నాడు చూడండీ అంతే విచిత్రమైన వాడు అచ్చం మృత్యువులా !
ఒక పక్క మృత్యు భయంతో వణుకుతాడు !
బతుకు ఆశల దారాల్ని గట్టిగా ఒడిసి పట్టుకుంటాడు .
నిజానికి అతనికి మృత్యువంటే..ఏమిటో తెలుసు !
అయినా కానీ అతను
భయానికి..ఆశలకి మధ్య తేడా కూడా ఏంటో తెలిసిన వాడు !
తను చేసిన కర్మల ఫలితంగా బహుశా మృత్యువును తప్పించుకుంటూ ఎటెటో పరిగెడుతూ ఆయాసపడుతూ ఉంటాడు.
అసలీ మృత్యువనేది జీవించడానికో ఆసరా అని అతనికి స్పష్టంగా తెలుసు..
మృత్యు క్షణాలు విచిత్రాతి విచిత్రమైన వని కూడా తెలుసు !
భీతి కలిగించీ కలిగించని...ప్రియురాలిలా ఆశ పుట్టించీ.. పుట్టించని మృత్యువంటే ఏంటో.. నిజానికి మనిషికి గాక ఇంకెవ్వరికి తెలుసని?
*****
(ఫారూఖ్ నజ్కి ప్రముఖ కశ్మీరీ కవి,జర్నలిస్ట్ తన 83వ వయసులో ఫిబ్రవరి 6-2024 లో మరణించారు.మరణించే దాకా కశ్మీర్ ఎదుర్కొంటున్న సంక్షోభం పైన తన దిక్కార గొంతును వినిపిస్తూనే ఉన్నారు )


Read More
Next Story