
రాజ్ బహదూర్
రావ్ ను రజనీకాంత్ గా మార్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?
ఆరు దశాబ్ధాలుగా తన దోస్తీ కంటిన్యూ చేస్తున్న సూపర్ స్టార్
రజనీకాంత్ భారతీయ సినిమాలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని సినీ రంగంలో ఓ సూపర్ స్టార్ లా ఇప్పటికి దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా నటించిన 171 చిత్రం కూలీ బాక్సాపీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
రజనీ- లోకేష్ కనగరాజ్ జంట బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు అనేక రికార్డులను బద్దలుకొట్టింది. బ్రహ్మస్త్ర సినిమాతో సహ సంవత్సరంలో అతిపెద్ద బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రికార్డులను చెరిపివేసింది.
సినీ విమర్శలకు ఇది పెద్దగా నచ్చనప్పటికీ, బాక్సాపీస్ గణాంకాలు మాత్రం వీటిని పట్టించుకోకుండా ముందుకే దూసుకుపోతున్నాయి. మనందరికి తెలిసిన విషయమే. రజనీ ఒకప్పుడూ బస్ కండక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు ఆయన కెరీర్ లో ‘కూలీ’ ఒక మైలురాయి. ఆయన ఒకప్పుడూ బెంగళూర్ బస్టాండ్ కొంతకాలం మూటలు కూడా మోశాడు.
కే. బాలచందర్ తీసిన అపూర్వ రాగంగల్(1975) అనే తమిళ చిత్రంతో రజనీకాంత్ తొలిసారిగా తెరంగ్రేటం చేశాడు. అప్పట్లో శివాజీ రావు గైక్వాడ్ అని ఆయన పేరు. సినిమాల్లోకి రాగానే ఆయన పేరు రజనీకాంత్ గా బాలచందర్ మార్చారు.
శివాజీ గణేషన్ అప్పటికే అక్కడ ఒక స్టార్. భారీగా అభిమానులు సంపాదించుకున్నారు. అందుకే రజనీకాంత్ గా స్క్రీన్ నేమ్ మార్చుకోవాల్సి వచ్చింది. 1966 లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని రజనీకాంత్ అనే పాత్ర పేరును శివాజీ రావు గైక్వాడ్ కు పెట్టారు.

రజనీకాంత్ తో రాజ్ బహదూర్
రజనీకాంత్ గా ఎలా మారాడంటే..
ఈ మలుపును రజనీ స్నేహితుడు ఇప్పటికి గుర్తు పెట్టుకున్నాడు. అసలు బాలచందర్ దగ్గరికి ఎలా చేరాడో ఆయన ప్రయాణంలో భాగమైన రాజ్ బహదూర్ ‘ది ఫెడరల్’ కు చెప్పారు. ‘‘ఒకసారి శివాజీ నాటకంలో నటిస్తున్నప్పుడూ తమిళ దర్శకుడు బాలచందర్ ఆయనను గమనించాడు.
దానికి ముగ్ధుడైన ఆయన, శివాజీని తమిళం నేర్చుకోమని సలహ ఇచ్చాడు. ఎందుకంటే శివాజీ అప్పటికీ కన్నడలో మాత్రమే అనర్గళంగా సంభాషణలు చెప్పేవాడు. శివాజీని వెంటనే నా దగ్గరకు వచ్చి ఆ సంఘటనను వివరించాడు.
‘ఇంత గొప్ప దర్శకుడు నిన్ను తమిళం నేర్చుకోమని అడిగితే, నీతో ఎంతో కొంత టాలెంట్ ఉండే ఉండాలి. కానీ ఇంత తక్కువ సమయంలో మీకు తమిళం ఎవరు నేర్పిస్తారు?’’ అని నేను అన్నాను. నాకు తమిళం తెలుసు.
ఈ కాబట్టి ఈ క్షణం నుంచి అతను నాతో తమిళంలో మాత్రమే మాట్లాడాలనే షరుతుతో నేను అతనికి నేర్పించాను. రెండు నెలల్లోనే శివాజీ తమిళం నేర్చుకోవడం ప్రారంభించారు’’ అని రాజ్ బహదూర్ అన్నారు.
కొన్ని రోజులకు అపూర్వ రాగంగళ్ సినిమాలో నటుల ఎంపిక సమయంలో శివాజీ బాలచందర్ కలిశాను. దర్శకుడు మొదట్లో తమిళం తెలియని వ్యక్తిని ఎంచుకోవడానికి సంకోచం వ్యక్తం చేశారు. కానీ శివాజీ స్పష్టమైన తమిళంలో మాట్లాడి ఆయనను ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీనితో ఆయన తన సినిమాలోని పాండియన్ పాత్రను ఆయనకు ఇచ్చారు. ఆ తరువాత రజనీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోలేదని బహదూర్ అన్నారు.
రూట్ 10 ఏ లో బీటీఎస్ కోసం కూలీ..
రజనీకాంత్ తన తొలినాళ్ల స్టార్ డమ్ కు రాజ్ బహదూర్ రుణపడి ఉన్నాడని చాలామందికి తెలుసు. తమిళ సినిమాకు సూపర్ స్టార్ ను అందించిన వ్యక్తి ఈయనే అని ప్రముఖ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఇటీవల చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ‘కూలీ’ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా రాజ్ బహూదర్ ను అభిమానులకు పరిచయం చేశారు.
‘‘ఆ సమయంలో నేను కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్ వంటి భారతీయ సినీ దిగ్గజాల మధ్య కూర్చున్నాను’’ అని బహదూర్ గుర్తు చేసుకున్నారు. ఆయన కోసం తమిళ సినిమా తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి’’ అని ఆయన గర్వంగా అన్నారు.
రజనీ సినిమాలలో బహదూర్ షా ‘భాషా’ అంటే చాలా అభిమానం. ఇదే సమయంలో రజనీ సినిమాలకి పదునైన విమర్శకుడు. ఆయన ఎత్తిచూపే బలహీనతలను మెరుగు పరుచుకోవడానికి తరుచుగా సూపర్ స్టార్ కృషి చేస్తుంటాడు. నిజానికి బహదూర్ గురించి రజనీకాంత్ స్వయంగా అసూయపడే విషయాలు ఉన్నాయి.
‘‘అతనికి(రజనీ) నా జట్టును చూసి అసూయ. నేను దానిని ప్రత్యేకంగా చూసుకుంటున్నట్లు అనిపించినప్పుడల్లా అతను వచ్చి నా జుట్టును చిందరవందర చేస్తాడు’’ అని బహదూర్ నవ్వుతూ చెప్పాడు. ఒకప్పుడు రజనీ జీవించిన సాధారణ జీవితానికి ఇది ఒక లింక్. ‘‘ప్రధాన నిర్ణయాలు తీసుకునే అప్పుడు రజనీ ఎల్లప్పుడూ నన్ను సంప్రదిస్తాడు.
నేను కూడా అతన్ని సంప్రదిస్తాను’’ అని అతను చెప్పాడు. శివాజీ ఒకప్పుడూ చాలా పేదవాడు.. చాలా పేదవాడు. 50 పైసలకు తన భుజాలపై సామాను మోసేవాడు. చాలా కష్టపడ్డాడు. అతను వాటిని మర్చిపోవాలని అనుకోడని బహదూర్ చెప్పారు.
రాజ్ బహదూర్- రజనీకాంత్ మధ్య స్నేహం దాదాపు ఆరు శతాబ్ధాల నాటిది. వీరు ఇద్దరు మొదటగా బెంగళూర్ లోని జయనగర్ 4వ బ్లాక్ బస్ డిపోలో కలిశారు. అక్కడ రజనీ బెంగళూర్ రవాణా సర్వీస్(బీటీఎస్) కి కండక్టర్ గా పనిచేస్తున్నాడు.
ఆగష్టు 29, 2023న రజనీకాంత్ బెంగళూర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ బస్ డిపోను సందర్శించి అందరిని ఆశ్చర్యపరిచాడు. తన కండక్టర్ రోజుల నాటి జ్ఞాపకాలను తిరిగి నెమరువేసుకుంటూ రజనీ దాదాపు 20 నిమిషాలు అక్కడి గడిపాడు.
ఆరు దశాబ్ధాల స్నేహం..
బీటీఎస్ సర్వీస్ రోజుల్లో రజనీకాంత్ సన్నిహిత స్నేహితుడు అయిన రాజ్ బహదూర్, రజనీకాంత్ ను నటుడిగా ప్రొత్సహించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇద్దరు డ్రైవర్, కండక్టర్ గా కలిసి పనిచేశారు. నటుడు కావాలనే తన కోరికను కొనసాగించమని, ఆయనకు ఆర్థిక మద్దతు ఇస్తామని చెప్పాడు.
రజనీకాంత్ మద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడూ ప్రతి నెలా తన సొంత జీతంలో సగం రజనీకి పంపేవాడు. అలా మూడు సంవత్సరాలు ఆర్థిక సాయం అందించాడు.
బీటీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించే నాటకాల్లో అతను ప్రదర్శన ఇవ్వడం మేము చూసేవాళ్లం. శివాజీ అసాధారణ నటుడు. అతనికి మొదట సినిమాలపై ఆసక్తి లేదు. కానీ నేను అతడిని ప్రోత్సహించాను.
రాజ్ బహూదర్ వినయం అనన్యసామాన్యమైనది. రజనీకాంత్ అద్బుతమైన విజయంలో తను ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదు. అతను ఇప్పటికి తెరవెనకే ఉండటానికి నిశ్చయించుకున్నాడు. చామరాజ పేటలో తన ఇంటిని కనుగొనడం అంత సులువుగా సాగలేదు. అది చాలా ఇరుకైన సందులో ఉంది.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అంకితం..
రజనీకాంత్ విధిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్ బహదూర్ పాత్రను ఎన్నడూ మరచిపోలేదు. వారి కథ సినిమా చరిత్రలో ఒక ఫుట్ నోట్ కంటే ఎక్కువ. ఇది నమ్మకం, స్నేహం, తిరుగులేని మద్దతు శక్తికి నిదర్శనం.
సినిమా ప్రారంభోత్సవాల నుంచి జాతీయ అవార్డుల వరకు ప్రతి ప్రధాన మైలురాయి వద్ద, సూపర్ స్టార్ తన స్నేహితుడిని సత్కరించడం ఒక విషయంగా చేసుకుంటాడు.
2021 లో న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్రర అవార్డులలో 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నప్పుడూ రజనీకాంత్ ఆ గౌరవాన్ని రాజ్ బహదూర్ కు అంకితం చేశారు.
‘‘నేను ఈ అవార్డ్ ను కర్ణాటకలోని నా స్నేహితుడు బస్సు డ్రైవర్, నా సహోద్యోగి. రాజ్ బహదూర్ కు అంకితం ఇస్తున్నాను. నేను బస్ కండక్టర్ గా ఉన్నప్పుడూ నాలోని నటుడిని చూసింది రాజ్ బహదూర్. నన్ను నేను నమ్మనప్పుడూ ఆయన నమ్మాడు. అందుకే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను’’ అని రజనీ అన్నారు.
ఆ ప్రతిష్టాత్మకమైన సమయంలో ఆయన పేరు వినగానే.. రాజ్ బహదూర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవార్డు తీసుకుంటున్నప్పుడూ ఆయన నా పేరు చెప్పాల్సిన పనిలేదు. ఇది ఆయన సమగ్రతను వినయాన్ని, తన ప్రయాణాన్ని సూచిస్తుంది. రజనీకాంత్, నా మధ్య ప్రేమ, ఆప్యాయత, నిజానికి ఆయన స్నేహితులిద్దరి మధ్య దశాబ్ధాలుగా అలాగే ఉన్నాయి’’ అని బహదూర్ భావోద్వేగంతో అన్నారు.

కన్నడ నటుడు అశోక్ తో రజనీకాంత్
మద్రాస్ ఫిల్మ్ ఇన్ట్సిట్యూట్ లో రజనీ అశోక్, రవీంద్రనాథ్ లతో కలిసి వసతిని పంచుకున్నాడు. 1972 బ్యాచ్ లో 36 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిని పుట్టన్న కనగల్ తో సహ దక్షిణ భారత సినిమా ప్రముఖుల కమిటీ ఎంపిక చేసింది. కర్ణాటక నుంచి ఎంపికైన వారిలో అశోక్, రవీంద్రనాథ్, రఘు, చంద్రహాస అల్వా, శివాజీ రావు గైక్వాడ్, అమీర్ ముల్లా, శశిభూషణ్ ఉన్నారు.
అశోక్, శివాజీ మధ్య స్నేహం బలంగా మొగ్గ తొడిగింది. రజనీకాంత్ ను అశోక్ ఒక కఠినమైన, కోపిష్టి యువకుడిగా గుర్తుంచుకుంటాడు. బాగా దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి. కానీ తరువాత మంచి వ్యక్తిగా ఎలా మారాడన్నది నాకు ఒక మిస్టరీ. కీర్తి, స్టార్ డమ్ అమాంతం పెరిగినా... అతనిలో ఎలాంటి మార్పు లేదు’’ అని అశోక్ గుర్తు చేసుకున్నాడు.
స్నేహం, విశ్వాసం, స్టార్ డమ్...
ఇన్స్టిట్యూట్ లో శివాజీ ఆర్థిక ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడంతో చాలాసార్లు మధ్యలోనే కోర్సును వదిలివేయాలని అనుకున్నాడు. కానీ రాజ్ బహదూర్ ను నిరాశపరచాలని అతను కోరుకోలేదు.
అతను తన చదువును కొనసాగించాడు. శివాజీకి డ్యాన్స్ క్లాసులకు హజరుకావడానికి సరైన బట్టలు కూడా లేవు. తగిన దుస్తులు దొరికే వరకూ రావద్దని డ్యాన్స్ మాస్టర్ చెప్పేవాడు’’ అని అశోక్ గుర్తు చేసుకున్నాడు.
2014 లో మరణించిన కన్నడ ప్రముఖ సినిమా ప్రముఖుడైన రవీంద్రనాథ్ ఒకసారి ఈ వ్యాస రచయితతో ఇలా అన్నాడు. ‘‘ మేము ఇతర కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పుడూ శివాజీ మాత్రమే వివిధ శైలులను అభ్యసించడానికి అక్కడే ఉండేవాడు.
అవే అతన్ని మిగిలిన వారిలో ప్రత్యేకంగా నిలబెట్టింది. అతను గంటల తరబడి ప్రాక్టీస్ చేసిన తరువాత సిగరేట్ తిప్పడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇతర నటులు సహజ నటనా పద్దతులపై దృష్టి సారిస్తుండగా, శివాజీ మాత్రం శైలీకృత పద్దతులపై ప్రాక్టీస్ చేసేవాడు’’ అన్నారు.
అశోక్ తన స్నేహితుడి గురించి గర్వంగా చెప్పుకునేవాడు. ‘‘మేము ఈ రోజు వరకు సన్నిహిత స్నేహితులుగా ఉన్నాము. నా పేరు అప్పట్లో వేణుగోపాల్. నన్ను వేణు అనే పిలుస్తాడు. నాకు మాత్రం అతను ఎప్పటికీ శివాజే.
మేము ఎప్పుడు కలిసినా అదే స్నేహంతో ఉంటాము. రాబోయే 50 సంవత్సరాలు అతను ఇలాగే తన విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించాడు.
Next Story