డీప్‌ఫేక్ ఆట కట్టు
ఆ మధ్య డీప్‌ఫేక్‌పై చాలా వార్తలొచ్చాయి. ఇటీవల ప్రముఖ నటీనటులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ‘డీప్‌ఫేక్’ వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి.
ఆ మధ్య డీప్‌ఫేక్ పై చాలా వార్తలొచ్చాయి. ఇటీవల ప్రముఖ నటీనటులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ‘డీప్‌ఫేక్’ వీడియోలు నెట్టింట్లో వైరలయ్యాయి. కొందరు నెటిజన్లు వీటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటి నిరోధానికి చర్యలు తీసుకోవాలని గట్టిగానే డిమాండ్ చేశారు.
దీంతో వీటి కట్టడికి కేంద్రం దిగివచ్చింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ (central IT minister Ashwin vishnav) గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నిర్వాహకులతో సమావేశమయ్యారు.
‘‘డీప్‌ఫేక్ (deep fake) ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
దీని నిరోధానికి కొత్త మార్గదర్శకాలకు తీసుకొస్తాం.ఈ రోజే కార్యాచరణ మొదలుపెడతాం.’’ అని చెప్పారు. డీప్‌ఫేక్‌లను గుర్తించడం, పోస్టింగ్ చేయకుండా నియంత్రించడం, వైరల్ కాకుండా చూడడం గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం, మీడియా, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కలిసి పనిచేయాలని కోరారు.
ఏమిటీ డీప్‌ఫేక్..
టెక్నాలజీ సాయంతో చేయని పనులను చేసినట్లుగా.. చెప్పని మాటలను చెప్పినట్లుగా చూపించడమే డీప్ ఫేక్. పూర్తిగా అర్టిఫీషియల్ ఇమేజ్ లేదా అర్టిఫీషియల్ వీడియో అన్న మాట.